కీర్తనలు 135:1-21
135 యెహోవాను* స్తుతించండి!*
యెహోవా పేరును స్తుతించండి;యెహోవా సేవకులారా, ఆయనకు స్తుతులు చెల్లించండి,+
2 యెహోవా మందిరంలో,మన దేవుని మందిర ప్రాంగణాల్లో నిలబడి ఉన్న మీరంతా, ఆయన్ని స్తుతించండి.+
3 యెహోవాను* స్తుతించండి, యెహోవా మంచివాడు.+
ఆయన పేరును స్తుతిస్తూ పాటలు పాడండి,* అది మనోహరమైంది.
4 యెహోవా* యాకోబును తన కోసం ఎంచుకున్నాడు,ఇశ్రాయేలును తన ప్రత్యేకమైన సొత్తుగా* ఎంచుకున్నాడు.+
5 యెహోవా గొప్పవాడని నాకు బాగా తెలుసు;మన ప్రభువు దేవుళ్లందరి కన్నా గొప్పవాడు.+
6 ఆకాశంలో, భూమ్మీద; సముద్రాల్లో, వాటి లోతైన స్థలాలన్నిటిలోయెహోవా తనకు చేయాలనిపించిన ప్రతీది చేస్తాడు.+
7 ఆయన భూమి అంచుల నుండి మేఘాలు* పైకిలేచేలా చేస్తాడు;వర్షం కోసం మెరుపుల్ని* చేస్తాడు;
తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు.+
8 ఆయన ఐగుప్తులోని మనుషుల, పశువులమొదటి సంతానాన్ని చంపేశాడు.+
9 ఐగుప్తూ, ఆయన నీ మధ్య ఫరోకు, అతని సేవకులందరికీ వ్యతిరేకంగా+సూచనలు, అద్భుతాలు చేశాడు.+
10 ఆయన చాలా దేశాల్ని నాశనం చేశాడు,బలమైన రాజుల్ని చంపాడు.+
11 అమోరీయుల రాజైన సీహోనును,బాషాను రాజైన ఓగును ఆయన చంపాడు,+కనాను రాజ్యాలన్నిటినీ నాశనం చేశాడు.
12 వాళ్ల దేశాన్ని స్వాస్థ్యంగా,తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వ ఆస్తిగా ఇచ్చాడు.
13 యెహోవా, నీ పేరు ఎప్పటికీ నిలిచివుంటుంది.
యెహోవా, నీ కీర్తి* తరతరాలు నిలిచివుంటుంది.+
14 ఎందుకంటే యెహోవా తన ప్రజల తరఫున వాదిస్తాడు,+తన సేవకుల మీద ఆయనకు కనికరం పుడుతుంది.*
15 దేశాల విగ్రహాలు వెండిబంగారాలతో చేసినవి,అవి మనుషుల చేతిపనులు.+
16 వాటికి నోరు ఉంది, కానీ మాట్లాడలేవు;+కళ్లు ఉన్నాయి, కానీ చూడలేవు;
17 చెవులు ఉన్నాయి, కానీ వినలేవు;
వాటి నోటిలో ఊపిరి లేదు.+
18 వాటిని తయారుచేసేవాళ్లూ, వాటిని నమ్ముకునే వాళ్లందరూఅచ్చం వాటిలాగే తయారౌతారు.+
19 ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, యెహోవాను స్తుతించండి.
అహరోను ఇంటివాళ్లారా, యెహోవాను స్తుతించండి.
20 లేవి ఇంటివాళ్లారా, యెహోవాను స్తుతించండి.+
యెహోవాకు భయపడేవాళ్లారా, యెహోవాను స్తుతించండి.
21 యెరూషలేములో నివసించే యెహోవా+సీయోనులో నుండి స్తుతించబడాలి.+
యెహోవాను* స్తుతించండి!+
అధస్సూచీలు
^ లేదా “హల్లెలూయా!”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “సంగీతం వాయించండి.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “విలువైన సంపదగా.”
^ లేదా “ఆవిర్లు.”
^ లేదా “ప్రవాహ ద్వారాల్ని” అయ్యుంటుంది.
^ లేదా “పేరు.” అక్ష., “జ్ఞాపకార్థం.”
^ లేదా “ఆయన విచారపడతాడు.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.