కీర్తనలు 70:1-5
-
త్వరగా సహాయం చేయమని విన్నపం
-
“నా తరఫున త్వరగా చర్య తీసుకో” (5)
-
సంగీత నిర్దేశకునికి సూచన. జ్ఞాపకార్థంగా ఉండేందుకు* దావీదు కీర్తన.
70 దేవా, నన్ను కాపాడు;యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+
2 నా ప్రాణం తీయాలని చూసేవాళ్లుసిగ్గుపడాలి, అవమానాలపాలు అవ్వాలి.
నా ఆపద చూసి సంతోషించేవాళ్లుఅవమానంతో పారిపోవాలి.
3 “ఆహా! ఆహా!” అనేవాళ్లు
సిగ్గుతో వెనక్కి వెళ్లిపోవాలి.
4 కానీ నిన్ను వెదికేవాళ్లునిన్ను బట్టి సంతోషించి, ఉల్లసించాలి.+
నీ రక్షణ కార్యాల్ని ప్రేమించేవాళ్లు
“దేవుడు ఘనపర్చబడాలి!” అని ఎప్పుడూ చెప్పాలి.
5 అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను;+దేవా, నా తరఫున త్వరగా చర్య తీసుకో.+
నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే;+యెహోవా, ఆలస్యం చేయకు.+
అధస్సూచీలు
^ లేదా “జ్ఞాపకం చేసేందుకు.”