‘నిర్ణయకాలం’ సమీపించింది
‘నిర్ణయకాలం’ సమీపించింది
హబక్కూకు ప్రవక్తలాగే, యేసు శిష్యులు కూడా బాధలు అంతమవడం చూడాలని ఎంతో కోరుకున్నారు. ఈ భూమ్మీది పరిస్థితుల్ని సరిదిద్దడానికి దేవుని రాజ్యం ఏమి చేస్తుందో తెలుసుకున్న తర్వాత వారు యేసును, ‘ఇవి ఎప్పుడు జరుగుతాయి? [రాజ్యాధికారంతో] నీవు రావడానికి, ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి?’ అని అడిగారు. (మత్తయి 24:3) యేసు దానికి జవాబిస్తూ, ఆ రాజ్యం భూమ్మీద పూర్తిస్థాయిలో అధికారాన్ని చేపట్టే ఖచ్చితమైన సమయం ఒక్క యెహోవా దేవునికి మాత్రమే తెలుసని చెప్పాడు. (మత్తయి 24:36; మార్కు 13:32) అయితే ఆ సమయం దగ్గరపడిందని చూపించే సంఘటనల గురించి యేసు, ఇంకా ఇతరులు ముందే చెప్పారు.— కుడివైపునున్న బాక్సు చూడండి.
ఈ సంఘటనలు మన చుట్టూ సర్వసాధారణంగా జరుగుతున్నాయని మీరు ఒప్పుకోరా? ప్రపంచవ్యాప్తంగా ఓ విద్యా కార్యక్రమం జరుగుతుందని కూడా యేసు ప్రవచించాడు. ఆయనిలా చెప్పాడు: ‘ఈ రాజ్య సువార్త సకల జనాలకు సాక్ష్యార్థంగా లోకమంతటా ప్రకటించబడుతుంది; ఆ తర్వాత అంతం వస్తుంది.’—మత్తయి 24:14.
ఈ రోజు సరిగ్గా ఆ పనే జరుగుతోంది. దీన్ని యెహోవాసాక్షులు చేస్తున్నారు. దాదాపు 236 దేశాల్లో 70 లక్షలకు పైగావున్న యెహోవాసాక్షులు ఆ రాజ్యం ఏమి చేస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. బాధలు, శ్రమలు అంతమవ్వాలని కోరుకునే దేవుని నీతియుక్త నియమాలకు తగ్గట్టు జీవించడానికి వారు ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఆ రాజ్యం గురించి నేర్చుకుంటూ ఉండండి, అప్పుడు ఎలాంటి బాధల్లేని లోకంలో ఎప్పటికీ జీవించే గొప్ప అవకాశం మీకు దొరుకుతుంది. (w09-E 12/01)
[8వ పేజీలోని బాక్సు]
అంత్యదినాల గురించి తెలియజేసే బైబిలు వచనాలు
• ముందెప్పుడూ జరగనన్ని యుద్ధాలు
• గొప్ప భూకంపాలు
• కరవులు
• తెగుళ్లు
• అక్రమం విస్తరించడం
• ప్రేమ చల్లారిపోవడం
• భూమిని పాడుచేయడం
• మితిమీరిన ధనాపేక్ష
• తల్లిదండ్రులకు అవిధేయత
• విపరీతమైన స్వార్థం
• అనురాగం లేకపోవడం
• దూషించడం
• సమాజంలోని అన్నిస్థాయిల వారిలో ఆశానిగ్రహం కొరవడడం
• చాలామంది మంచిని ప్రేమించకపోవడం
• దేవునికన్నా సుఖాలను ఎక్కువగా ప్రేమించడం
• చాలామంది వేషధారణతో క్రైస్తవులమని చెప్పుకోవడం
• అనేకమంది అబద్ధ ప్రవక్తలు ఉండడం
• నిజ క్రైస్తవులు హింసించబడడం
• బైబిలు హెచ్చరికల్ని ప్రజలు పట్టించుకోకపోవడం
[8వ పేజీలోని చిత్రం]
ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు దేవుని రాజ్యం గురించి ఇతరులకు బోధిస్తున్నారు