లోకం ఎవరి గుప్పిట్లో ఉంది?
లోకం ఎవరి గుప్పిట్లో ఉంది?
నేర సామ్రాజ్యాన్ని ఏలేవారిని బహుశా మీరెప్పుడూ కలిసివుండరు. అంతమాత్రాన వాళ్లు ఉనికిలో లేరని దానర్థమా? అలాంటివాళ్లు తెలివిగా తామెవరో లోకానికి తెలియనివ్వరు, జైలు గోడల వెనుకనుండి వ్యవహారాలను నడిపించడంలో వాళ్లు దిట్టలు. వార్తాపత్రిక ముఖశీర్షికల్లో మాదకద్రవ్యాల వ్యాపార పోరాటాల గురించిన, వేశ్యాగృహాల గురించిన, మనుషుల వ్యాపారం గురించిన వార్తలు ఉంటున్నాయి, ఇవి చెప్పుకోవడానికి కొన్నే. అలాంటి వార్తలు చదివినప్పుడు ఆ నేరస్థులు ఎంత చెడు ప్రభావం చూపిస్తున్నారో, వాళ్ల పనుల వల్ల ఎంత నష్టం జరుగుతోందో తెలుస్తుంది. మానవ సమాజానికి వాళ్లు చేసే హాని వల్ల అలాంటి నాయకులు ఉనికిలో ఉన్నారని మనకు తెలుసు.
సాతాను ఒక అదృశ్య వ్యక్తి అని, అతడు నేరాలకు ముఖ్య సూత్రధారిగా ఉంటూ ‘అబద్ధ సూచనలతో [NW],’ ‘దుర్నీతిని పుట్టించు మోసంతో’ తన పనులు సాగిస్తాడని బైబిలు చెబుతోంది. నిజానికి సాతాను, ‘వెలుగు దూత వేషం ధరించుకుంటున్నాడు’ అని కూడా బైబిలు చెబుతోంది. (2 థెస్సలొనీకయులు 2:9, 10; 2 కొరింథీయులు 11:14) అపవాది చేసిన హానిని చూస్తే ఆ నేర సామ్రాజ్య నాయకుల్లాగే అతడూ ఉనికిలో ఉన్నాడని తెలుస్తుంది. అయితే, కొన్ని సందేహాల వల్ల, అపోహల వల్ల అలాంటి దుష్ట వ్యక్తి ఒకడు ఉన్నాడని నమ్మడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అపవాది గురించి బైబిలు ఏమి చెబుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే ముందు అవేమిటో చూద్దాం.
◼ “ప్రేమగల దేవుడు అపవాదిని ఎలా సృష్టించగలడు?” దేవుడు మంచివాడు, పరిపూర్ణుడు అని బైబిలు చెబుతోంది. అలాంటి దేవుడు క్రూరుడు, ద్వేషపూరితుడు అయిన దుష్టుణ్ణి సృష్టించి ఉంటాడని అస్సలు అనుకోలేం. దేవుడు అలాంటి వ్యక్తిని సృష్టించాడని బైబిలు కూడా చెప్పడంలేదు. నిజానికి దేవుని గురించి అది ఇలా చెబుతోంది: ‘ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.’—ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 5:4.
కాబట్టి, ‘దేవుడు సృష్టించిన ఒక పరిపూర్ణ వ్యక్తి తప్పు చేయగలడా?’ అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి. దేవుడు మానవులను, దేవదూతలను రోబోల్లా తయారు చేయలేదు. వాళ్లకు స్వేచ్ఛా చిత్తాన్ని, అంటే సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. అందుకే తెలివిగల అలాంటి పరిపూర్ణ ప్రాణులకు మంచి చెడులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది.
తన సృష్టి ప్రాణులకు నైతిక స్వేచ్ఛనిచ్చిన దేవుడు, వాళ్లు చెడు పనులు చేయాలనుకుంటే ఎందుకు అడ్డుకుంటాడు? అపవాది తన స్వేచ్ఛా చిత్తాన్ని తప్పుగా వాడుకున్నాడని చెబుతూ యేసు ఇలా అన్నాడు: “[అతడు] సత్యమందు నిలిచినవాడు కాడు.” (యోహాను 8:44) అపవాదిగా మారిన అదృశ్య ప్రాణి మొదట్లో పరిపూర్ణుడని, ఒకానొక సమయంలో అతడు ‘సత్యంలో నిలిచాడని’ ఆ లేఖనం స్పష్టంగా చెబుతోంది. a యెహోవా దేవునికి తన సృష్టి ప్రాణుల మీద ప్రేమ, నమ్మకం ఉన్నాయి కాబట్టే వాళ్లకు స్వేచ్ఛా చిత్తం ఇచ్చాడు.—26వ పేజీలోని “పరిపూర్ణ వ్యక్తి పరిపూర్ణతను కోల్పోయే అవకాశం ఉందా?” అనే బాక్సు చూడండి.
