సామెతలు 14:1-35
14 నిజంగా తెలివిగల స్త్రీ తన ఇంటిని కడుతుంది,*+తెలివితక్కువ స్త్రీ చేతులారా దాన్ని పడగొడుతుంది.
2 నిజాయితీగా నడుచుకునేవాడు యెహోవాకు భయపడుతున్నాడు,కపట మార్గాల్లో నడిచేవాడు ఆయన్ని నీచంగా చూస్తున్నాడు.
3 మూర్ఖుల నోట అహంకారమనే బెత్తం ఉంది;అయితే తెలివిగలవాళ్ల పెదాలు వాళ్లను కాపాడతాయి.
4 పశువులు లేకపోతే మేతతొట్టి శుభ్రంగా ఉంటుంది,అయితే ఎద్దుల బలంవల్ల సమృద్ధిగా పంట పండుతుంది.
5 నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పడు,దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే.+
6 ఎగతాళి చేసేవాడు తెలివిని వెదుకుతాడు కానీ అది దొరకదు,అవగాహన ఉన్న వ్యక్తికి జ్ఞానం సులభంగా దొరుకుతుంది.+
7 తెలివితక్కువవాళ్లకు దూరంగా ఉండు,వాళ్ల నోటి నుండి జ్ఞానంగల మాటలు రావు.+
8 వివేకం* గలవాళ్లు తాము ఏ మార్గంలో వెళ్తున్నారో తెలివితో గ్రహిస్తారు,కానీ మూర్ఖులు తమ తెలివితక్కువతనం వల్ల మోసపోతారు.*+
9 తెలివితక్కువవాళ్లు తమ తప్పుల్ని చూసి నవ్వుతారు,+కానీ నిజాయితీపరులు రాజీపడడానికి సిద్ధంగా ఉంటారు.
10 హృదయంలో ఉన్న బాధ హృదయానికే తెలుస్తుంది,వేరేవాళ్లెవ్వరూ దాని సంతోషాన్ని పంచుకోలేరు.
11 దుష్టుల ఇల్లు నాశనమౌతుంది,+నిజాయితీపరుల డేరా వర్ధిల్లుతుంది.
12 ఒక మార్గం మనిషికి సరైనదిగా కనిపిస్తుంది,+కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.+
13 పైకి నవ్వుతున్నా లోపల బాధ ఉండవచ్చు,సంతోషం చివరికి దుఃఖంగా మారవచ్చు.
14 హృదయం స్థిరంగా లేనివాడు తన పనుల పర్యవసానాలు అనుభవిస్తాడు,+కానీ మంచివాడు తన పనుల వల్ల వచ్చిన మంచి ఫలితాలు ఆనందిస్తాడు.+
15 అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు,వివేకం* గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.+
16 తెలివిగలవాడు జాగ్రత్తగా ఉంటూ, చెడు నుండి పక్కకు తప్పుకుంటాడు,కానీ మూర్ఖుడు నిర్లక్ష్య స్వభావం* చూపిస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటాడు.
17 త్వరగా కోప్పడేవాడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు,+ఆలోచనా సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ద్వేషించబడతాడు.
18 అనుభవం లేనివాళ్లు తెలివితక్కువతనాన్నే చూపిస్తారు,కానీ వివేకం* గలవాళ్లు జ్ఞానాన్ని కిరీటంలా ధరిస్తారు.+
19 చెడ్డవాళ్లు మంచివాళ్ల ఎదుట వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది,దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగి నమస్కారం చేస్తారు.
20 పేదవాడిని ఇరుగుపొరుగువాళ్లు కూడా అసహ్యించుకుంటారు,+ధనవంతుడికి చాలామంది స్నేహితులు ఉంటారు.+
21 తోటి మనిషిని నీచంగా చూసేవాడు పాపం చేస్తున్నాడు,పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు సంతోషంగా ఉంటాడు.+
22 కుట్రపన్నేవాళ్లు దారి తప్పకుండా ఉంటారా?
అయితే మంచి చేయాలని ప్రయత్నించేవాళ్ల మీద ప్రజలు విశ్వసనీయ ప్రేమ చూపిస్తారు, వాళ్లను నమ్ముతారు.+
23 ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది,ఊరికే మాటలు చెప్పడం వల్ల లేమి కలుగుతుంది.+
24 తెలివిగలవాళ్ల ధనం వాళ్లకు కిరీటం,తెలివితక్కువవాళ్ల పనులు మరింత తెలివితక్కువతనానికి దారితీస్తాయి.+
25 నిజం చెప్పే సాక్షి ప్రాణాలు కాపాడతాడు,దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే.
26 యెహోవాకు భయపడే వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు,+ఆ భయమే అతని పిల్లలకు ఆశ్రయంగా ఉంటుంది.+
27 యెహోవా మీదుండే భయం జీవపు ఊట,అది మరణపు ఉరుల నుండి కాపాడుతుంది.
28 ఎక్కువమంది ప్రజలు ఉండడం రాజుకు ఘనత,+పౌరులు లేని పాలకుడు నాశనమౌతాడు.
29 కోప్పడే విషయంలో నిదానించే వ్యక్తికి గొప్ప వివేచన ఉంది,+ముక్కోపి తన తెలివితక్కువతనాన్ని ప్రదర్శిస్తాడు.+
30 ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం,*అసూయ ఎముకలకు కుళ్లు.+
31 దీనుల్ని మోసగించేవాడు వాళ్ల సృష్టికర్తను అవమానిస్తున్నాడు,+పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు ఆయన్ని మహిమపరుస్తున్నాడు.+
32 దుష్టుడు తన చెడుతనం వల్లే పతనమౌతాడు,నీతిమంతుని యథార్థత అతన్ని సంరక్షిస్తుంది.+
33 అవగాహన గలవాడి హృదయంలో తెలివి ప్రశాంతంగా నివసిస్తుంది,+అయితే మూర్ఖుల మధ్య అది తనను తాను వెల్లడి చేసుకుంటుంది.
34 నీతి దేశానికి ఘనత తెస్తుంది,+పాపం దేశ ప్రజలకు అవమానం తెస్తుంది.
35 లోతైన అవగాహనతో ప్రవర్తించే సేవకుణ్ణి చూసి రాజు సంతోషిస్తాడు,+అవమానకరంగా నడుచుకునేవాడి మీద అతని కోపం రగులుకుంటుంది.+
అధస్సూచీలు
^ లేదా “బలపరుస్తుంది.”
^ లేదా “యుక్తి.”
^ లేదా “ఇతరుల్ని మోసం చేస్తారు” అయ్యుంటుంది.
^ లేదా “యుక్తి.”
^ లేదా “తీవ్రమైన కోపం.”
^ లేదా “యుక్తి.”
^ లేదా “జీవం.”