కీర్తనలు 40:1-17
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. శ్రావ్యగీతం.
40 యెహోవా కోసం నేను ఓపిగ్గా ఎదురుచూశాను,*సహాయం కోసం నేను పెట్టిన మొరను ఆయన చెవిపెట్టి* ఆలకించాడు.+
2 ఘోషించే నీళ్ల గోతిలో నుండి,లోతైన ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లాగాడు.
నా పాదాల్ని బండ మీద నిలిపాడు;నా అడుగుల్ని స్థిరపర్చాడు.
3 తర్వాత నా నోట ఒక కొత్త పాటను,+మన దేవుని స్తుతి పాటను పెట్టాడు.
అది చూసి చాలామంది సంభ్రమాశ్చర్యాలకు లోనైయెహోవా మీద నమ్మకం ఉంచుతారు.
4 యెహోవా మీద నమ్మకముంచే వ్యక్తి,తిరుగుబాటు చేసేవాళ్లను, అబద్ధాలాడేవాళ్లను అనుసరించని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, నా దేవా,నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేశావు,మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో;+
నీకు సాటి ఎవరూ లేరు;+నేను వాటి గురించి వివరించి చెప్పాలని ప్రయత్నిస్తే,అవి నేను లెక్కించలేనన్ని ఉంటాయి!+
6 బలిని, అర్పణను నువ్వు కోరుకోలేదు,*+కానీ నేను వినేలా నువ్వు నా చెవులు తెరిచావు.+
నువ్వు దహనబలుల్ని, పాపపరిహారార్థ బలుల్ని అడగలేదు.+
7 అప్పుడు నేను ఇలా అన్నాను: “ఇదిగో, నేను వచ్చాను.
గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడింది.+
8 నా దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం,*+నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.+
9 మహా సమాజంలో నేను నీతి సువార్త ప్రకటిస్తాను.+
నా పెదాల్ని మూసుకోను,+యెహోవా, అది నీకు బాగా తెలుసు.
10 నేను నీ నీతిని నా హృదయంలో దాచేయను.
నీ నమ్మకత్వాన్ని, రక్షణను ప్రకటిస్తాను.
నీ విశ్వసనీయ ప్రేమను, నీ సత్యాన్ని దాచకుండా మహా సమాజంలో తెలియజేస్తాను.”+
11 యెహోవా, నా మీద కరుణ చూపించకుండా ఉండకు.
నీ విశ్వసనీయ ప్రేమ, నీ సత్యం ఎప్పుడూ నన్ను కాపాడాలి.+
12 లెక్కలేనన్ని విపత్తులు నన్ను చుట్టుముడుతున్నాయి.+
నేను ఎన్నో తప్పులు చేశాను, ఎటు వెళ్లాలో నాకు తెలియట్లేదు;+అవి నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నాయి,నా గుండె జారిపోయింది.
13 యెహోవా, దయచేసి నన్ను కాపాడు.+
యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+
14 నా ప్రాణం తీయాలని చూసేవాళ్లంతాసిగ్గుపడాలి, అవమానాలపాలు అవ్వాలి.
నా ఆపద చూసి సంతోషించేవాళ్లుఅవమానంతో పారిపోవాలి.
15 “ఆహా! ఆహా!” అని నాతో అంటున్నవాళ్లు
తమకు జరిగిన అవమానాన్ని బట్టి నివ్వెరపోవాలి.
16 కానీ నిన్ను వెదికేవాళ్లు+నిన్ను బట్టి సంతోషించి, ఉల్లసించాలి.+
నీ రక్షణ కార్యాల్ని ప్రేమించేవాళ్లు
“యెహోవా ఘనపర్చబడాలి” అని ఎప్పుడూ చెప్పాలి.+
17 అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను;యెహోవా, నన్ను పట్టించుకో.
నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే;+నా దేవా, ఆలస్యం చేయకు.+
అధస్సూచీలు
^ లేదా “ఎంతగానో ఆశపెట్టుకున్నాను.”
^ లేదా “వినడానికి కిందికి వంగి.”
^ లేదా “ఇష్టపడలేదు.”
^ లేదా “నా కోరిక.”