ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు?
అధ్యాయము 5
ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు?
1. ఆరాధన గురించి ఒక సమరయ స్త్రీ ఏమి తెలుసుకోవాలని ఇష్టపడింది?
‘ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు’ అని మీరెప్పుడైనా ఆలోచించారా? సమరయలోని గెరీజీము పర్వతంవద్ద యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు ఒక స్త్రీ మనస్సులోకి ఆ ప్రశ్నే వచ్చి ఉండవచ్చు. సమరయులు మరియు యూదుల మధ్యనున్న ఆరాధనలోని తేడావైపుకు దృష్టిని మళ్లిస్తూ, ఆమె ఇలా చెప్పింది: “మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు.” (యోహాను 4:20) దేవుడు అన్ని ఆరాధనలను అంగీకరిస్తాడని యేసు ఆ సమరయ స్త్రీతో చెప్పాడా? లేక దేవున్ని ప్రీతిపర్చేందుకు ప్రత్యేకమైనవి అవసరమని ఆయన చెప్పాడా?
2. సమరయ స్త్రీకి సమాధానమిస్తూ, యేసు ఏమి చెప్పాడు?
2 యేసు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం గొల్పేలా ఇలా ఉంది: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు.” (యోహాను 4:21) సమరయులు చాలా కాలంనుండి యెహోవాకు భయపడ్డారు మరియు గెరీజీము పర్వతంపై ఇతర దేవుళ్లను ఆరాధించారు. (2 రాజులు 17:33) ఆ స్థలంగాని, యెరూషలేముగాని సత్యారాధనలో ప్రాముఖ్యతను సంతరించుకొనవని యేసు ఇప్పుడు చెప్పాడు.
ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుట
3. (ఎ) సమరయులకు నిజంగా దేవుడు ఎందుకు తెలియదు? (బి) విశ్వాసులైన యూదులు మరియు ఇతరులు దేవున్ని ఎలా తెలుసుకోగలిగారు?
3 యేసు సమరయ స్త్రీతో ఇంకా ఇలా చెప్పాడు: “మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యోహాను 4:22) సమరయులకు అబద్ధమత సిద్ధాంతాలు ఉండేవి—పూర్తిగా వారి స్వంత గ్రంథపరిష్కరణములో అనగా సమరయుల పంచగ్రంథము అని పిలువబడే, బైబిలు యొక్క మొదటి ఐదు పుస్తకాలను మాత్రమే వారు ప్రేరేపితమైనవిగా అంగీకరించేవారు. కాబట్టి, వారికి దేవుడు నిజంగా తెలియదు. అయితే, యూదులకు లేఖనాధార జ్ఞానం ఇవ్వబడింది. (రోమీయులు 3:1, 2) విశ్వాసులైన యూదులకు, వినే ఇతరులెవరికైనా, దేవున్ని తెలుసుకొనేందుకు అవసరమైనదాన్ని లేఖనాలు అందజేశాయి.
యూదులలో నుండియే కలుగుచున్నది.” (4. యేసు చెప్పినదాని ప్రకారం, యూదులు మరియు సమరయులు తమ ఆరాధన దేవునికి అంగీకారమైనదిగా ఉండాలంటే ఏమి చేయవలసిన అవసరం ఉండెను?
4 వాస్తవానికి, యూదులు సమరయులు ఇరువురూ దేవున్ని ప్రీతిపర్చేందుకు తమ మార్గాన్ని సరిచేసుకోవలసి ఉంటుందని యేసు చూపించాడు. ఆయనిలా చెప్పాడు: “అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.” (యోహాను 4:23, 24) విశ్వాస ప్రేమలతో పూర్ణంగా నింపబడివున్న హృదయాలచే పురికొల్పబడి, మనం దేవున్ని “ఆత్మతో” ఆరాధించవలసిన అవసరమున్నది. ఆయన వాక్యమైన బైబిలును పఠించడం ద్వారా, బయల్పర్చబడిన ఆయన సత్యానికి అనుగుణంగా ఆయనను ఆరాధించడం ద్వారా దేవున్ని ‘సత్యముతో’ ఆరాధించడం సాధ్యమౌతుంది. అలా చేయడానికి మీరు ఆసక్తి కలిగివున్నారా?
