పత్రిక ముఖ్యాంశం | దేవుని అత్యంత గొప్ప బహుమానాన్ని మీరు అందుకుంటారా?
దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఎందుకు అంత అమూల్యమైంది?
దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఎందుకు అంత అమూల్యమైంది? ఏదైనా ఒక బహుమానం మీకెప్పుడు అమూల్యంగా ఉంటుంది? (1) ఆ బహుమానం మీకు ఎవరు ఇచ్చారు? (2) ఎందుకు ఇచ్చారు? (3) ఆ బహుమానం ఇవ్వడానికి వాళ్లు ఏమి త్యాగం చేశారు? (4) ఆ బహుమానం ఏదైనా అవసరాన్ని తీర్చిందా? అనే విషయాలను బట్టి అమూల్యంగా ఉంటుంది. దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం పట్ల మన కృతజ్ఞతను పెంచుకోవాలంటే ఈ విషయాలు గురించి ఆలోచించడం మంచిది.
ఎవరు ఇచ్చారు?
అధికారంలో చాలా పెద్దవాళ్లు లేదా మనం ఎంతో గౌరవించేవాళ్లు ఏదైనా బహుమానం ఇస్తే మనం ఆ బహుమానాన్ని చాలా అమూల్యంగా ఎంచుతాం. ఇంతకుముందు చూసిన జార్డన్ ఉదాహరణలా, కొన్ని బహుమానాలు ఖరీదైనవి కాకపోయినా మనం ప్రేమించే కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితులు ఇస్తే, మనం వాటిని ఎంతో విలువైనవిగా చూస్తాం. ఇదే విషయాన్ని విమోచన క్రయధన బహుమానంతో పోల్చి ఏమని చెప్పవచ్చు?
మొదటిగా, “దేవుడు తన ఒక్కగానొక్క కొడుకును ఈ లోకంలోకి పంపించి . . . మనం ఆ కొడుకు ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు.” (1 యోహాను 4:9) ఈ విషయం బట్టి ఆ బహుమానం నిజంగా అమూల్యమైనది అని చెప్పవచ్చు. అధికారంలో దేవుని కంటే గొప్పవాళ్లు ఇంకెవరూ లేరు. ఆయన గురించి ఒక హీబ్రూ కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” (కీర్తన 83:18) మనకు బహుమానం ఇవ్వగలిగినవాళ్లలో ఇంతకన్నా గొప్పవాళ్లు ఇంకెవ్వరూ ఇవ్వలేరు.
రెండవదిగా, దేవుడు మనకు “తండ్రి.” (యెషయా 63:16) ఎలా? ఆయన మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. అంతేకాదు, ఒక మంచి తండ్రి తన పిల్లలను చూసుకున్నట్లే దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా శ్రద్ధ చూపిస్తున్నాడు. పూర్వకాలంలో ఎఫ్రాయిము అనే ప్రాంతానికి చెందిన తన ప్రజలతో దేవుడు ఇలా చెప్పాడు: “ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దుబిడ్డా? . . . అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును.” (యిర్మీయా 31:20) నేడు తన ఆరాధకుల గురించి కూడా దేవునికి అలానే అనిపిస్తుంది. ఆయన మన మహోన్నత సృష్టికర్తయే కాదు మన నమ్మకమైన స్నేహితుడు, తండ్రి. కాబట్టి ఆయన నుండి వచ్చే ఏ బహుమానాన్ని అయినా ఎంతో విలువైనదిగా చూస్తాం. కాదంటారా?
ఎందుకు ఇచ్చాడు?
బాధ్యతతో కాకుండా నిజమైన ప్రేమతో ఇచ్చిన బహుమానాలకు ఎంతో విలువ ఉంటుంది. ఏ స్వార్థం లేకుండా బహుమానం ఇచ్చినవాళ్లు, వాళ్లు చూపించిన ప్రేమకు బదులుగా ఏదో పొందాలని ఎప్పుడూ ఆశించరు.
దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే తన కొడుకుని మనకోసం ఇచ్చాడు. “దేవుడు తన ఒక్కగానొక్క కొడుకును ఈ లోకంలోకి పంపించి మనమీద తనకున్న ప్రేమను వెల్లడిచేశాడు.” ఏ ఉద్దేశంతో దేవుడు అలా చేశాడు? “మనం ఆ కొడుకు ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు.” (1 యోహాను 4:9) అలా పంపించడం తన బాధ్యత కాబట్టి దేవుడు అలా చేశాడా? కానేకాదు! క్రీస్తుయేసు చెల్లించిన విమోచన క్రయధనం దేవుని అపారదయకు నిదర్శనం.—రోమీయులు 3:24.
“అపారదయ” వల్లే దేవుడు ఆ బహుమానాన్ని ఇచ్చాడని ఎందుకు చెప్పవచ్చు? బైబిలు ఇలా వివరిస్తుంది: “దేవుడు మనపట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు.” (రోమీయులు 5:8) బలహీనమైన, నిస్సహాయ స్థితిలో ఉన్న పాపులైన మనుషులకు సహాయం చేయడానికి నిస్వార్థమైన ప్రేమతో దేవుడు ముందుకు వచ్చాడు. ఆ ప్రేమ మనం సంపాదించుకున్నది కాదు లేదా తిరిగి ఇవ్వగలిగింది కాదు. ఆ బహుమానం చరిత్రలోనే నిలిచిపోయే దేవుని గొప్ప ప్రేమకు నిదర్శనం.
అందుకు ఏమి త్యాగం చేశాడు?