◼ “అపవాది దేవుని సేవకుడు” బైబిల్లోని యోబు పుస్తకం అలా చెబుతోందని కొంతమందికి అనిపిస్తుంది. అపవాది ‘భూమ్మీద ఇటూ అటూ తిరుగులాడుతూ ఉన్నాడు’ అన్న మాటలు ప్రాచీన కాలంలోని పర్షియా గూఢచారులు చేసే పనిని సూచిస్తుందని ఒక బైబిలు వ్యాఖ్యానం చెబుతోంది. వాళ్లు రాజుకు చేసే యోబు 1:7) అపవాది నిజంగా దేవుని గూఢచారి అయితే తను ‘భూమ్మీద ఇటూ అటూ తిరుగులాడి’ వచ్చానని దేవునికి ఎందుకు చెబుతాడు? అపవాది దేవుని సేవకుడని బైబిలు చెప్పడం లేదు. నిజానికి యోబు పుస్తకం, అపవాదిని “సాతాను” అని అంటోంది, ఆ పదానికి “ఎదిరించేవాడు” అని అర్థం. కాబట్టి, అపవాది నిజానికి దేవుని ప్రధాన శత్రువని బైబిలు తెలియజేస్తోంది. (యోబు 1:6, అధస్సూచి) మరైతే, అపవాది దేవుని సేవకుడనే అపోహ ఎలా పుట్టింది?
సేవలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి విషయాలను రాజుకు తెలియజేసేవారు. (అపవాది దేవునితో వాదులాడినా ఆయనకు లోబడే ఉంటాడని దాదాపు సా.శ. మొదటి శతాబ్దం నాటికే, ప్రామాణికంకాని యూదుల పుస్తకాలు చెబుతున్నాయి. దేవుడు అపవాదిని తన పనిముట్టుగా అంటే, “తన తోటను సాగుచేయడానికి కలుపు తీసే సాధనంగా లేదా పారగా” ఉపయోగించుకున్నట్టు ప్రొటెస్టెంట్ సంస్కర్త మార్టిన్ లూథర్ భావించాడని చరిత్రకారుడు జె. బి. రస్సెల్ మెఫిస్టాఫిలిస్ అనే తన పుస్తకంలో రాశాడు. దాని అర్థాన్ని రస్సెల్ ఇలా వివరించాడు: “కలుపు మొక్కలను తీసేయడానికి పార సంతోషిస్తుంది.” అయితే అది దేవుని బలమైన చేతిలో ఉంటూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ఆ తర్వాత, మార్టిన్ లూథర్ బోధను ఫ్రెంచ్ వేదాంతి జాన్ కాల్‌విన్ సమ్మతించాడు. అయితే చాలామంది విశ్వాసులకు మాత్రం ఆ బోధ మింగుడుపడలేదు. ప్రేమగల దేవుడు యాకోబు 1:13) ఈ బోధను బట్టి, 20వ శతాబ్దంలో జరిగిన ఘోరమైన సంఘటనలను బట్టి చాలామంది దేవుణ్ణి, అపవాదిని నమ్మడం మానేశారు.
చెడును అనుమతించడమే కాక చెడు జరగాలని కూడా కోరుకుంటాడా? (◼ “అపవాది అంటే కేవలం చెడు స్వభావమే” అపవాది కేవలం చెడు స్వభావమే అనుకుంటే బైబిల్లోని కొన్ని భాగాలను అర్థంచేసుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు, యోబు 2:3-6 వచనాల్లో దేవుడు ఎవరితో మాట్లాడినట్టు? ఆయన యోబులో ఉన్న చెడు స్వభావంతో మాట్లాడాడా? లేక తనలో తాను మాట్లాడుకున్నాడా? దేవుడు ముందుగా యోబులో ఉన్న మంచి లక్షణాలను మెచ్చుకొని తర్వాత ఆయనను తీవ్రంగా పరీక్షిస్తాడా? దేవునికి అలాంటి లక్షణాలను అంటగడితే ఆయన వక్రబుద్ధిగలవాడని చెప్పినట్టే. కానీ దేవునిలో ‘ఎలాంటి చెడుతనం లేదు’ అని బైబిలు చెబుతోంది. (కీర్తన 92:14) నిజానికి, దేవుడు యోబుకు హాని జరిగేలా తన ‘చేయి చాపడానికి’ కూడా ఇష్టపడలేదు. కాబట్టి అపవాది, మనలోని చెడు స్వభావమో, దేవునిలో ఉండే చెడో కాదుగానీ, తనకు తానే దేవుని శత్రువుగా మారిన ఒక అదృశ్య వ్యక్తి.