5. (ఎ) “ఆరాధన” అంటే ఏమిటి? (బి) దేవుడు మన ఆరాధనను అంగీకరించాలంటే మనమేమి చేయాలి?
5 దేవుడు సత్యమైన ఆరాధనను కోరుతున్నాడని యేసు నొక్కిచెప్పాడు. యెహోవాకు అనంగీకారమైన ఆరాధనా విధానాలు ఉన్నాయని ఇది చూపిస్తుంది. దేవున్ని ఆరాధించడమంటే, ఆయనకు భక్తిపూర్వక గౌరవాన్నివ్వడం, ఆయనకు పరిశుద్ధ సేవను అందించడమని భావం. మీరు ఒక అధికారంగల పరిపాలకునికి గౌరవం చూపించాలనుకుంటే, మీరు ఆయనకు సేవచేసేందుకు, ఆయనను ప్రీతిపర్చేదాన్ని చేసేందుకు ఆసక్తి కలిగివుంటారు. కాబట్టి, మనం నిశ్చయంగా దేవున్ని ప్రీతిపర్చాలనుకుంటాము. కేవలం ‘నా మతం నాకిష్టమైనది’ అని చెప్పే
బదులు, మన ఆరాధన దేవుడు కోరేవాటికి తగినట్లుగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉంది.తండ్రి చిత్తాన్ని చేయడం
6, 7. తన శిష్యులని చెప్పుకుంటున్న కొందరిని యేసు ఎందుకు అంగీకరించలేదు?
6 మనం మత్తయి 7:21-23 చదివి, అన్ని ఆరాధనలు దేవునికి అంగీకారమైనవో కావో తీర్మానించే ఒక నిర్ణయాత్మకమైన అంశాన్ని గుర్తించగలమేమో చూద్దాము. యేసు ఇలా చెప్పాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను [దుష్టాత్మలైన జీవులను] వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.”
7 యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించడం సత్యారాధనలో ప్రాముఖ్యమే. కాని యేసు శిష్యులమని చెప్పుకొనే అనేకుల ఆరాధనలో ఏదో లోపిస్తుందని ఈ లేఖనం సూచిస్తుంది. ఆశ్చర్యపరచే స్వస్థతలని చెప్పబడే “అద్భుతములు” కొందరు చేయగలరని ఆయన చెప్పాడు. అయితే, యేసు ప్రాముఖ్యమైనదని చెప్పినదాన్ని చేయడంలో వాళ్లు విఫలం కావచ్చు. వాళ్లు “[ఆయన] తండ్రి చిత్తప్రకారము” చేయకపోవచ్చు. మనం దేవున్ని ప్రీతిపర్చాలనుకుంటే, తండ్రి చిత్తమేమిటో తెలుసుకొని, తర్వాత దాన్ని చేయాలి.
కచ్చితమైన జ్ఞానం—ఒక భద్రత
8. మనం దేవుని చిత్తాన్ని చేయాలంటే ఏమి అవసరము, ఏ పొరపాటుతో కూడిన దృక్పథాలను మనం విసర్జించాలి?
8 దేవుని చిత్తాన్ని చేయడానికి యెహోవా దేవుని మరియు యేసుక్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానం అవసరం. అలాంటి జ్ఞానం నిత్యజీవానికి నడిపిస్తుంది. కాబట్టి, మనమందరం తప్పకుండా దేవుని వాక్యమైన బైబిలు నుండి ఎఫెసీయులు 4:13; ఫిలిప్పీయులు 1:9; కొలొస్సయులు 1:9.
