కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు?

భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు?

భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు?

‘కొందరు పరిసయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.’—మత్తయి 19:3, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలా? అది సాధ్యమేనా? యేసు కాలంలోని కొంతమంది ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు యేసు వాళ్లతో ఇలా చెప్పాడు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు, ‘పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్లిద్దరూ కలిసి ఒకే శరీరంగా జీవిస్తారు!’ ఇది మీరు చదవలేదా? ఆ కారణంగా వాళ్లనిక మీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్లను మానవుడు వేరు చేయరాదు!” a (మత్తయి 19:4-6, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దీన్నిబట్టి, భార్యాభర్తలు కలకాలం కలిసివుండాలన్నది దేవుని కోరికని స్పష్టమవుతోంది.

నేడు చాలా దేశాల్లో దాదాపు 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువమంది విడాకులు తీసుకుని ‘వేరైపోతున్నారు.’ వివాహం విషయంలో బైబిలిచ్చే సలహా ఈ రోజుల్లో ఇక పనికిరాదా? వివాహ ఏర్పాటులో లోపం ఉన్నందుకే భార్యాభర్తలు విడిపోతున్నారా?

ఈ విషయాన్ని పరిశీలించండి. రెండు జంటలు ఒకే మోడల్‌ బండిని కొనుక్కున్నారు. వాళ్లలో ఒక జంట తమ బండిని బాగా చూసుకుంటూ జాగ్రత్తగా నడిపిస్తున్నారు. వాళ్ల బండి పాడవలేదు. మరో జంట సమయం వెచ్చించి తమ బండి బాగోగులను చూసుకోవడం లేదు, దాన్ని లెక్కలేనట్టు నడిపిస్తున్నారు. చివరకు అది పాడైపోవడంతో దాన్ని మూలపడేయాల్సి వచ్చింది. బండిలో ఏదైనా లోపం ఉన్నందుకలా జరిగిందా లేక బండిని కొన్నవాళ్లు దాన్ని సరిగ్గా చూసుకోనందుకా? చాలావరకు, బండిని కొన్నవాళ్ల వల్లే అలా జరిగిందని చెప్పవచ్చు.

అలాగే, చాలామంది విడిపోతున్నారంటే వివాహ ఏర్పాటులోనే ఏదో లోపం ఉందని కాదు. చాలామంది దాంపత్య జీవితం సాఫీగా సాగడం చూస్తే విషయం మరోలా అర్థమవుతుంది. వాళ్లు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉంటూ సంతోషంగా ఉండగలుగుతున్నారు. కుటుంబాల్లో, సమాజాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది, వాళ్ల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. కానీ, బండిని ఎప్పటికప్పుడు బాగా చూసుకున్నట్టే, భార్యాభర్తలు ప్రేమతో ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపించుకోవాలి.

మీకు ఈ మధ్యే పెళ్లయినా లేక పెళ్లయి చాలా సంవత్సరాలవుతున్నా, మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఏమి చేయాలనే దాని గురించి బైబిలిచ్చే సలహా చక్కగా ఉపయోగపడుతుంది. కొన్ని ఉదాహరణలు తర్వాతి పేజీల్లో ఉన్నాయి. (w11-E 02/01)

[అధస్సూచి]

a భార్యాభర్తల్లో ఒకరు నమ్మకద్రోహం చేసినప్పుడు మాత్రమే విడాకులు తీసుకోవడానికి బైబిలు అనుమతిస్తోంది.—మత్తయి 19:9.