కీర్తనలు 84:1-12

  • దేవుని గొప్ప గుడారం పట్ల ఇష్టం

    • ఒక లేవీయుడు పక్షిలా ఉండాలని కోరుకుంటాడు (3)

    • “నీ ప్రాంగణాల్లో ఒక్క రోజు” (10)

    • “దేవుడు సూర్యుడు, డాలు” (11)

సంగీత నిర్దేశకునికి సూచన; గిత్తీత్‌* అనే రాగంలో పాడాలి. కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం. 84  సైన్యాలకు అధిపతివైన యెహోవా,నీ గొప్ప గుడారం ఎంతో ప్రియమైనది.*+   యెహోవా ప్రాంగణాల దగ్గరికి వెళ్లాలనినా ప్రాణం ఎంతో తపిస్తోంది,అవును, తపించీ తపించీ నేను సొమ్మసిల్లిపోయాను.+ నా హృదయం, నా శరీరం సంతోషంతో కేకలు వేస్తూ జీవంగల దేవుణ్ణి స్తుతిస్తున్నాయి.   సైన్యాలకు అధిపతివైన యెహోవా,నా రాజా, నా దేవా, నీ గొప్ప బలిపీఠం దగ్గరపక్షికి కూడా నివాసం దొరుకుతుంది,వానకోకిలకు సైతం గూడు దొరుకుతుంది,అక్కడ అది తన పిల్లల్ని పెంచుతుంది.   నీ మందిరంలో నివసించేవాళ్లు ధన్యులు!*+ వాళ్లు నిన్ను స్తుతిస్తూ ఉంటారు.+ (సెలా)   నిన్ను బట్టి బలం పొందేవాళ్లు,నీ మందిరానికి వెళ్లే రహదారుల మీద మనసు నిలిపినవాళ్లు ధన్యులు.+   వాళ్లు బాకా లోయ* గుండా వెళ్లేటప్పుడు,దాన్ని ఊటల స్థలంగా మారుస్తారు.తొలకరి వాన* దాన్ని దీవెనలతో కప్పేస్తుంది.*   వాళ్లు నడుస్తూ అంతకంతకూ బలం పొందుతారు;+ప్రతీ ఒక్కరు సీయోనులో దేవుని ముందు కనబడతారు.   సైన్యాలకు దేవుడివైన యెహోవా, నా ప్రార్థన విను;యాకోబు దేవా, ఆలకించు. (సెలా)   మా డాలువైన దేవా,+ చూడు,*నీ అభిషిక్తుని+ ముఖాన్ని చూడు. 10  నీ ప్రాంగణాల్లో ఒక్క రోజు గడపడం, వేరేచోట వెయ్యి రోజులు గడపడం కన్నా మేలు!+ దుష్టుల డేరాల్లో నివసించడం కన్నా,నా దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడడమే నాకు ఇష్టం. 11  ఎందుకంటే, యెహోవా దేవుడు సూర్యుడు,+ డాలు;+ఆయన అనుగ్రహాన్ని, ఘనతను దయచేస్తాడు. యథార్థంగా నడుచుకునేవాళ్లకుయెహోవా ఏ మేలూ చేయకుండా ఉండడు.+ 12  సైన్యాలకు అధిపతివైన యెహోవా,నిన్ను నమ్ముకునే వ్యక్తి ధన్యుడు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “రమ్యమైనది.”
లేదా “సంతోషంగా ఉంటారు.”
లేదా “కంబళి చెట్ల లోయ.”
లేదా “ఉపదేశకుడు దీవెనల్ని చుట్టుకుంటాడు” అయ్యుంటుంది.
తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
లేదా “దేవా, మా డాలు వైపు చూడు” అయ్యుంటుంది.