కొరింథీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
కొరింథీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘపు ఆధ్యాత్మిక సంక్షేమం విషయంలో ఎంతో ఆందోళన చెందాడు. అక్కడి సహోదరుల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఆయనకు తెలిసింది. ఆ సంఘపు వారు అనైతికతను చూసీ చూడనట్లు ఊరుకున్నారు. అంతేకాక కొన్ని విషయాల గురించి అడుగుతూ వారు పౌలుకు ఉత్తరం రాశారు. అందుకే పౌలు సా.శ. 55 ఆ ప్రాంతంలో తన మూడవ మిషనరీ యాత్ర చేస్తుండగా కొరింథీయులకు మొదటి పత్రికను రాశాడు, అప్పుడాయన ఎఫెసులో ఉన్నాడు.
ఆ పత్రికను రాసిన కొన్ని నెలలకే ఆయన రెండవ పత్రికను రాసివుండవచ్చు. మరికొన్ని విషయాలు చెప్పడానికే ఆయన ఈ పత్రికను రాశాడు. అనేక విధాలుగా ఇప్పటి పరిస్థితులు, మొదటి శతాబ్దపు కొరింథు సంఘం లోపల బయటా ఉన్న పరిస్థితుల్లానే ఉన్నాయి. కాబట్టి పౌలు కొరింథు సంఘానికి రాసిన పత్రికల్లోని విషయాలు మనకు కూడా ఎంతో ప్రయోజనకరమైనవి.—హెబ్రీ. 4:12.
‘మెలకువగా, నిలకడగా, బలవంతులై ఉండండి’
“మీరందరు ఏకభావముతో మాటలాడవలెను” అని పౌలు వారిని ప్రోత్సహించాడు. (1 కొరిం. 1:10) ‘యేసుక్రీస్తు అనే పునాది మీద తప్ప’ మరి ఏ పునాదిమీద కూడా క్రైస్తవ లక్షణాలను కట్టలేరని, లేదా వాటిని యేసుక్రీస్తు నుండి తప్ప మరి ఎవరి దగ్గరనుండి నేర్చుకోలేరని ఆయన చెప్పాడు. (1 కొరిం. 3:11-13) సంఘంలోని ఒక జారుని గురించి పౌలు ఇలా చెప్పాడు: “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” (1 కొరిం. 5:13) “దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే” అని ఆయన చెప్పాడు.—1 కొరిం. 6:13.
‘వారు రాసినవాటికి’ జవాబు రాస్తూ పౌలు వివాహం విషయంలో, అవివాహితులుగా ఉండే విషయంలో మంచి సలహాలు ఇచ్చాడు. (1 కొరిం. 7:1) క్రైస్తవ శిరస్సత్వాన్ని గురించి, కూటాలను సక్రమంగా జరుపుకోవడం గురించి, పునరుత్థానం తప్పక జరుగుతుందన్న విషయం గురించి చెప్పిన తర్వాత పౌలు ఇలా ప్రోత్సహించాడు: “మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి.”—1 కొరిం. 16:13.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
1:21—నమ్మువారిని రక్షించడానికి యెహోవా నిజంగా ‘వెర్రితనాన్ని’ ఉపయోగిస్తాడా? ఉపయోగించడు. కానీ, “లోకము తన జ్ఞానంచేత దేవునిని ఎరుగకుండినందున” ప్రజలను రక్షించడానికి యెహోవా ఉపయోగించే పద్ధతి లోకానికి వెర్రితనంగా అనిపిస్తుంది.—యోహా. 17:25.
5:5—‘ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు 1 యోహా. 5:19) కాబట్టి ఈ లేఖనంలో అతడు సాతానుకు అప్పగించబడినట్లు చెప్పబడింది. ఆ వ్యక్తి సంఘంనుండి బహిష్కరించబడడం వల్ల అతని చెడు ప్రభావం సంఘంపై ఉండదు. అంతేకాక సంఘ ఆత్మ లేదా సంఘంలో మంచి స్వభావం నిలిచివుంటుంది.—2 తిమో. 4:22.
