కీర్తనలు 30:1-12

  • దుఃఖం సంతోషంగా మారింది

    • దేవుని అనుగ్రహం జీవితకాలం ఉంటుంది (5)

శ్రావ్యగీతం. ఇంటి ప్రతిష్ఠాపన గీతం. దావీదు కీర్తన. 30  యెహోవా, నువ్వు నన్ను పైకి ఎత్తావు* కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను;నువ్వు నా శత్రువుల్ని నా విషయంలో సంతోషించనివ్వలేదు.+   యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టుకున్నాను, నువ్వు నన్ను బాగుచేశావు.+   యెహోవా, నువ్వు నన్ను సమాధిలో* నుండి పైకి లేపావు.+ నన్ను సజీవంగా ఉంచావు; గోతిలోకి* దిగిపోకుండా నన్ను కాపాడావు.+   యెహోవా విశ్వసనీయులారా, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి,*+ఆయన పవిత్రమైన పేరుకు*+ కృతజ్ఞతలు చెల్లించండి;   ఎందుకంటే, ఆయన కోపం క్షణకాలమే ఉంటుంది,+కానీ ఆయన అనుగ్రహం జీవితకాలం ఉంటుంది.+ సాయంత్రం ఏడ్పు రావచ్చు, కానీ ఉదయాన్నే ఆనంద ధ్వనులు వినిపిస్తాయి.+   నాకు కష్టాలు లేనప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను”* అని అనుకున్నాను.   యెహోవా, నీ అనుగ్రహం నా మీద ఉన్నప్పుడు, నువ్వు నన్ను పర్వతంలా బలంగా చేశావు.+ కానీ నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు, నేను బెదిరిపోయాను.+   యెహోవా, నేను నీకు మొరపెడుతూ వచ్చాను;+అనుగ్రహం చూపించమని నేను యెహోవాను వేడుకుంటూ వచ్చాను.   నేను చనిపోవడం వల్ల, గోతిలోకి* దిగిపోవడం వల్ల ఏం లాభం?+ మట్టి నిన్ను స్తుతిస్తుందా?+ అది నీ నమ్మకత్వం గురించి తెలియజేస్తుందా?+ 10  యెహోవా, నా మొర విని నా మీద అనుగ్రహం చూపించు.+ యెహోవా, నాకు సహాయకుడివి అవ్వు.+ 11  నువ్వు నా ఏడ్పును నాట్యంగా మార్చావు;నా గోనెపట్టను తీసేసి, నాకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేశావు, 12  నేను* మౌనంగా ఉండకుండా నీ స్తుతులు పాడాలని అలా చేశావు. యెహోవా, నా దేవా, నిరంతరం నేను నిన్ను స్తుతిస్తాను.

అధస్సూచీలు

లేదా “లాగావు.”
లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.
లేదా “సమాధిలోకి.”
లేదా “సంగీతం వాయించండి.”
అక్ష., “జ్ఞాపకార్థానికి.”
లేదా “తడబడను.”
లేదా “సమాధిలోకి.”
లేదా “నా మహిమ.”