సామెతలు 27:1-27

  • స్నేహితుడి గద్దింపులు ప్రయోజనకరం (5, 6)

  • నా కుమారుడా, నా హృదయాన్ని సంతోషపెట్టు (11)

  • ఇనుము ఇనుముకు పదునుపెడుతుంది (17)

  • నీ పశువుల స్థితి తెలుసుకో (23)

  • డబ్బు శాశ్వతం కాదు (24)

27  రేపటి గురించి గొప్పలు చెప్పుకోకు,ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలీదు.+   నీ నోరు కాదు వేరేవాళ్లే* నిన్ను పొగడాలి;నీ పెదాలు కాదు ఇతరులే* నిన్ను కీర్తించాలి.+   రాయి బరువు, ఇసుక భారం;తెలివితక్కువవాడు పెట్టే చిరాకు ఆ రెండిటి కంటే బరువు.+   ఆగ్రహం క్రూరమైనది, కోపం వరద లాంటిది,అయితే రోషం* ముందు ఎవరు నిలబడగలరు?+   లోలోపల ప్రేమించడం కన్నా బహిరంగంగా గద్దించడం మేలు.+   స్నేహితుడు చేసే గాయాలు నమ్మకమైనవి,+అయితే శత్రువు బోలెడన్ని* ముద్దులు పెడతాడు.   కడుపు నిండినవాడు తేనెపట్టును కూడా తొక్కేస్తాడు,ఆకలిగా ఉన్నవాడికి చేదు కూడా తియ్యగా ఉంటుంది.   తన ఇల్లు విడిచి తిరిగేవాడుగూడు విడిచి తిరిగే పక్షి లాంటివాడు.   నూనె, ధూపం హృదయాన్ని సంతోషపెట్టినట్టేనిజాయితీతో ఇచ్చిన సలహా నుండి చిగురించే తియ్యని స్నేహం హృదయాన్ని సంతోషపెడుతుంది.+ 10  నీ స్నేహితుణ్ణి గానీ నీ తండ్రి స్నేహితుణ్ణి గానీ విడిచిపెట్టకు,కష్టం వచ్చిన రోజున నీ సహోదరుడి ఇంటికి వెళ్లకు;దూరంగా ఉన్న సహోదరుడి కన్నా దగ్గర్లో ఉన్న పొరుగువాడు మేలు.+ 11  నా కుమారుడా, తెలివిని సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు,+అప్పుడు నన్ను నిందించేవాడికి నేను జవాబివ్వగలుగుతాను.+ 12  వివేకం* గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు,+అనుభవం లేనివాడు నేరుగా ముందుకెళ్లి పర్యవసానాలు* అనుభవిస్తాడు. 13  పరిచయంలేని వాడికి హామీగా ఉన్న వ్యక్తి వస్త్రాన్ని తీసుకో,ఒకవేళ అతను హామీగా ఉన్నది అనైతిక* స్త్రీకైతే, అతను హామీగా పెట్టినదాన్ని లాక్కో.+ 14  ఒక వ్యక్తి పొద్దుపొద్దున్నే బిగ్గరగా తన తోటివాణ్ణి దీవిస్తేఅది అతనికి శాపంగా ఎంచబడుతుంది. 15  గయ్యాళి* భార్య, వర్షం కురిసే రోజున అదేపనిగా కారే పైకప్పు లాంటిది.+ 16  ఆమెను అదుపు చేసేవాళ్లు గాలిని అదుపు చేయగలరు,కుడిచేతితో నూనెను పట్టుకోగలరు. 17  ఇనుము ఇనుముకు పదునుపెట్టినట్టుఒక వ్యక్తి తన స్నేహితునికి పదునుపెడతాడు.+ 18  అంజూర చెట్టును పెంచేవాడు దాని పండ్లు తింటాడు,+తన యజమాని బాగోగులు చూసుకునేవాడు ఘనత పొందుతాడు.+ 19  ఒక వ్యక్తి నీళ్లలో ముఖం చూసుకున్నట్టు,ఎదుటివాడి హృదయంతో తన హృదయం చూసుకోవచ్చు. 20  సమాధికి, నాశనస్థలానికి* ఎప్పటికీ తృప్తి ఉండదు,+అలాగే మనిషి కళ్లు ఎప్పటికీ తృప్తిపడవు. 21  మూసతో వెండిని, కొలిమిలో బంగారాన్ని పరీక్షించినట్టు+ఒక వ్యక్తికి వచ్చే పొగడ్తలతో అతన్ని పరీక్షించవచ్చు. 22  రోట్లో నలగ్గొట్టిన ధాన్యంలాతెలివితక్కువవాణ్ణి రోకలితో దంచినాఅతని తెలివితక్కువతనం పోదు. 23  నీ పశువులు ఎలా ఉన్నాయో నీకు బాగా తెలిసుండాలి. నీ గొర్రెల్ని బాగా చూసుకో.*+ 24  ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు,+కిరీటం తరతరాలు ఉండదు. 25  పచ్చగడ్డి మాయమైపోతుంది, కొత్త గడ్డి మొలుస్తుంది,పర్వతాల మీది పచ్చిక సమకూర్చబడుతుంది. 26  మగ గొర్రెపిల్లల వల్ల నీకు బట్టలు వస్తాయి,మేకపోతులతో పొలం కొనుక్కోవచ్చు. 27  నీకు, నీ ఇంటివాళ్లకు, నీ సేవకురాళ్ల పోషణకుసరిపడా మేక పాలు ఉంటాయి.

అధస్సూచీలు

అక్ష., “పరాయివాడే.”
అక్ష., “పరదేశే.”
లేదా “అనుమానం.” అంటే వివాహజత విషయంలో కలిగే అనుమానం లాంటిది.
లేదా “పైపైన; బలవంతంగా” అయ్యుంటుంది.
లేదా “శిక్ష.”
లేదా “యుక్తి.”
లేదా “విదేశీ.”
లేదా “సతాయించే.”
లేదా “షియోల్‌కు, అబద్దోనుకు.”
లేదా “జాగ్రత్తగా గమనించు; శ్రద్ధపెట్టు.”