యెషయా 55:1-13
55 దాహంగా ఉన్నవాళ్లారా,+ మీరంతా నీళ్ల దగ్గరికి రండి!+
డబ్బు లేనివాళ్లారా, వచ్చి కొనుక్కొని తినండి!
అవును, వచ్చి డబ్బులు ఇవ్వకుండానే ఉచితంగా+ ద్రాక్షారసాన్ని, పాలను+ కొనుక్కోండి.
2 ఆహారంకాని దానికోసం మీరెందుకు డబ్బు చెల్లిస్తూ ఉన్నారు?సంతృప్తినివ్వని దానికోసం మీ సంపాదనను* ఎందుకు ఖర్చు చేయాలి?
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మంచి ఆహారాన్ని తినండి,+అప్పుడు మీరు నిజంగా పుష్టికరమైన వాటిని తిని ఎంతో సంతోషిస్తారు.+
3 చెవిపెట్టి విని నా దగ్గరికి రండి.+
నేను చెప్పేది వినండి, అలాచేస్తే మీరు జీవిస్తూనే ఉంటారు,అప్పుడు నేను దావీదుకు వాగ్దానం చేసిన విశ్వసనీయ ప్రేమకు అనుగుణంగామీతో తప్పకుండా శాశ్వత ఒప్పందం చేస్తాను;+ ఆ వాగ్దానం నమ్మదగినది.*+
4 ఇదిగో! నేను ఆయన్ని దేశాలకు సాక్షిగా,+జనాలకు నాయకుడిగా,+ అధిపతిగా+ చేశాను.
5 ఇదిగో! నీకు తెలియని జనాన్ని నువ్వు పిలుస్తావు,నీకు తెలియని దేశానికి చెందిన ప్రజలు నీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తారు.నీ దేవుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవాను బట్టి వాళ్లు అలా వస్తారు,+ఎందుకంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు.+
6 యెహోవా దొరికే సమయంలోనే ఆయన్ని వెదకండి.+
ఆయన దగ్గరగా ఉన్నప్పుడే ఆయన్ని వేడుకోండి.+
7 దుష్టుడు తన మార్గాన్ని,చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి;+అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు,+మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా* క్షమిస్తాడు.+
8 “ఎందుకంటే నా ఆలోచనలు మీ ఆలోచనల లాంటివి కావు,+మీ మార్గాలు నా మార్గాల లాంటివి కావు” అని యెహోవా అంటున్నాడు.
9 “ఆకాశం భూమి కంటే ఎత్తుగా ఉన్నట్టునా మార్గాలు మీ మార్గాల కన్నా ఎత్తుగా ఉన్నాయి,నా ఆలోచనలు మీ ఆలోచనల కన్నా ఉన్నతంగా ఉన్నాయి.+
10 వర్షం, మంచు ఆకాశం నుండి కురిసి,భూమిని తడిపి, విత్తనాలు మొలిచి ఫలించేలా చేసి,విత్తేవాడికి విత్తనాలు, తినేవాడికి ఆహారం ఇవ్వకుండా ఎలాగైతే తిరిగెళ్లవో
11 నా నోటి నుండి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది.+
అది ఫలితాలు సాధించకుండా నా దగ్గరికి తిరిగి రాదు;+బదులుగా అది నాకు నచ్చిన ప్రతీదాన్ని* ఖచ్చితంగా నెరవేరుస్తుంది,+నేను ఏ పని కోసం దాన్ని పంపించానో ఆ పనిని చేసి తీరుతుంది.
12 ఎందుకంటే మీరు సంతోషంతో బయల్దేరతారు,+శాంతితో తిరిగి తీసుకురాబడతారు.+
మీ ముందు పర్వతాలు, కొండలు సంతోషిస్తాయి; ఆనందంతో కేకలు వేస్తాయి;+పొలాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.+
13 ముళ్లపొదలకు బదులు సరళవృక్షాలు,+దురదగొండి చెట్లకు బదులు గొంజి చెట్లు పెరుగుతాయి.
అది యెహోవాకు కీర్తిని* తెస్తుంది,+ఎప్పటికీ నాశనంకాని శాశ్వతమైన సూచనగా పనిచేస్తుంది.”
అధస్సూచీలు
^ లేదా “చాలా కష్టపడి సంపాదించిన డబ్బును.”
^ లేదా “నమ్మకమైనది; ఆధారపడదగినది.”
^ లేదా “ధారాళంగా.”
^ లేదా “నా ఇష్టాన్నంతా.”
^ లేదా “పేరును.”