నశించుటకై [దుష్టుణ్ణి] సాతానుకు అప్పగించడం’ అంటే అర్థం ఏమిటి? పశ్చాత్తాపపడకుండా ఘోరమైన పాపం చేస్తున్న వ్యక్తి సంఘంనుండి బహిష్కరించబడినప్పుడు అతడు మళ్లీ సాతాను దుష్ట లోకంలోకి వెళ్లిపోతాడు. (7:33, 34—వివాహితులు ఎలాంటి ‘లోకవిషయాల’ గురించి చింతిస్తారు? వివాహిత క్రైస్తవులు ఆహారం, బట్టలు, ఇల్లు లాంటి అనుదిన విషయాల గురించి చింతించాల్సి వస్తుందని పౌలు చెబుతున్నాడు. కానీ లోకంలో ఉన్న చెడు విషయాల గురించి అంటే క్రైస్తవులు దూరంగా ఉండాల్సిన వాటి గురించి పౌలు ఇక్కడ మాట్లాడడం లేదు.—1 యోహా. 2:15-17.
11:26—యేసు మరణాన్ని ఎంత తరచుగా, ఎప్పటి “వరకు” జ్ఞాపకం చేసుకోవాలి? యేసు మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోవాలని పౌలు చెప్పడం లేదు. బదులుగా అభిషక్త క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి నీసాను 14న జ్ఞాపకార్థ చిహ్నాలను తీసుకున్నప్పుడల్లా ‘ఆయన మరణమును ప్రచురిస్తారు’ అని పౌలు చెప్పాడు. ‘ఆయన వచ్చు వరకూ’ అంటే ఆయన వారిని పరలోకానికి పునరుత్థానం చేసేంతవరకూ వారు దీనిని జ్ఞాపకం చేసుకుంటారు.—1 థెస్స. 4:14-17.
13:13—విశ్వాస నిరీక్షణలకన్నా ప్రేమ ఎలా శ్రేష్ఠమైనది? మనం ‘నిరీక్షించేవి’ నెరవేరినప్పుడు, నిశ్చయంగా జరుగుతాయనుకున్నవి జరిగినప్పుడు విశ్వాస, నిరీక్షణల అవసరం ఇక ఉండదు. (హెబ్రీ. 11:1) ప్రేమ శాశ్వతమైనది కాబట్టి అది విశ్వాస, నిరీక్షణలకన్నా శ్రేష్ఠమైనది.
15:29, NW—‘మరణించడానికి బాప్తిస్మం పొందడం’ అంటే ఏమిటి? అనేక బైబిళ్లు ఈ వచనాన్ని అనువదించిన తీరునుబట్టి చూస్తే బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయినవారి కోసం బ్రతికివున్నవారు బాప్తిస్మం తీసుకోవాలి అనే అర్థం వస్తుంది, పౌలు దాని గురించి చెప్పడం లేదు. కానీ ఆయన అభిషిక్త క్రైస్తవులు కొత్త జీవితాన్ని ఆరంభించడానికి బాప్తిస్మం తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. వారు మరణించి ఆ తర్వాత పరలోకానికి పునరుత్థానమయ్యేంత వరకూ ఆ జీవితంలో యథార్థంగా జీవించాలి.
మనకు పాఠాలు:
1:26-31; 3:3-9; 4:7. మన విషయంలో కాకుండా వినయంతో దేవుని విషయంలో అతిశయించడం సంఘ ఐక్యతకు తోడ్పడుతుంది.
2:3-5. గ్రీకు తత్వజ్ఞానానికి, విద్యాభ్యాసానికి నెలవైన కొరింథు పట్టణంలో సాక్ష్యమిస్తున్నప్పుడు, తన ప్రేక్షకులను ఒప్పించగలుగుతానో లేదో అని పౌలు ఆందోళనపడి ఉండవచ్చు. అయితే, ఆయనకు బలహీనతలున్నా, భయమున్నా దేవుడు తనకిచ్చిన పరిచర్యను మానేయలేదు. అలాగే మనం కూడా కష్ట పరిస్థితులు ఎదురైనా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ఆపుచేయకూడదు. పౌలులాగే మనం కూడా నమ్మకంతో యెహోవా సహాయాన్ని కోరవచ్చు.
