కీర్తనలు 43:1-5

  • దేవుడు న్యాయమూర్తిగా రక్షిస్తాడు

    • ‘నీ వెలుగును, సత్యాన్ని పంపించు’ (3)

    • “నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?” (5)

    • “దేవుని కోసం వేచివుంటాను” (5)

43  దేవా, నాకు న్యాయం తీర్చు,+నమ్మకద్రోహులైన* జనంతో నా తరఫున వాదించు.+ మోసంచేసే అనీతిమంతుల నుండి నన్ను రక్షించు.   ఎందుకంటే, నువ్వే నా దేవుడివి, నా కోటవి,+ నన్ను ఎందుకు త్రోసివేశావు? నా శత్రువు అణచివేయడం వల్ల నేను ఎందుకు బాధగా తిరగాలి?   నీ వెలుగును, నీ సత్యాన్ని పంపించు,+ అవి నన్ను నడిపించాలి;+నీ పవిత్ర పర్వతానికి, నీ గొప్ప గుడారానికి+ అవి నన్ను తీసుకెళ్లాలి.   అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరికి,నాకెంతో సంతోషాన్నిచ్చే నా దేవుని దగ్గరికి వస్తాను.+ దేవా, నా దేవా, వీణతో*+ నేను నిన్ను స్తుతిస్తాను.   నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది? నా లోపల ఎందుకు ఈ అలజడి?నేను దేవుని కోసం వేచివుంటాను,+ ఇప్పటికీ ఆయన్ని నా మహాగొప్ప రక్షకునిగా, నా దేవునిగా స్తుతిస్తాను.

అధస్సూచీలు

లేదా “విశ్వసనీయంగా లేని.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.