యెషయా 46:1-13

  • బబులోనీయుల విగ్రహాలకు, ఇశ్రాయేలు దేవునికి తేడా (1-13)

    • యెహోవా భవిష్యత్తును చెప్తాడు (10)

    • తూర్పు నుండి వేటపక్షి (11)

46  బేలు వంగుతోంది,+ నెబో తొంగి చూస్తోంది. వాటి విగ్రహాలు జంతువుల మీద, బరువులు మోసే పశువుల మీద పెట్టబడ్డాయి,+అవి అలసిన జంతువుల మీద బరువైన సామానులా ఉన్నాయి.   అవన్నీ కలిసి తొంగి చూస్తున్నాయి, వంగుతున్నాయి;అవి ఆ బరువుల్ని* విడిపించుకోలేవు,స్వయంగా అవే చెరలోకి వెళ్తాయి.   “యాకోబు ఇంటివాళ్లారా, ఇశ్రాయేలు ఇంటివాళ్లలో మిగిలినవాళ్లారా,+ మీరంతా నా మాట వినండి,మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని కాపాడుతూ వచ్చాను, గర్భంలో ఉన్నప్పటి నుండి మిమ్మల్ని మోస్తూ వచ్చాను.+   మీరు ముసలివాళ్లు అయ్యేవరకు నేను ఒకేలా ఉంటాను;+మీ తల నెరిసే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను. ఇప్పటివరకు చేసినట్టే, నేను మిమ్మల్ని మోస్తాను, ఎత్తుకుంటాను, కాపాడతాను.+   మేము ఒకేలా ఉన్నామని మీరు నన్ను ఎవరితో పోలుస్తారు?+నన్ను ఎవరితో సమానం చేస్తారు? నేను ఎవరిలా ఉన్నానని అంటారు?+   తమ సంచుల్లో నుండి విస్తారంగా బంగారాన్ని బయటికి తీసేవాళ్లు ఉన్నారు;వాళ్లు త్రాసులో వెండిని తూకం వేస్తారు. కంసాలిని కూలికి తెచ్చుకుంటారు, అతను దానితో ఒక దేవుణ్ణి చేస్తాడు.+ తర్వాత వాళ్లు దానికి సాష్టాంగ నమస్కారం చేస్తారు; అవును, దాన్ని పూజిస్తారు.*+   వాళ్లు దాన్ని భుజాల మీదికి ఎత్తుకుంటారు;+దాన్ని మోసుకెళ్లి, దాని స్థలంలో ఉంచుతారు, అది అక్కడే ఉండిపోతుంది. దాని చోటు నుండి అది కదలదు.+ వాళ్లు దానికి మొరపెట్టుకుంటారు, కానీ అది జవాబివ్వదు;అది ఎవ్వర్నీ కష్టాల్లో నుండి తప్పించలేదు.+   దీన్ని గుర్తుంచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దోషులారా, దీని గురించి ఆలోచించండి.   పూర్వకాలం నాటి పాత* సంగతుల్ని గుర్తుచేసుకోండి,నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు అని జ్ఞాపకముంచుకోండి. నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు. 10  మొదటి నుండి నేనే చివరికి ఏమౌతుందో చెప్తున్నాను,ఎప్పటినుండో నేనే ఇంకా జరగని సంగతుల్ని చెప్తున్నాను.+ ‘నా నిర్ణయం* నిలుస్తుంది,+నాకు ఏది ఇష్టమో అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.+ 11  నేను తూర్పు* నుండి వేట పక్షిని పిలుస్తున్నాను,+సుదూర దేశం నుండి నా నిర్ణయాన్ని* అమలు చేసే వ్యక్తిని పిలుస్తున్నాను.+ నేను చెప్పాను, దాన్ని జరిగిస్తాను. నేను దాన్ని సంకల్పించాను, దాన్ని నెరవేరుస్తాను కూడా.+ 12  మొండి హృదయంగల ప్రజలారా,నీతికి దూరంగా ఉన్న ప్రజలారా, నా మాట వినండి. 13  నేను నా నీతిని దగ్గరికి తీసుకొచ్చాను;అది దూరంలో లేదు,నేను దయచేసే రక్షణ ఆలస్యం అవ్వదు.+ నేను సీయోనులో రక్షణను కలగజేస్తాను, ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తాను.”+

అధస్సూచీలు

అంటే, జంతువుల మీద పెట్టబడిన విగ్రహాల్ని.
అక్ష., “దానికి వంగి నమస్కారం చేస్తారు.”
అక్ష., “మొదటి.”
లేదా “సంకల్పం; ఆలోచన.”
అక్ష., “సూర్యోదయం వైపు.”
లేదా “సంకల్పాన్ని; ఆలోచనను.”