యెహోషువ 21:1-45

  • లేవీయులకు ఇచ్చిన నగరాలు (1-42)

    • అహరోను వంశస్థులకు ఇచ్చినవి (9-19)

    • మిగతా కహాతీయులకు ఇచ్చినవి (20-26)

    • గెర్షోనీయులకు ఇచ్చినవి (27-33)

    • మెరారీయులకు ఇచ్చినవి (34-40)

  • యెహోవా వాగ్దానాలు నెరవేరాయి (43-45)

21  లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు యాజకుడైన ఎలియాజరు+ దగ్గరికి, నూను కుమారుడైన యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల పెద్దల దగ్గరికి వచ్చారు.  ఆ పెద్దలు కనాను దేశంలోని షిలోహులో+ వాళ్లతో ఇలా అన్నారు: “మేము నివసించడానికి నగరాలు, మా పశువుల కోసం వాటి పచ్చికబయళ్లు మాకు ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు.”+  కాబట్టి యెహోవా ఆదేశించినట్టుగా ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యంలో నుండి లేవీయులకు నగరాలు,+ వాటి పచ్చికబయళ్లు ఇచ్చారు.+  మొదటి చీటి కహాతీయుల కుటుంబాల+ పేరు మీద వచ్చింది. యాజకుడైన అహరోను వంశస్థులైన లేవీయులకు యూదా గోత్రంలో+ నుండి, షిమ్యోను గోత్రంలో+ నుండి, బెన్యామీను గోత్రంలో నుండి 13 నగరాలు చీటి ద్వారా ఇవ్వబడ్డాయి.  మిగతా కహాతీయులకు ఎఫ్రాయిము గోత్రంలోని, దాను గోత్రంలోని, మనష్షే అర్ధగోత్రంలోని కుటుంబాల్లో నుండి పది నగరాలు కేటాయించబడ్డాయి.*  గెర్షోనీయులకు+ ఇశ్శాఖారు గోత్రంలోని, ఆషేరు గోత్రంలోని, నఫ్తాలి గోత్రంలోని కుటుంబాల నుండి, బాషానులో ఉన్న మనష్షే అర్ధగోత్రంలోని కుటుంబాల నుండి 13 నగరాలు కేటాయించబడ్డాయి.+  మెరారీయులకు+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం, రూబేను గోత్రంలో నుండి, గాదు గోత్రంలో నుండి, జెబూలూను గోత్రంలో నుండి 12 నగరాలు కేటాయించబడ్డాయి.  అలా ఇశ్రాయేలీయులు యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టే ఈ నగరాలు, వాటి పచ్చికబయళ్లు చీట్లు వేసి లేవీయులకు ఇచ్చారు.+  యూదా గోత్రంలో నుండి, షిమ్యోను గోత్రంలో నుండి వాళ్లు ఇచ్చిన నగరాల పేర్లు ఇవే,+ 10  లేవీయుల కుటుంబాల్లో కహాతీయులైన అహరోను కుమారులకు అవి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే మొదటి చీటి వాళ్ల పేరు మీద వచ్చింది. 11  ఇశ్రాయేలీయులు వాళ్లకు యూదా పర్వత ప్రాంతంలోని కిర్యతర్బా+ (అర్బా అనాకీము ప్రజల తండ్రి), అంటే హెబ్రోను,+ దాని చుట్టుపక్కల పచ్చికబయళ్లు ఇచ్చారు. 12  అయితే ఆ నగర పొలాల్ని, దాని పల్లెల్ని వాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు. 13  వాళ్లు యాజకుడైన అహరోను కుమారులకు, నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన హెబ్రోను,+ దాని పచ్చికబయళ్లు; లిబ్నా,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు, 14  యత్తీరు,+ దాని పచ్చికబయళ్లు; ఎష్టెమోయ, దాని పచ్చికబయళ్లు; 15  హోలోను,+ దాని పచ్చికబయళ్లు; దెబీరు,+ దాని పచ్చికబయళ్లు; 16  అయీను, దాని పచ్చికబయళ్లు; యుట్ట,+ దాని పచ్చికబయళ్లు; బేత్షెమెషు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు. ఈ రెండు గోత్రాల్లో నుండి మొత్తం తొమ్మిది నగరాలు. 17  బెన్యామీను గోత్రంలో నుండి గిబియోను,+ దాని పచ్చికబయళ్లు; గెబా, దాని పచ్చికబయళ్లు;+ 18  అనాతోతు,+ దాని పచ్చికబయళ్లు; అల్మోను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 19  అహరోను వంశస్థులైన యాజకులకు మొత్తం 13 నగరాలు, వాటి పచ్చికబయళ్లు ఇవ్వబడ్డాయి.+ 20  లేవీయుల్లో మిగిలిన కహాతీయుల కుటుంబాలకు చీట్లు వేసి ఎఫ్రాయిము గోత్రంలో నుండి నగరాలు ఇచ్చారు. 