కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2015
ఈ సంచికలో 2015 ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 27 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—రష్యాలో
అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడానికి రష్యాకు వెళ్లిన ఒంటరి సహోదరసహోదరీలు, దంపతుల గురించి చదవండి. వాళ్లు ఇంకా ఎక్కువగా యెహోవాపై నమ్మకముంచడం నేర్చుకున్నారు!
ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దండి
ఆధ్యాత్మిక పరదైసు, ఆధ్యాత్మిక ఆలయం ఒకటేనా? ‘మూడో ఆకాశంలో’ పౌలు చూసిన ‘పరదైసు’ ఏమిటి?
‘దుర్దినాల్లో’ సంతోషంగా యెహోవాను సేవించండి
మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకుంటూ యెహోవా సేవలో చురుగ్గా ఎలా ఉండవచ్చు? వయసుపైబడినా దేవున్ని సంతోషంగా సేవించిన ప్రాచీన కాల సేవకులను పరిశీలించండి.
‘మీ విడుదల సమీపించింది’!
మహాశ్రమలు మొదలైన తర్వాత ఏ సందేశాన్ని ప్రకటిస్తారు? ఆ సమయంలో అభిషిక్తులకు ఏమి జరుగుతుంది?
మీరు చేస్తున్న పనిని మనుషులు గుర్తించాలా?
మనం చేసేవాటిని మనుషులెవరూ చూడకపోయినా యెహోవా చూస్తాడు. బెసలేలు అహోలీయాబుల ఉదాహరణ పరిశీలిస్తే ఆ విషయం మనకు బాగా అర్థమౌతుంది.
దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉండండి
యెహోవాకు, ఆయన రాజ్యానికి నమ్మకంగా ఉండేలా క్రైస్తవులు తమకు తాము ఎలా శిక్షణ ఇచ్చుకోవచ్చు?
ఇది మన ఆరాధనా మందిరం
మన ఆరాధనా మందిరం పట్ల మనకు గౌరవం ఉందని ఎలా చూపించవచ్చు? రాజ్యమందిరాల నిర్మాణ పనికి, వాటి మరమ్మతులకు అవసరమైన డబ్బు ఎలా వస్తుంది?
మీకిది తెలుసా?
వాగ్దాన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అడవులు ఉండేవని బైబిలు చెప్తుంది. కానీ, ఇప్పుడు అక్కడ చెట్లు తక్కువగా ఉండడం చూస్తుంటే, అసలు బైబిలు చెప్తున్నది నిజమేనా అని అనిపించవచ్చు