యెషయా 56:1-12
56 యెహోవా ఇలా అంటున్నాడు:
“న్యాయాన్ని సమర్థించండి,+ సరైనది చేయండి,ఎందుకంటే నా రక్షణ త్వరలోనే వస్తుంది,నా నీతి వెల్లడి చేయబడుతుంది.+
2 వీటిని చేసే వ్యక్తి,వీటిని గట్టిగా పట్టుకునే మనిషి,విశ్రాంతి రోజును పాటిస్తూ దాన్ని అపవిత్రపర్చకుండా ఉండే వ్యక్తి,+ఎలాంటి చెడూ చేయకుండా తన చేతిని బిగబట్టుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
3 యెహోవాను ఆరాధించే పరదేశి,+‘యెహోవా ఖచ్చితంగా తన ప్రజల్లో నుండి నన్ను వేరు చేస్తాడు’ అని అనుకోకూడదు.
అలాగే నపుంసకుడు,* ‘ఇదిగో! నేను ఎండిపోయిన చెట్టును’ అని అనుకోకూడదు.”
4 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు: “నా విశ్రాంతి రోజుల్ని పాటిస్తూ, నాకు నచ్చేవాటిని ఎంచుకుంటూ, నా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే నపుంసకులకు
5 నా మందిరంలో, దాని గోడల లోపల ఒక స్మారక చిహ్నాన్ని, ఒక పేరును ఇస్తాను.అది కుమారులు, కూతుళ్ల కంటే శ్రేష్ఠమైనది.
ఎప్పటికీ నిలిచివుండే పేరును వాళ్లకు ఇస్తాను,అది తుడిచిపెట్టుకుపోదు.
6 యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు పరిచారం చేయడానికి,యెహోవా పేరును ప్రేమించడానికి,+ఆయనకు సేవకులు అవ్వడానికి ముందుకొచ్చే పరదేశుల్ని,అంటే విశ్రాంతి రోజును పాటిస్తూ దాన్ని అపవిత్రపర్చకుండా ఉండే,నా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి ఉండే పరదేశులందర్నీ
7 నేను నా పవిత్ర పర్వతం దగ్గరికి తీసుకొస్తాను,+
నా ప్రార్థన మందిరంలో వాళ్లు సంతోషించేలా చేస్తాను.
నా బలిపీఠం మీద వాళ్లు అర్పించే సంపూర్ణ దహనబలుల్ని, బలుల్ని నేను అంగీకరిస్తాను.
ఎందుకంటే నా మందిరం అన్నిదేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని పిలవబడుతుంది.”+
8 ఇశ్రాయేలు ప్రజల్లో చెదిరిపోయిన వాళ్లను సమకూరుస్తున్న సర్వోన్నత ప్రభువైన యెహోవా+ ఇలా అంటున్నాడు:
“ఇప్పటికే సమకూర్చబడినవాళ్లు కాకుండా వేరేవాళ్లను కూడా నేను అతని దగ్గరికి సమకూరుస్తాను.”+
9 అడవి జంతువులారా,అడవిలోని మృగాల్లారా, ఆరగించడానికి మీరంతా రండి.+
10 అతని కావలివాళ్లు గుడ్డివాళ్లు,+ వాళ్లలో ఒక్కరు కూడా గమనించలేదు.+
వాళ్లంతా మూగ కుక్కలు, మొరగలేరు.+
వాళ్లు కూర్చొని రొప్పుతున్నారు; వాళ్లు నిద్ర ప్రియులు.
11 వాళ్లు తిండి కోసం ఎగబడే కుక్కలు;వాళ్లు ఎన్నడూ తృప్తిపడరు.
వాళ్లు అవగాహన లేని కాపరులు.+
వాళ్లంతా ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు;వాళ్లలో ప్రతీ ఒక్కరు అక్రమ లాభం కోసం పాకులాడుతూ ఇలా అంటారు:
12 “రండి, నేను కొంచెం ద్రాక్షారసం తెస్తాను,మనం మత్తెక్కే వరకు మద్యం తాగుదాం.+
రేపు కూడా ఇవాళ్టి లాగే ఉంటుంది, చెప్పాలంటే ఇంకా చాలా బాగుంటుంది!”