పాట 34
యథార్థంగా జీవించడం
-
1. తీర్పునిమ్ము, ప్రభువా యెహోవా,
నిన్నే నమ్ముకున్నా, యథార్థంగా ఉన్నా.
పరీక్షించు నా హృదయమును,
నాలోవుంటే చెడు తీసివేయి దేవా.
(పల్లవి)
నేమాత్రము నిశ్చయించుకున్నా,
యథార్థముగానే నడుస్తాను సదా.
-
2. నే చేయను దుష్టులతో స్నేహం;
వేషధారులంటే అసహ్యము నాకు.
పాపులతో, భక్తిహీనులతో
నా ప్రాణం చేర్చకు, యెహోవా నా దేవా.
(పల్లవి)
నేమాత్రము నిశ్చయించుకున్నా,
యథార్థముగానే నడుస్తాను సదా.
-
3. ప్రేమిస్తాను నీ మందిరమును.
చేస్తాను నిత్యము స్వచ్ఛారాధనను.
నీ ప్రేమను చాటిస్తానంతటా
బలిపీఠం చుట్టూ తిరుగుతూ నేను.
(పల్లవి)
నేమాత్రము నిశ్చయించుకున్నా,
యథార్థముగానే నడుస్తాను సదా.
(కీర్త. 25:2 కూడా చూడండి.)