పాట 111
మన సంతోషానికి కారణాలు
-
1. సంతోషించడానికి మనం
ఉన్నాయెన్నో కారణాలు.
మనతో చేరిపోతున్నాయి
ఇష్టవస్తువులు ఎన్నో.
మన హృదయాల్లో సంతోషం
వాక్యంలో వేళ్లూనుకుంది.
విశ్వాసం బలపడుతుంది
చదివితే దాన్ని రోజు.
హృదయపు లోతుల్లో నుండి
ఉప్పొంగుతుందీ సంతోషం.
సహనమిస్తాడు యెహోవా
కష్టాలు, కన్నీళ్లు వస్తే.
(పల్లవి)
సంతోషానికి కారణం
యెహోవా మన దేవుడు.
ఆయన చేసే కార్యాలు అన్నీ
ఆహ్లాదమిస్తాయి నిత్యం.
-
2. యెహోవా దేవుని కార్యాలే
ఆకాశం, భూమి, సముద్రం.
ఆశ్చర్యంతో కీర్తిస్తాం మనం
ఆయన సృష్టిని చూసి.
దేవుని ప్రభుత్వం గురించి
ప్రకటిస్తాం అందరికీ.
రాజ్య దీవెనల గురించి
సంతోషంగా చాటిచెప్తాం.
ఉదయపు కాంతిలా రాజ్యం
ఇస్తుంది నిత్య సంతోషం.
వచ్చే కొత్త భూమి, ఆకాశం
తెస్తాయి ఎంతో సంతోషం.
(పల్లవి)
సంతోషానికి కారణం
యెహోవా మన దేవుడు.
ఆయన చేసే కార్యాలు అన్నీ
ఆహ్లాదమిస్తాయి నిత్యం.
(ద్వితీ. 16:15; యెష. 12:6; యోహా. 15:11 కూడా చూడండి.)