కచ్చితమైన జ్ఞానాన్ని పొందే విషయాన్ని గంభీరంగా తీసుకోవాలని కోరుకుంటాము. మనం మన ఆరాధన విషయంలో యథార్థంగా, ఆసక్తి కలిగి ఉన్నంతవరకు దాని గురించి చింతించనవసరం లేదని కొందరంటారు. ‘మీకు ఎంత తక్కువ తెలిస్తే, మీ నుండి అంత తక్కువ కోరబడుతుంది,’ అని ఇతరులు అంటారు. కాని, దేవుని గూర్చిన, ఆయన సంకల్పాలను గూర్చిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది.—9. కచ్చితమైన జ్ఞానం మనల్ని ఎలా కాపాడుతుంది, అలాంటి రక్షణ మనకు ఎందుకవసరము?
9 అలాంటి జ్ఞానం మన ఆరాధన కలుషితం కాకుండా ఒక భద్రతలా ఉంటుంది. “వెలుగు దూత” అన్నట్లు భ్రమింపజేసే ఆత్మగానున్న ఒక జీవి గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (2 కొరింథీయులు 11:14) అలా మోసకరమైన ఆత్మగానున్న ఈ జీవి—సాతాను—దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసేందుకు మనల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నాడు. సాతానుతో సహవసించే ఆత్మలుగానున్న ఇతర జీవులు కూడా ప్రజల ఆరాధనను కలుషితం చేస్తున్నారు, అందుకే పౌలు ఇలా చెప్పాడు: “అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు.” (1 కొరింథీయులు 10:20) దేవుడు కోరేదాన్ని వాళ్లు చేస్తుండక పోయినప్పటికీ, తాము సరైన విధంగా ఆరాధిస్తున్నామని బహుశా అనేకులు తలంచి ఉండవచ్చు. వారు అశుద్ధమైన అబద్ధ ఆరాధన చేయడానికి మోసగించబడ్డారు. సాతాను, అతని దయ్యాల గురించి ఆ తర్వాత మనం ఇంకా ఎక్కువ తెలుసుకుంటాము, కాని దేవుని శత్రువులైన వీరు మానవజాతి చేసే ఆరాధనను నిజంగా కలుషితం చేస్తున్నారు.
10. మీ నీటి సరఫరాను ఎవరైనా కావాలనే విషపూరితం చేస్తే మీరేమి చేస్తారు, దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం మనమేమి చేయడానికి మనకు సహాయం చేస్తుంది?
10 మీ నీటి సరఫరాను ఎవరో కావాలనే విషపూరితం చేశారని మీకు తెలిసిందనుకోండి, మీరు ఆ నీరు త్రాగుతూనే ఉంటారా? సురక్షితమైన, స్వచ్ఛమైన నీటి కొరకు మీరు వెంటనే తప్పకుండా చర్య తీసుకుంటారు. అయితే, సత్యమైన మతాన్ని గుర్తించి, ఆరాధనను దేవునికి అనంగీకారమైనదిగా చేసే కలుషితాలను నిరాకరించేందుకు దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం మనకు సహాయం చేస్తుంది.
మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములనుట
11. అనేకమంది యూదుల ఆరాధన విషయంలో ఏది తప్పై ఉండెను?
11 యేసు భూమిపైనున్నప్పుడు, అనేకమంది యూదులు దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించలేదు. కాబట్టి వాళ్లు యెహోవా ఎదుట పవిత్రమైన స్థానాన్ని కలిగివుండే అవకాశాన్ని కోల్పోయారు. వారి గురించి పౌలు ఇలా వ్రాశాడు: “వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.” (రోమీయులు 10:2) ఆయన చెప్పే పద్ధతిని వినే బదులు, దేవున్ని ఆరాధించే విధానాన్ని గూర్చి వారు తమకు తామే నిర్ణయించుకున్నారు.
12. ఇశ్రాయేలీయుల ఆరాధనను ఏది కలుషితం చేసింది, దాని ఫలితమేమిటి?
