ఊరట
నిరుత్సాహంగా అనిపించే కొన్ని పరిస్థితుల్లో ఊరటనిచ్చే లేఖనాలు
అనారోగ్యం వల్ల లేదా వయసు పైబడడం వల్ల చేయాలనుకున్నంత చేయలేనప్పుడు
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
2రా 20:1-3—హిజ్కియాకు పెద్ద జబ్బు చేసి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు విపరీతంగా ఏడ్చాడు
-
ఫిలి 2:25-30—ఎపఫ్రొదితుకు జబ్బు చేసిన సంగతి సంఘం వాళ్లకు తెలిసిందని అతను కృంగిపోయాడు, తన నియామకాన్ని చేయలేకపోయాడని వాళ్లు అనుకుంటారని భయపడ్డాడు
-
-
ఊరటనిచ్చే లేఖనాలు:
-
ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:
-
2స 17:27-29; 19:31-38—వృద్ధుడైన బర్జిల్లయి మీద గౌరవంతో రాజు అతన్ని యెరూషలేముకు రమ్మని పిలిచాడు, కానీ బర్జిల్లయి అణకువ చూపిస్తూ వృద్ధాప్యం వల్ల రాలేనని చెప్పాడు
-
కీర్త 41:1-3, 12—దావీదు రాజుకు తీవ్రమైన జబ్బు చేసినప్పుడు కూడా, యెహోవా తనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నాడు
-
మార్కు 12:41-44—తనకున్నదంతా విరాళంగా ఇచ్చిన పేద విధవరాల్ని యేసు మెచ్చుకున్నాడు
-
అసూయ; ఈర్ష్య
“అసూయ” చూడండి
ఆందోళన
“ఆందోళన” చూడండి
ఇతరులు మన ఆశల్ని అడియాశలు చేసినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు లేదా మోసం చేసినప్పుడు కలిగే నిరాశ
“అనుకున్నట్టు జరగనప్పుడు” చూడండి
ఇతరులు మనతో చెడుగా ప్రవర్తించి మన మనసును గాయపర్చినప్పుడు
“మనతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే” చూడండి
ఏదైనా పెద్ద సమస్యను పరిష్కరించలేమని అనిపించినప్పుడు లేదా ఏదైనా నియామకాన్ని చేయలేమని అనిపించినప్పుడు
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
నిర్గ 3:11; 4:10—ఫరోతో మాట్లాడమనీ తన ప్రజల్ని నడిపించమనీ యెహోవా చెప్పినప్పుడు, మోషే ప్రవక్త తనకు అంత సామర్థ్యం లేదని అన్నాడు
-
యిర్మీ 1:4-6—దేవుని తీర్పు సందేశాన్ని వినడానికి ఇష్టపడని ప్రజల మధ్య ఒక ప్రవక్తగా సేవ చేయమన్నప్పుడు తాను ఇంకా చిన్నవాడినేనని, అంత అనుభవం లేదని యిర్మీయా అనుకున్నాడు
-
-
ఊరటనిచ్చే లేఖనాలు:
-
ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:
-
నిర్గ 3:12; 4:11, 12—తన నియామకంలో తోడుగా ఉంటానని యెహోవా మోషేకు పదేపదే ఓపిగ్గా అభయమిచ్చాడు
-
యిర్మీ 1:7-10—ఎంత కష్టమైన సమస్య వచ్చినా దానికి తగ్గ బలాన్ని ఇస్తానని యెహోవా యిర్మీయాకు అభయమిచ్చాడు
-
తప్పు చేశామనే బాధతో కుమిలిపోవడం
ఎజ్రా 9:6; కీర్త 38:3, 4, 8; 40:12
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
2రా 22:8-13; 23:1-3—రాజైన యోషీయా అలాగే ప్రజలు, మోషే ధర్మశాస్త్రంలోని విషయాలను విన్నప్పుడు ఘోరమైన పాపాలు చేశామని తెలుసుకుని చాలా బాధపడ్డారు
-
ఎజ్రా 9:10-15; 10:1-4—యెహోవా మాటకు లోబడకుండా కొంతమంది యూదులు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు ఎజ్రా అలాగే ప్రజలు చాలా బాధపడ్డారు
-
లూకా 22:54-62—యేసు ఎవరో తెలీదని మూడుసార్లు చెప్పిన తర్వాత అపొస్తలుడైన పేతురు దుఃఖంతో కుమిలికుమిలి ఏడ్చాడు
-
-
ఊరటనిచ్చే లేఖనాలు:
-
యెష 38:17; మీకా 7:18, 19 కూడా చూడండి
-
ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:
-
2ది 33:9-13, 15, 16—యూదా రాజులందరిలో మనష్షే చాలా చెడ్డవాడు, కానీ అతను పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా కరుణ చూపించాడు
-
లూకా 15:11-32—యెహోవా పెద్ద మనసుతో పూర్తిగా క్షమిస్తాడని చెప్పడానికి యేసు తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ చెప్పాడు
-
ప్రాణ భయం; బెదిరిపోవడం
“భయం” చూడండి
బాధ
అన్యాయాల వల్ల లేదా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు రావడం వల్ల కొంతమంది సంతోషాన్ని పోగొట్టుకుంటారు
కీర్త 142:4; ప్రస 4:1; 7:7 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ఊరటనిచ్చే లేఖనాలు:
-
ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:
-
రూతు 1:6, 7, 16-18; 2:2, 19, 20; 3:1; 4:14-16—నయోమి దేవుని ప్రజల దగ్గరకు తిరిగొచ్చినప్పుడు, ఇతరుల సహాయం తీసుకున్నప్పుడు అలాగే ఇతరులకు సహాయం చేసినప్పుడు తన సంతోషాన్ని తిరిగి పొందింది
-
యోబు 42:7-16; యాకో 5:11—యోబు విశ్వాసంతో సహించడం వల్ల యెహోవా అతన్ని విస్తారంగా దీవించాడు
-
ఇతరులు తమతో కఠినంగా ప్రవర్తించినప్పుడు కొంతమంది సంతోషాన్ని పోగొట్టుకుంటారు
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1స 1:6, 7, 10, 13-16—పెనిన్నా తనను దెప్పిపొడిచినప్పుడు, ప్రధానయాజకుడైన ఏలీ తనను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు హన్నా చాలా బాధపడింది
-
యోబు 8:3-6; 16:1-5; 19:2, 3—స్వనీతిపరులైన యోబు ముగ్గురు స్నేహితులు అతన్ని పాపిలా చూశారు, దానివల్ల యోబు ఇంకా కుమిలిపోయాడు
-
-
ఊరటనిచ్చే లేఖనాలు:
-
ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:
-
1స 1:9-11, 18—హన్నా యెహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించిన తర్వాత ఆమె మనసు కుదుటపడింది
-
యోబు 42:7, 8, 10, 17—యోబు తన ముగ్గురి స్నేహితుల్ని క్షమించిన తర్వాత యెహోవా అతనికి మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తిరిగి ఇచ్చాడు
-
మన బలహీనతల వల్ల, పాపాల వల్ల కలిగే నిరాశ
“అనుకున్నట్టు జరగనప్పుడు” చూడండి
మనం దేనికీ పనికిరాని వాళ్లమని అనిపిస్తే
“పనికిరాని వాళ్లమని అనిపిస్తే” చూడండి
హింస
“హింస” చూడండి