మీ పిల్లలకు నేర్పించండి
షేము రెండు చెడ్డ లోకాలను చూశాడు
నోవహు కుమారుడైన షేము పాత లోకం నాశనమవుతుండగా తప్పించుకుని, కొత్త లోకంలోకి అడుగుపెట్టాడు. షేము జీవించిన పాత లోకాన్ని దేవుడు ఎందుకు నాశనం చేశాడో, ఆయన, ఆయన కుటుంబంలోని మిగతావారు నాశనాన్ని తప్పించుకుని కొత్త లోకంలోకి ఎలా అడుగుపెట్టగలిగారో మీకు తెలుసా?— a దాని గురించి మనమిప్పుడు తెలుసుకుందాం.
షేము యువకునిగా ఉన్నప్పుడు, “నరుల చెడుతనము” విపరీతంగా పెరిగిపోయిందని బైబిలు చెబుతోంది. ప్రజలు ‘ఎప్పుడూ చెడ్డగానే’ ఆలోచించేవాళ్లు. అప్పుడు దేవుడేమి చేశాడో మీకు తెలుసా?— దేవుడు జలప్రళయం రప్పించి ఆ చెడ్డ లోకాన్ని నాశనం చేశాడు. ‘అప్పుడున్న లోకం నీటివరదలో మునిగి నశించింది’ అని అపొస్తలుడైన పేతురు రాశాడు.—ఆదికాండము 6:5; 2 పేతురు 3:6.
దేవుడు ఆ లోకాన్ని ఎందుకు నాశనం చేశాడో మీకు అర్థమైందా?— యేసు దాని గురించి చెప్పాడు. ‘జలప్రళయానికి ముందు ప్రజలు తింటూ, తాగుతూ, పెండ్లి చేసుకుంటూ, పెండ్లికిస్తూ ఉండి జలప్రళయం వచ్చి అందర్నీ కొట్టుకునిపోయే వరకు ఎరుగక పోయిరి; మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది’ అని యేసు చెప్పాడు.—మత్తయి 24:37-39.
అప్పుడున్న ప్రజలు ఎందుకు నాశనమయ్యారు?— షేము తండ్రి నోవహు ‘నీతిని ప్రకటించాడు,’ కానీ ప్రజలు ఆయన చెప్తున్నదాన్ని వినలేదు. నోవహు దేవుని మాట విని తాను, తన కుటుంబం జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఒక ఓడను కట్టాడు. నోవహు, ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారులు అంటే షేము, హాము, యాపెతు, వారి భార్యలు మాత్రమే దేవుడు చేయమన్నట్లు చేశారు. మిగతావాళ్లు తాము చేయాలనుకున్నదే చేశారు, అందుకే జలప్రళయంలో కొట్టుకుపోయారు.—2 పేతురు 2:5; 1 పేతురు 3:19, 20.
జలప్రళయం మొదలైన సంవత్సరం తర్వాత షేమువాళ్ల కుటుంబం ఓడలో నుండి ఆరిన నేల మీద అడుగుపెట్టారు. చెడ్డవారంతా నాశనమయ్యారు, కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. షేము తమ్ముడు హాము. ఈయన కుమారుడైన కనాను ఎంత చెడ్డ పని చేశాడంటే, ‘కనాను శపించబడును గాక’ అని నోవహు అన్నాడు. హాము మనవడైన నిమ్రోదు కూడా చాలా చెడ్డవాడు. ఆయన సత్యదేవుడైన యెహోవాను ఎదిరించి, తమ పేరు నిలిచిపోయేలా ఒక పెద్ద గోపురాన్ని కట్టమని ప్రజలకు చెప్పాడు. అదే బాబేలు గోపురం. ఇది చూసి షేముకు, ఆయన తండ్రికి ఎలా అనిపించి ఉంటుంది?—ఆదికాండము 9:25; 10:6-10; 11:4, 5.
ఆదికాండము 11:6-9) అయితే, దేవుడు షేము ఆయన కుటుంబం మాట్లాడే భాషను మాత్రం మార్చలేదు. అందువల్ల వాళ్లు కలిసేవుంటూ దేవుని సేవ చేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకోగలిగారు. షేము ఎంతకాలంపాటు యెహోవాను ఆరాధించాడో మీకు తెలుసా?—
వాళ్లు బాధపడ్డారు, యెహోవా కూడా బాధపడ్డాడు. అప్పుడు యెహోవా ఏమి చేశాడో మీకు తెలుసా?— ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాకుండా ఆయన వారి భాషను తారుమారు చేశాడు. దాంతో ప్రజలు గోపురాన్ని కట్టే పని ఆపి, వాళ్లలో ఒక్కొక్క భాష మాట్లాడేవారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లిపోవాల్సివచ్చింది. (షేము 600 సంవత్సరాలు జీవించాడు. ఆయన జలప్రళయానికి ముందు 98 సంవత్సరాలు, దాని తర్వాత 502 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఓడను కట్టడంలో, రాబోయే జలప్రళయం గురించి ప్రజలను హెచ్చరించడంలో తప్పకుండా నోవహుకు సహాయం చేసివుంటాడు. అయితే, జలప్రళయం తర్వాత తాను బ్రతికున్న 500 కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు షేము ఏమి చేసివుంటాడు?— నోవహు యెహోవాను ‘షేము దేవుడు’ అన్నాడు. షేము యెహోవా సేవ చేస్తూ తన కుటుంబం కూడా అలాగే చేసేలా వారికి సహాయం చేసివుంటాడు. ఈయన వంశంలోనే అబ్రాహాము, శారా, ఇస్సాకు పుట్టారు.—ఆదికాండము 9:26; 11:10-31; 21:1-3.
ఇప్పుడున్న లోకం ఎలావుంది? షేము కాలం నుండి అది అంతకంతకు దుర్మార్గంగా తయారవుతూ వచ్చింది. మరైతే ఈ లోకానికి ఏమి జరగబోతోంది?— అది ‘గతించిపోతుంది’ అని బైబిలు చెబుతోంది. కానీ ‘దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు’ అని అది మాటిస్తోంది. కాబట్టి మనం దేవుడు చెప్పింది చేస్తే, మనం కూడా రాబోయే నాశనాన్ని తప్పించుకుంటాం, దేవుడు తీసుకొచ్చే నూతన లోకంలోకి అడుగుపెడతాం. అప్పుడు మనం దేవుని సహాయంతో భూమ్మీద ఎప్పటికీ సంతోషంగా జీవిస్తాం!—1 యోహాను 2:17; కీర్తన 37:29; యెషయా 65:17. (w09-E 10/01)
a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.