12 ఇశ్రాయేలీయులు మొదట దేవుడిచ్చిన స్వచ్ఛమైన మతాన్ని అనుసరించారు, కాని అది మనుష్యుల బోధలతోను, సిద్ధాంతాలతోను కలుషితమై పోయింది. (యిర్మీయా 8:8, 9; మలాకీ 2:8, 9; లూకా 11:52) పరిసయ్యులని పిలువబడే యూదా మత నాయకులు తమ ఆరాధన దేవునికి అంగీకారమైనదని తలంచినప్పటికీ, యేసు వారికిలా చెప్పాడు: “ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.”—మార్కు 7:6, 7.
13. పరిసయ్యులు చేసినట్లు మనం ఎలా చేయగలము?
13 పరిసయ్యులు చేసినట్లు బహుశా మనమూ చేయడానికి సాధ్యమౌతుందా? ఆరాధన గురించి దేవుడేమి చెప్పాడో పరిశీలించే బదులు, మనకు వారసత్వంగా ఇవ్వబడిన మతసంబంధమైన సాంప్రదాయాలను అనుసరిస్తే ఇదే జరుగవచ్చు. ఈ వాస్తవమైన ప్రమాదాన్ని గురించే హెచ్చరిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1 తిమోతి 4:1) కాబట్టి మన ఆరాధన దేవున్ని ప్రీతిపరుస్తుందని అనుకోవడం మాత్రమే సరిపోదు. యేసును కలిసిన సమరయ స్త్రీలా, మనం ఆరాధనా విధానాన్ని మన తలిదండ్రుల నుండి వారసత్వంగా పొంది ఉండవచ్చు. కాని, దేవుని అంగీకారాన్ని పొందే వాటిని మనం చేస్తున్నామన్న నిశ్చయతను కలిగివుండవలసిన అవసరం ఉంది.
దేవునికి కోపం కలిగించకుండా జాగ్రత్తపడండి
14, 15. దేవుని చిత్తాన్ని గూర్చి మనకు కొంత జ్ఞానం ఉన్నప్పటికీ, మనమెందుకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది?
14 మనం జాగ్రత్తగా లేకపోతే, దేవునికి అనంగీకారమైనదేదైనా మనం చేయవచ్చు. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను “అతనికి నమస్కారము చేయుటకై” ఒక దేవదూత పాదములపై పడ్డాడు. కాని దేవదూత ఇలా హెచ్చరించాడు: “వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము.” (ప్రకటన 19:10) కాబట్టి, మీ ఆరాధన ఏ విధమైన విగ్రహారాధనతోను కలుషితం కాలేదని రూఢిపరచుకోవలసిన అవసరం ఉందా?—1 కొరింథీయులు 10:14.
15 కొంతమంది క్రైస్తవులు దేవున్ని ప్రీతిపర్చని మతసంబంధమైన ఆచారాలను అనుసరించడం ప్రారంభించినప్పుడు, పౌలు ఇలా అడిగాడు: “బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.” (గలతీయులు 4:9-11) ఆ వ్యక్తులు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందారు, కాని ఆ తర్వాత యెహోవాకు అనంగీకారమైన మతసంబంధమైన ఆచారాలను, పండుగ దినాలను ఆచరించడం ద్వారా తప్పుచేశారు. పౌలు చెప్పినట్లుగా, మనం “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” ఉండవలసిన అవసరం ఉంది.—ఎఫెసీయులు 5:10.
16. సెలవు దినాలు, ఆచారాలు దేవున్ని ప్రీతిపరుస్తాయో లేదో నిర్ణయించుకోవడానికి యోహాను 17:16 మరియు 1 పేతురు 4:3 మనకెలా సహాయం చేస్తాయి?
16 మతసంబంధమైన సెలవు దినాలను, దేవుని సూత్రాలను ఉల్లంఘించేలాంటి ఆచారాలను నివారించేందుకు మనం జాగ్రత్త వహించాలి. (1 థెస్సలొనీకయులు 5:21) ఉదాహరణకు, యేసు తన అనుచరుల గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) ఈ లోక విషయాల్లో తటస్థతను చూపించవలసిన సూత్రాన్ని ఉల్లంఘించే వేడుకల్లో, సెలవు దినాల్లో మీ మతం పాల్గొంటుందా? లేక మీ మతానికి చెందినవారు అపొస్తలుడైన పేతురు వర్ణించిన ప్రవర్తనకు సరిసమానమైన ప్రవర్తన కల్గివుండే ఆచారాలలో, పండుగలలో కొన్నిసార్లు భాగం వహిస్తారా? ఆయనిలా వ్రాశాడు: “మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును.”—1 పేతురు 4:3.
