రెండో కొరింథీయులు 10:1-18

  • పౌలు తన పరిచర్యను సమర్థించుకోవడం (1-18)

    • మన ఆయుధాలు లోకంలోని ప్రజలు వాడేవి కాదు (4, 5)

10  పౌలు అనే నేను క్రీస్తులాంటి సౌమ్యతతో, దయతో+ మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను మీ ముందు ఉన్నప్పుడు దీనంగా కనిపిస్తానని,+ మీ ముందు లేనప్పుడు ఉత్తరాల్లో ముక్కుసూటిగా మాట్లాడతానని మీలో కొందరు అంటున్నారు.+  నేను మీ దగ్గరికి వచ్చి మీతో ఉన్నప్పుడు వాళ్ల విషయంలో ధైర్యంగా, గట్టి చర్యలు తీసుకునే పరిస్థితి రాకుండా చూసుకోమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే, మేము ఈ లోక ఆలోచన ప్రకారం ప్రవర్తిస్తున్నామని వాళ్లు అనుకుంటున్నారు.  మేము ఈ లోకంలో జీవిస్తున్నా, లోకంలోని ప్రజలు చేసేలాంటి యుద్ధం చేయట్లేదు.  మా యుద్ధ ఆయుధాలు లోకంలోని ప్రజలు వాడేవి కాదు,+ అవి దేవుడు ఇచ్చినవి,+ బలమైన కోటల్ని కూడా కూలగొట్టేంత శక్తివంతమైనవి.  ఎందుకంటే మేము దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని, ప్రతీ ఆటంకాన్ని తిప్పికొడుతున్నాం;+ ప్రతీ ఆలోచనను బంధించి, క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం;  మీరు సంపూర్ణ విధేయత చూపిస్తున్నారని నిరూపించుకున్న తర్వాత, ఇంకా అవిధేయత చూపించేవాళ్లు ఎవరైనా ఉంటే, వాళ్లకు శిక్ష విధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.+  మీరు పైకి కనిపించే దాన్ని బట్టే విషయాల్ని అంచనా వేస్తారు. ఎవరైనా తాను క్రీస్తు అనుచరుణ్ణని బలంగా నమ్ముతుంటే, అతను ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచించాలి: అతనిలాగే మేము కూడా క్రీస్తు అనుచరులం.  ప్రభువు మాకు ఇచ్చిన అధికారం గురించి నేను కాస్త ఎక్కువ గొప్పలు చెప్పుకున్నా, నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి రాదు. మిమ్మల్ని పడగొట్టడానికి కాదుగానీ+ బలపర్చడానికే ఆ అధికారం ఇవ్వబడింది.  నా ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాననే అభిప్రాయం మీకు కలగకూడదని ఆ మాట చెప్పాను. 10  కొంతమంది, “అతని ఉత్తరాలు చాలా గంభీరంగా, శక్తివంతంగా ఉంటాయి; కానీ అతను మన ముందు ఉన్నప్పుడు మామూలుగా* కనిపిస్తాడు, అతని మాటల్లో వినడానికి ఏమీ ఉండదు” అని అంటున్నారు. 11  అలాంటివాళ్లు ఈ విషయాన్ని గ్రహించాలి, మేము మీ ముందు లేనప్పుడు ఉత్తరాల్లో ఏదైతే చెప్తామో, దాన్ని మీ దగ్గర ఉన్నప్పుడు చేతల్లో కూడా చూపిస్తాం.+ 12  తమను తాము సిఫారసు చేసుకునేవాళ్లతో సమానంగా ఉండడానికి గానీ వాళ్లతో పోల్చుకోవడానికి గానీ మేము సాహసించం.+ వాళ్లు తమ సొంత ప్రమాణాల ప్రకారం తమను తాము అంచనా వేసుకుంటూ, వాళ్లలో వాళ్లే పోల్చుకుంటూ తమకు అవగాహన లేదని చూపించుకుంటున్నారు.+ 13  అయితే, దేవుడు మాకు నియమించిన పరిధుల్ని దాటి మేము గొప్పలు చెప్పుకోం కానీ, దేవుడు మాకు కొలిచి ఇచ్చిన ప్రాంతపు పరిధిలోనే గొప్పలు చెప్పుకుంటాం. మీరు కూడా ఆ పరిధి లోపలే ఉన్నారు.+ 14  మీరేదో మా పరిధిలో లేనట్టు, మేము మా పరిధి దాటి మీ దగ్గరికి రాలేదు. నిజానికి మీ దాకా వచ్చి, క్రీస్తు గురించిన మంచివార్తను మొట్టమొదట మీకు ప్రకటించింది మేమే.+ 15  అవును, మేము మాకు నియమించబడిన పరిధులు దాటి ఇంకెవరో పడ్డ కష్టం గురించి గొప్పలు చెప్పుకోవట్లేదు; కానీ మీ విశ్వాసం పెరుగుతుండగా, మేము చేసిన పని కూడా మా ప్రాంతపు పరిధిలో వృద్ధి చెందుతూ ఉంటుందని ఆశిస్తున్నాం. అప్పుడు మేము ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం, 16  మిమ్మల్ని దాటి వేరే దేశాలవాళ్లకు మంచివార్త ప్రకటించగలుగుతాం. దానివల్ల, వేరేవాళ్ల ప్రాంతంలో అప్పటికే జరిగిన దాని గురించి మేము గొప్పలు చెప్పుకునే పరిస్థితి రాదు. 17  “అయితే గొప్పలు చెప్పుకునేవాడు, యెహోవాను* బట్టే గొప్పలు చెప్పుకోవాలి.”+ 18  తనను తాను సిఫారసు చేసుకునే వ్యక్తిని యెహోవా* ఆమోదించడు+ కానీ, తాను సిఫారసు చేసే వ్యక్తినే ఆయన ఆమోదిస్తాడు.+

అధస్సూచీలు

లేదా “బలహీనంగా.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.