కీర్తనలు 54:1-7
-
శత్రువుల మధ్య సహాయం కోసం ప్రార్థన
-
“దేవుడే నా సహాయకుడు” (4)
-
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. మాస్కిల్.* దావీదు కీర్తన. జీఫువాళ్లు సౌలు దగ్గరికి వచ్చి, “దావీదు మా మధ్య దాక్కున్నాడు” అని చెప్పినప్పటిది.+
54 దేవా, నీ పేరును బట్టి నన్ను రక్షించు,+నీ శక్తితో నన్ను సమర్థించు.*+
2 దేవా, నా ప్రార్థన విను;+
నా నోటి మాటలు ఆలకించు.
3 పరాయివాళ్లు నా మీదికి లేస్తున్నారు,
క్రూరులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు.+
వాళ్లకు దేవుడంటే లెక్కలేదు.*+ (సెలా)
4 ఇదిగో! దేవుడే నా సహాయకుడు;+నాకు సహాయం చేసేవాళ్లకు యెహోవా తోడుగా ఉంటాడు.
5 నా శత్రువులు చేసే కీడును ఆయన వాళ్ల మీదికే రప్పిస్తాడు;+నువ్వు నమ్మకమైనవాడివి కాబట్టి వాళ్లను నాశనం చేయి.+
6 నేను ఇష్టంగా నీకు బలులు అర్పిస్తాను.+
యెహోవా, నేను నీ పేరును స్తుతిస్తాను. ఎందుకంటే, అది మంచిది.+
7 ప్రతీ కష్టం నుండి నువ్వు నన్ను రక్షిస్తావు,+నా శత్రువుల పతనాన్ని నేను కళ్లారా చూస్తాను.+