17. లోకాత్మను ప్రతిబింబించే దేనినైనా మనమెందుకు విసర్జించాలి?
17 మన చుట్టూవున్న భక్తిహీన లోకం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబించే ఏ ఆచారాలనైనా నివారించవలసిన అవసరతను అపొస్తలుడైన యోహాను నొక్కిచెప్పాడు. యోహానిలా వ్రాశాడు: “ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:15-17) ‘దేవుని చిత్తమును జరిగించు’ వాడే నిరంతరం నిలుస్తాడన్నది మీరు గమనించారా? అవును, మనం దేవుని చిత్తాన్ని చేసి, ఈ లోకాత్మను ప్రతిబింబించే చర్యలను నివారిస్తే, మనం నిత్యజీవ నిరీక్షణను కలిగివుండవచ్చు!
దేవుని ఉన్నతమైన ప్రమాణాలను అనుసరించండి
18. ప్రవర్తన విషయంలో కొందరు కొరింథీయులు ఎలా పొరపాటుపడ్డారు, దీని నుండి మనమేమి నేర్చుకోవాలి?
18 తన ఉన్నత నైతిక ప్రమాణాలకు తగినట్లు ఉండేవారు తన ఆరాధికులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అనైతిక ప్రవర్తనను సహిస్తాడని ప్రాచీన కొరింథులోని కొందరు పొరపాటుగా తలంచారు. మనం 1 కొరింథీయులు 6:9, 10 చదవడం ద్వారా వారు ఎంత పొరపాటుగా తలంచారో తెలుసుకోవచ్చు. మనం దేవున్ని అంగీకారమైన విధంగా ఆరాధించాలంటే మాటలోను, క్రియలోను మనమాయనను ప్రీతిపర్చాలి. మీరు చేసే ఆరాధనా విధానం మీరు అలా చేయడాన్ని అనుమతిస్తుందా?—మత్తయి 15:8; 23:1-3.
19. మనం ఇతరులను ఎలా చూస్తామనేదాన్ని సత్యారాధన ఎలా ప్రభావితం చేస్తుంది?
మత్తయి 7:12) సహోదర ప్రేమను వ్యక్తపర్చడాన్ని గూర్చి కూడా ఆయనేమి చెప్పాడో గమనించండి: ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’ (యోహాను 13:35) యేసు శిష్యులు ఒకరినొకరు ప్రేమించాలి, తోటి ఆరాధికులకు మరియు ఇతరులకు ఏది మంచిదో దాన్ని చేయాలి.—గలతీయులు 6:10.
19 ఇతరులతో మన వ్యవహారాలు కూడా దేవుని ప్రమాణాలను ప్రతిబింబించాలి. ఇతరులు మనల్ని ఎలా చూడాలని మనం ఇష్టపడతామో, అలాగే మనం వాళ్లను చూడాలని యేసుక్రీస్తు మనల్ని ప్రోత్సహించాడు, ఎందుకంటే ఇది సత్యారాధనలో ఒక భాగం. (పూర్ణప్రాణముతో కూడిన ఆరాధన
20, 21. (ఎ) దేవునికి ఏ విధమైన ఆరాధన అవసరము? (బి) మలాకీ కాలంలో యెహోవా ఇశ్రాయేలీయుల ఆరాధనను ఎందుకు నిరాకరించాడు?