కొన్ని బహుమానాలను మనం ఎంతో అమూల్యంగా చూస్తాం ఎందుకంటే దాన్ని ఇచ్చినవాళ్లు ఎంతో త్యాగం చేసి మనకు ఇచ్చారు. వాళ్లకు ఎంతో విలువైనదాన్ని ఇష్టంగా వదులుకుని మనకు ఇచ్చినప్పుడు మనం ఆ త్యాగాన్ని బట్టి ఆ బహుమానానికి ఎంతో విలువిస్తాం.
దేవుడు “తన ఒక్కగానొక్క కొడుకును ఇచ్చాడు.” (యోహాను 3:16) యేసుకన్నా ఇష్టమైనవాళ్లు యెహోవాకు ఇంకెవ్వరూ లేరు. దేవుడు విశ్వాన్ని సృష్టిస్తున్న కోట్ల సంవత్సరాల్లో యేసు ఆయన పక్కనే పని చేశాడు. దేవుడు ఆయన “మూలంగా ఎంతో ఆనందించాడు.” (సామెతలు 8:30) యేసు దేవుని “ప్రియ కుమారుడు,” “కనిపించని దేవుని ప్రతిబింబం.” (కొలొస్సయులు 1:13-15) ఆలోచన సామర్థ్యం ఉన్న ప్రాణుల్లో ఇంత దగ్గరి బంధం ఇంకెక్కడా కనిపించదు.
అయితే, దేవుడు “తన సొంత కొడుకును మరణానికి అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు.” (రోమీయులు 8:32) అత్యంత విలువైన తన కుమారుణ్ణి యెహోవా మనకు ఇచ్చాడు. ఇంకే బహుమానం విషయంలో దేవుడు ఇంత త్యాగం చేయలేదు.
గొప్ప అవసరాన్ని తీర్చింది
ఎంతో అవసరమున్న సమయంలో, సరిగ్గా మనకు కావాల్సినవాటిని బహుమానంగా ఇచ్చినప్పుడు మనం వాటిని ఎంతో అమూల్యంగా చూస్తాం. ఉదాహరణకు, ప్రాణాపాయ పరిస్థితిలో అవసరమైన చికిత్స కోసం మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కావాల్సిన డబ్బులు ఇచ్చారు అనుకోండి. వాళ్లంటే మీకు ఎంత కృతజ్ఞత ఉంటుంది! ఆ బహుమానానికి మీరు వెలకట్టలేరు.
“ఆదాము వల్ల అందరూ చనిపోతున్నట్టే, క్రీస్తు వల్ల అందరూ బ్రతికించబడతారు.” (1 కొరింథీయులు 15:22) ఆదాము నుండి వచ్చినవాళ్లుగా, మనమందరం ‘చనిపోతున్నాం,’ అనారోగ్యం, మరణం తప్పించుకోలేకపోతున్నాం. దేవునితో సమాధానపడి ఆయన ముందు నిర్దోషులుగా ఉండలేకపోతున్నాం. మనం కేవలం మనుషులమే కాబట్టి మనల్ని మనం బ్రతికించుకోలేము లేదా వేరేవాళ్లని బ్రతికించలేము. బైబిలు ఇలా చెప్తుంది: “ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు . . . అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన 49:7-9) మనకు సహాయం ఎంతో అవసరం ఎందుకంటే విమోచించడానికి కావాల్సిన విలువ పెట్టుకోలేని దీనస్థితిలో మనం ఉన్నాం. అలానే వదిలేస్తే, మనం నిస్సహాయులుగా మిగిలిపోతాం.
ఆయన గొప్ప ప్రేమ వల్ల యెహోవా ఇష్టంగా ముందుకొచ్చి మనల్ని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడడానికి అవసరమయ్యే “చికిత్స” కోసం వెలను చెల్లించాడు. అప్పుడు యేసు ద్వారా “అందరూ బ్రతికించబడతారు.” విమోచన క్రయధనం దీనంతటిని ఎలా సాధ్యం చేస్తుంది? “ఆయన కొడుకైన యేసు రక్తం మన పాపాలన్నిటినీ కడిగివేస్తుంది.” యేసు చిందించిన రక్తం మీద విశ్వాసం 1 యోహాను 1:7; 5:13) విమోచన క్రయధనం వల్ల చనిపోయిన మన ప్రియమైనవాళ్లకు ఏమైనా ప్రయోజనం ఉందా? “మరణం ఎలాగైతే ఒక మనిషి ద్వారా వచ్చిందో, అలాగే మృతుల పునరుత్థానం కూడా ఒక మనిషి [యేసు] ద్వారానే కలుగుతుంది.”—1 కొరింథీయులు 15:21. a
ఉంటే పాపక్షమాపణ, శాశ్వత జీవితం పొందుతాం. (బహుమానాల్లో ఇదే అన్నిటికన్నా గొప్పది ఎందుకంటే బహుమానాలు ఇచ్చేవాళ్లలో దేవుని కన్నా గొప్పవాళ్లు ఎవరూ లేరు. యేసు బలిని ఏర్పాటు చేసిన దేవుని ప్రేమకు కూడా ఏది సాటిరాదు. మనకోసం యెహోవా దేవుడు చేసినంత త్యాగం ఎవ్వరూ, ఎప్పుడూ చేయలేదు. మనల్ని పాపం, మరణం నుండి విడిపించే ఆ త్యాగం కన్నా మన అవసరాలను తీర్చే బహుమానం ఇంకేది లేదు. విమోచన క్రయధనానికి ఉన్న విలువను దేనితో పోల్చలేము, దానికి సాటియైన బహుమానం ఏదీ ఉండదు.
a చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించే దేవుని ఉద్దేశం గురించి ఇంకా తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 7వ అధ్యాయం చూడండి. www.isa4310.com\te వెబ్‌సైట్‌లో ఈ పుస్తకం ఉంటుంది.