కీర్తనలు 108:1-13

  • శత్రువులపై విజయం కోసం ప్రార్థన

    • రక్షణ కోసం మనుషుల మీద ఆశపెట్టుకోవడం వృథా (12)

    • “దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం” (13)

గీతం. దావీదు శ్రావ్యగీతం. 108  దేవా, నా హృదయం స్థిరంగా ఉంది. నా పూర్తి సామర్థ్యంతో* పాట పాడతాను, సంగీతం వాయిస్తాను.+   తంతివాద్యమా, మేలుకో; వీణా,* నువ్వు కూడా మేలుకో.+ నేను వేకువను నిద్ర లేపుతాను.   యెహోవా, దేశదేశాల ప్రజల మధ్య నిన్ను స్తుతిస్తాను,దేశాల మధ్య నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను.*   ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ గొప్పది, అది ఆకాశమంత ఉన్నతమైనది,+నీ నమ్మకత్వం మేఘాల్ని తాకుతుంది.   దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి;నీ మహిమ భూమంతా నిండిపోవాలి.+   నువ్వు ప్రేమించేవాళ్లు రక్షించబడేలానీ కుడిచేతితో మమ్మల్ని కాపాడి, నాకు జవాబివ్వు.+   దేవుడు తన పవిత్రతను బట్టి* ఇలా అన్నాడు: “నేను ఉల్లసించి షెకెమును+ ఆస్తిగా ఇస్తాను,సుక్కోతు లోయను కొలిచి ఇస్తాను.+   గిలాదు+ నాదే, మనష్షే నాదే,ఎఫ్రాయిము నా శిరస్త్రాణం;*+యూదా నా అధికార దండం.+   మోయాబు నేను కాళ్లు కడుక్కునే పాత్ర.+ ఎదోము మీదికి నా చెప్పు విసిరేస్తాను.+ ఫిలిష్తియను జయించి విజయోత్సాహంతో కేకలు వేస్తాను.”+ 10  ప్రాకారంగల నగరానికి నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఎదోము వరకు నన్ను ఎవరు నడిపిస్తారు?+ 11  దేవా, నువ్వే మమ్మల్ని నడిపిస్తావు;కానీ నువ్వు మమ్మల్ని తిరస్కరించావు, ఇప్పుడు నువ్వు మా సైన్యాలతో పాటు బయల్దేరడం లేదు.+ 12  కష్టాల్లో మాకు సహాయం చేయి,+రక్షణ కోసం మనుషుల మీద ఆశపెట్టుకోవడం వృథా.+ 13  దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం,+ఆయన మా శత్రువుల్ని అణగదొక్కుతాడు.+

అధస్సూచీలు

అక్ష., “నా మహిమతో కూడా.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “తన పవిత్ర స్థలంలో” అయ్యుంటుంది.
అక్ష., “దుర్గం.”