కీర్తనలు 101:1-8
దావీదు కీర్తన. శ్రావ్యగీతం.
101 నేను విశ్వసనీయ ప్రేమ గురించి, న్యాయం గురించి పాడతాను.
యెహోవా, నిన్ను స్తుతిస్తూ నేను పాటలు పాడతాను.*
2 నేను వివేచన* చూపిస్తూ నిందలేకుండా* నడుచుకుంటాను.
నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు?
నేను నా ఇంట్లో ఉన్నప్పుడు యథార్థ హృదయంతో* నడుచుకుంటాను.+
3 వ్యర్థమైనదేదీ* నా కళ్లముందు ఉంచుకోను.
సరైన మార్గం నుండి తొలగిపోయేవాళ్ల పనులంటే నాకు అసహ్యం.+వాళ్లతో నేను ఎలాంటి పొత్తూ పెట్టుకోను.*
4 దుష్ట హృదయం నాకు చాలా దూరం;చెడును నేను అంగీకరించను.*
5 చాటుగా తమ పొరుగువాళ్ల మీద అబద్ధాలు చెప్పేవాళ్లను+నేను సంహరిస్తాను.
గర్వపు చూపు, అహంకార హృదయం గలవాళ్లనునేను సహించను.
6 భూమ్మీది నమ్మకమైనవాళ్లు నాతోపాటు నివసించేలానేను వాళ్లమీద నా దృష్టి నిలుపుతాను.
నిందలేకుండా* నడుచుకునేవాళ్లు నాకు పరిచారం చేస్తారు.
7 మోసంచేసే వాళ్లెవ్వరూ నా ఇంట్లో నివసించరు,అబద్ధాలాడే వాళ్లెవ్వరూ నా కళ్లముందు నిలబడరు.
8 ప్రతీ ఉదయం భూమ్మీది దుష్టులందర్నీ నేను సంహరిస్తాను;అలా, తప్పుచేసే వాళ్లందర్నీ యెహోవా నగరం నుండి తొలగిస్తాను.+
అధస్సూచీలు
^ లేదా “సంగీతం వాయిస్తాను.”
^ లేదా “బుద్ధి.”
^ లేదా “యథార్థంగా.”
^ లేదా “సరిగ్గా.”
^ లేదా “పనికిమాలినదేదీ.”
^ లేదా “వాళ్ల పనులు నన్ను అంటిపెట్టుకోనివ్వను.”
^ అక్ష., “తెలుసుకోను.”
^ లేదా “యథార్థంగా.”