సృష్టిని చూసి నమ్మవచ్చు!
సృష్టిని చూసి నమ్మవచ్చు!
“దేవుడు, భవిష్యత్తు వంటివాటి విషయంలో క్రైస్తవ మతంతో సహా ఇతర మతాలు నమ్ముతున్నదాని గురించిన సత్యం తెలుసుకోవడం అసాధ్యమని, అది భవిష్యత్తులో సాధ్యమవుతుందేమో కానీ ప్రస్తుతం మాత్రం అసాధ్యమేనని అనుకునే వ్యక్తే అజ్ఞేయతావాది.” —తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, 1953.
థామస్ హెచ్. హక్స్లే అనే జీవశాస్త్రవేత్త ‘అజ్ఞేయతావాది’ అని అనువదించబడిన పదాన్ని కనిపెట్టాడు. హక్స్లే 1825లో జన్మించాడు. చార్లెస్ డార్విన్కు సమకాలీనుడైన ఈయన పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించాడు. “క్రైస్తవమతం చెబుతున్నట్లుగా, మనల్ని ప్రేమించే, మనపట్ల శ్రద్ధ చూపించే” దేవుడు ఉన్నాడనడానికి తనకెలాంటి ఆధారాలూ కనిపించడం లేదని 1863లో హక్స్లే వ్రాశాడు.
దేన్నైనా చూస్తేనే తప్ప నమ్మమని చెప్పుకునే అలాంటి ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలతో నేడు చాలామంది ఏకీభవిస్తారు. దేన్నైనా లేదా ఎవరినైనా ఎలాంటి రుజువులూ లేకుండా నమ్మడం అమాయకత్వమే అవుతుందని వారనవచ్చు.
దేవుణ్ణి గుడ్డిగా నమ్మమని బైబిలు చెబుతోందా? లేదు, బైబిలు అలా చెప్పడం లేదు! ఎలాంటి రుజువులూ లేకుండా ఒక విషయాన్ని నమ్మడం అమాయకత్వమేకాదు మూర్ఖత్వం కూడా అని బైబిలు తెలియజేస్తోంది. అదిలా చెబుతోంది: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామెతలు 14:15.
అయితే, దేవుడు ఉన్నాడన్న నమ్మకం మాటేమిటి? మనల్ని ప్రేమించే, మనపట్ల శ్రద్ధ చూపించే దేవుడు ఉన్నాడా? ప్రేమ, శ్రద్ధ చూపించడం మాట అటుంచితే, అసలు దేవుడు ఉన్నాడనడానికి రుజువులేమైనా ఉన్నాయా?
దేవుని లక్షణాలు వెల్లడిచేయబడ్డాయి
బైబిలు రచయితయైన పౌలు విద్యావంతులైన ఏథెన్సువారితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడే ‘జగత్తును దానిలోని సమస్తాన్ని నిర్మించాడని’ నొక్కిచెప్పాడు. దేవునికి మానవజాతి పట్ల శ్రద్ధ ఉందనీ, ఆయన “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అనీ పౌలు సంశయవాదులైన తన శ్రోతలతో చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 17:24-27.
దేవుడు ఉనికిలో ఉన్నాడనీ, ఆయనకు మానవులపట్ల శ్రద్ధ ఉందనీ పౌలు ఎందుకంత గట్టిగా నమ్మాడు? ఆయన రోము నగరంలో ఉంటున్న తన తోటి క్రైస్తవులకు వ్రాసిన పత్రికలో దానికొక కారణాన్ని వివరించాడు. దేవుని గురించి ఆయనిలా చెప్పాడు: ‘ఆయన అదృశ్యలక్షణములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన రోమీయులు 1:20.
వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.’—తర్వాతి పేజీల్లో, దేవుడు సృష్టించినవాటిలో స్పష్టంగా కనబడే, ఆయన మూడు లక్షణాల గురించి వివరించబడింది. ఆ ఉదాహరణలను పరిశీలిస్తుండగా మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘దేవుని ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం, ఏమి చేయడానికి నన్ను పురికొల్పాలి?’ (w 08 5/1)
[3వ పేజీలోని బ్లర్బ్]
దేవుణ్ణి గుడ్డిగా నమ్మమని బైబిలు చెప్పడం లేదు