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?
అపవాది ఉన్నాడని నమ్మడం మూర్ఖత్వమని ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు. అయితే అపవాది గురించి ప్రస్తావించకుండా చెడుకు కారణాన్ని సరిగ్గా వివరించలేం. అపవాది ఉన్నాడనే నిజాన్ని ఒప్పుకోని చాలామంది ఆ తర్వాత దేవుణ్ణే కాదు, నైతిక ప్రమాణాలన్నిటినీ తిరస్కరించారు.
19వ శతాబ్దపు రచయిత శార్ల్-పయర్ బోడ్‌లేయర్ ఇలా రాశాడు: “తను ఉనికిలో లేడని మనల్ని నమ్మించడమే అపవాదికున్న మహా చెడ్డ గుణం.” అపవాది తనెవరో తెలియకుండా చేసి దేవుని ఉనికి మీదే సందేహాలు రేకెత్తించాడు. అపవాది ఉనికిలో లేకపోతే చెడంతటికీ దేవుడే బాధ్యుడు అవుతాడు కదా? ప్రజలు అలా నమ్మాలన్నదే అపవాది కోరిక.
నేర సామ్రాజ్య నాయకునిలాగే అపవాది తన లక్ష్యం సాధించడానికి తెరవెనక ఉండాలనుకుంటాడు. ఇంతకీ అతని లక్ష్యం ఏమిటి? బైబిలు ఇలా చెబుతోంది: “ఈ యుగదేవుడు విశ్వాసం లేనివారి మనసులకు గుడ్డితనం కలిగించాడు. అందుచేత వారు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను గురించిన శుభవార్త వెలుగు చూడలేకపోతున్నారు.”—2 కొరింథీయులు 4:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
మనం ఇంకొక ప్రాముఖ్యమైన ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకోవాలి. తెరవెనక ఉంటూ చెడంతటికీ, బాధలన్నిటికీ కారణమైన ఈ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం. (w11-E 09/01)
[అధస్సూచి]
a అపవాది తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదో తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 11వ అధ్యాయం చూడండి.
[25వ పేజీలోని బ్లర్బ్]
అపవాది దేవుని సేవకుడా, శత్రువా?
[26వ పేజీలోని బాక్సు/చిత్రం]
పరిపూర్ణ వ్యక్తి పరిపూర్ణతను కోల్పోయే అవకాశం ఉందా?
దేవుడు తన తెలివిగల ప్రాణులకు ఇచ్చిన పరిపూర్ణత పరిమితమైనది. దేవుడు ఆదామును పరిపూర్ణంగా సృష్టించాడు. అయినా సృష్టికర్త పెట్టిన భౌతిక నియమాలను పాటించాలి. ఉదాహరణకు, ఆయన మట్టి, రాళ్లు, చెక్క వంటి వాటిని తినకూడదు. తింటే పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. గురుత్వాకర్షణ నియమాన్ని మీరి ఆదాము ఎత్తయిన కొండ మీద నుండి దూకితే చనిపోయి ఉండేవాడు లేదా తీవ్రంగా గాయపడి ఉండేవాడు.
అలాగే మానవులు దేవదూతలు అని తేడా లేకుండా, ఏ పరిపూర్ణ వ్యక్తయినా సరే దేవుడు పెట్టిన నైతిక హద్దులను మీరితే చెడు పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే. అందుకే ఒక పరిపూర్ణ దేవదూత స్వేచ్ఛా చిత్తాన్ని సరిగా ఉపయోగించకపోతే సులువుగా తప్పు చేసి, పాపంలో పడిపోతాడు.—ఆదికాండము 1:29; మత్తయి 4:4.