20 దేవుడు అంగీకరించే విధంగా ఆరాధించాలని మీరు హృదయంలో కోరుకోవచ్చు. అలాగైతే, ఆరాధనను గూర్చి యెహోవాకున్న దృక్పథం మీకు ఉండాలి. దేవుని దృక్కోణం ప్రాముఖ్యంగాని మనదికాదని శిష్యుడైన యాకోబు నొక్కి చెప్పాడు. యాకోబు ఇలా చెప్పాడు: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.” (యాకోబు 1:27) దేవున్ని ప్రీతిపర్చాలనే కోరికతో, మన ఆరాధన దైవభక్తి లేని ఆచారాలతో కలుషితం కాలేదని లేక ఆయన ప్రాముఖ్యమైనదని పరిగణించే దేనినైనా మనం విడిచిపెట్టడం లేదని రూఢిపర్చుకోవడానికి మనలో ప్రతి ఒక్కరం మన ఆరాధనను పరీక్షించుకోవలసిన అవసరం ఉంది.—యాకోబు 1:26.
21 పవిత్రమైన, పూర్ణప్రాణముతో కూడిన ఆరాధన మాత్రమే యెహోవాకు ప్రీతికరమైనది. (మత్తయి 22:37; కొలొస్సయులు 3:23) ఇశ్రాయేలు జనాంగం దేవునికి ఘనహీనమైన ఆరాధనను చెల్లించినప్పుడు, ఆయనిలా చెప్పాడు: “కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; . . . నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు?” వారు దేవునికి గ్రుడ్డి, కుంటి, జబ్బుగల జంతువులను బలి అర్పించడం ద్వారా ఆయనకు కోపం పుట్టించినప్పుడు, ఆయన అలాంటి ఆరాధనా క్రియలను నిరాకరించాడు. (మలాకీ 1:6-8) యెహోవా అత్యంత స్వచ్ఛమైన ఆరాధనను పొందనర్హుడు, ఆయన ఏకభక్తిని మాత్రమే స్వీకరిస్తాడు.—నిర్గమకాండము 20:5; సామెతలు 3:9; ప్రకటన 4:11.
22. దేవుడు మన ఆరాధనను అంగీకరించాలని మనం కోరుకుంటే, మనమేమి విసర్జిస్తాము, ఏమి చేస్తాము?
22 యేసుతో మాట్లాడిన సమరయ స్త్రీ దైవాంగీకారమైన విధంగానే దేవున్ని ఆరాధించడంలో ఆసక్తికలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. మన కోరిక అదే అయితే, కలుషితం చేసే బోధలు, ఆచారాలన్నిటినీ మనం విసర్జిస్తాము. (2 కొరింథీయులు 6:14-18) బదులుగా, దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి మనం ప్రయాసపడతాము. అంగీకరించదగిన ఆరాధన కొరకు ఆయన కోరేవాటిని మనం క్షుణ్ణంగా అనుసరిస్తాము. (1 తిమోతి 2:3, 4) కచ్చితంగా అది చేయడానికే యెహోవాసాక్షులు ప్రయాసపడుతున్నారు, దేవున్ని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించడంలో వారితో భాగం వహించుమని వారు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరతారు. (యోహాను 4:24) యేసు ఇలా చెప్పాడు: ‘తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.’ (యోహాను 4:23) మీరు అలాంటి వ్యక్తేనని ఆశించడం జరుగుతుంది. ఆ సమరయ స్త్రీలా, నిస్సందేహంగా మీరు నిత్యజీవం పొందాలని కోరుకుంటారు. (యోహాను 4:13-15) కాని ప్రజలు వృద్ధులై మరణించడాన్ని మీరు చూస్తున్నారు. ఎందుకనేది తర్వాతి అధ్యాయం వివరిస్తుంది.
మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి
యోహాను 4:23, 24 నందు చూపబడినట్లుగా, దేవుడు ఎటువంటి ఆరాధనను అంగీకరిస్తాడు?
ఫలానా ఆచారాలు, పండుగలను బట్టి దేవుడు ప్రీతిపర్చబడుతున్నాడో లేదో మనం ఎలా నిశ్చయించుకోవచ్చు?
అంగీకరింపదగిన ఆరాధన యొక్క కొన్ని అర్హతలు ఏమిటి?
[అధ్యయన ప్రశ్నలు]
[44వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]