21  ఇశ్రాయేలీయులు వాళ్లకు ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన+ షెకెము,+ దాని పచ్చికబయళ్లు; గెజెరు,+ దాని పచ్చికబయళ్లు; 22  కిబ్సాయిము, దాని పచ్చికబయళ్లు; బేత్‌-హోరోను,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 23  దాను గోత్రంలో నుండి ఎత్తెకే, దాని పచ్చికబయళ్లు; గిబ్బెతోను, దాని పచ్చికబయళ్లు; 24  అయ్యాలోను,+ దాని పచ్చికబయళ్లు; గత్రిమ్మోను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 25  మనష్షే అర్ధగోత్రంలో నుండి తానాకు, దాని పచ్చికబయళ్లు; గత్రిమ్మోను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం రెండు నగరాలు. 26  కహాతీయుల మిగతా కుటుంబాలు మొత్తం పది నగరాలు, వాటి పచ్చికబయళ్లు పొందాయి. 27  లేవీయుల కుటుంబాల్లోని గెర్షోనీయులు మనష్షే అర్ధగోత్రంలో నుండి నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురాన్ని అంటే బాషానులోని గోలాను, దాని పచ్చికబయళ్లు; బెయెష్టెరా, దాని పచ్చికబయళ్లు పొందారు; మొత్తం రెండు నగరాలు. 28  ఇశ్శాఖారు గోత్రంలో నుండి కిష్యోను, దాని పచ్చికబయళ్లు; దాబెరతు,+ దాని పచ్చికబయళ్లు; 29  యర్మూతు, దాని పచ్చికబయళ్లు; ఏన్గన్నీము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 30  ఆషేరు గోత్రంలో నుండి+ మిషెయలు, దాని పచ్చికబయళ్లు; అబ్దోను, దాని పచ్చికబయళ్లు; 31  హెల్కతు, దాని పచ్చికబయళ్లు; రెహోబు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 32  నఫ్తాలి గోత్రంలో నుండి నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన+ గలిలయలోని కెదెషు, దాని పచ్చికబయళ్లు; హమ్మోత్దోరు, దాని పచ్చికబయళ్లు; కర్తాను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం మూడు నగరాలు. 33  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం గెర్షోనీయులకు మొత్తం 13 నగరాలు, వాటి పచ్చికబయళ్లు వచ్చాయి. 34  మిగిలిన లేవీయులకు అంటే మెరారీయుల కుటుంబాలకు+ జెబూలూను గోత్రంలో నుండి యొక్నెయాము, దాని పచ్చికబయళ్లు; కర్తామ, దాని పచ్చికబయళ్లు; 35  దిమ్నా, దాని పచ్చికబయళ్లు; నహలాలు,+ దాని పచ్చికబయళ్లు వచ్చాయి; మొత్తం నాలుగు నగరాలు. 36  రూబేను గోత్రంలో నుండి బేసెరు,+ దాని పచ్చికబయళ్లు; యాహజు, దాని పచ్చికబయళ్లు;+ 37  కెదేమోతు, దాని పచ్చికబయళ్లు; మేఫాతు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 38  గాదు గోత్రంలో నుండి+ నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన గిలాదులోని రామోతు,+ దాని పచ్చికబయళ్లు; మహనయీము,+ దాని పచ్చికబయళ్లు; 39  హెష్బోను,+ దాని పచ్చికబయళ్లు; యాజెరు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు. 40  లేవీయుల కుటుంబాల్లో మిగిలినవాళ్లకు అంటే మెరారీయులకు వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం మొత్తం 12 నగరాలు కేటాయించబడ్డాయి. 41  ఇశ్రాయేలీయుల భూభాగంలో లేవీయులకు మొత్తం 48 నగరాలు, వాటి పచ్చికబయళ్లు ఉన్నాయి.+ 42  వాటిలో ప్రతీ నగరం చుట్టూ పచ్చికబయళ్లు ఉన్నాయి. 43  ఆ విధంగా యెహోవా తాను ఇస్తానని వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్నంతా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.+ వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని, దానిలో స్థిరపడ్డారు.+ 44  అంతేకాదు, యెహోవా వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసినట్టు వాళ్లకు అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చాడు.+ వాళ్ల శత్రువులందరిలో ఏ ఒక్కరూ వాళ్లకు ఎదురు నిలవలేకపోయారు.+ యెహోవా వాళ్ల శత్రువులందర్నీ వాళ్ల చేతికి అప్పగించాడు.+ 45  యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కటి* కూడా తప్పిపోలేదు; అవన్నీ నిజమయ్యాయి.+

అధస్సూచీలు

లేదా “చీటి ద్వారా ఇవ్వబడ్డాయి.”
లేదా “ఒక్క మాట.”