2:16. “ప్రభువు మనస్సును” కలిగివుండడం అంటే ఆయన ఎలా ఆలోచిస్తాడో ఎందుకలా ఆలోచిస్తాడో తెలుసుకొని ఆయనలా ఆలోచిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థంచేసుకుని ఆయన మాదిరిని అనుకరిస్తూ ఉండడం అని అర్థం. (1 పేతు. 2:21; 4:1) యేసు జీవితాన్ని, పరిచర్యను జాగ్రత్తగా అధ్యయనం చేయడం ఎంత ప్రాముఖ్యం!
3:10-15; 4:17. బోధించి శిష్యులను చేసే పనిలో మనకు ఎంత సామర్థ్యముందో పరిశీలించుకొని దానిని పెంచుకోవాలి. (మత్త. 28:19, 20) మనం సరిగా బోధించకపోతే మన బైబిలు విద్యార్థులు విశ్వాస పరీక్షలను తప్పించుకోలేకపోవచ్చు. వాళ్లను పోగొట్టుకోవడం ఎంత బాధాకరంగా ఉండొచ్చంటే మన రక్షణ “అగ్నిలోనుండి తప్పించుకొన్నట్లు” ఉంటుంది.
6:18. ‘జారత్వమునకు దూరముగా పారిపోవడం’ అంటే కేవలం పోర్నియాకు సంబంధించిన క్రియలకు దూరంగా ఉండడం మాత్రమే కాదు. జారత్వానికి నడిపించే వేటినుండైనా, అంటే అశ్లీల చిత్రాలు, అపవిత్రత, అనైతిక ఆలోచనలు, సరసాలాడడం వంటివాటికి కూడా దూరంగా ఉండాలి.—మత్త. 5:28; యాకో. 3:17.
7:29. భార్యాభర్తలు ఒకరి పనుల్లో ఒకరు పూర్తిగా నిమగ్నమైపోయి, తమ జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు రెండవస్థానం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
10:8-11. ఇశ్రాయేలీయులు మోషే, అహరోనుల మీద సణిగినప్పుడు యెహోవాకు ఎంతో కోపం వచ్చింది. సణగడాన్ని అలవాటుగా చేసుకోకుండా ఉండడం మంచిది.
16:2. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి ప్రతీసారి ఇంతివ్వాలని ముందే నిర్ణయించుకుంటే క్రమం తప్పకుండా ఇవ్వగలుగుతాం.
‘సరిదిద్దబడుతూ ఉండండి’
గద్దించబడిన తప్పిదస్థుడు పశ్చాత్తాపపడితే ఆయనను దయతో ‘క్షమించి ఆదరించాలని’ పౌలు కొరింథీయులకు చెప్పాడు. ఆయన రాసిన మొదటి పత్రిక వారిని బాధపరచినా ‘వారు దుఃఖపడి మారుమనస్సు పొందినందుకు’ పౌలు ఆనందించాడు.—2 కొరిం. 2:6, 7; 7:8, 9.
కొరింథీయులు ‘ప్రతివిషయంలో ఎలా అభివృద్ధి పొందుతున్నారో’ అలాగే ‘కృపలో అభివృద్ధి పొందాలని’ అంటే ధారాళంగా ఇవ్వాలని పౌలు వారిని ప్రోత్సహించాడు. ఆయన తన వ్యతిరేకులకు జవాబిచ్చిన తర్వాత అందరికీ ఒక చివరి సలహా ఇచ్చాడు: “సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి [‘సరిదిద్దబడుడి,’ NW], ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి.”—2 కొరిం. 8:7; 13:11.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
2:15, 16—మనమెలా “క్రీస్తు సువాసనయై యున్నాము”? మనం బైబిల్లోని విషయాలకు విధేయత చూపిస్తూ దానిలోని సందేశాన్ని ఇతరులకు తెలియజేస్తాం కాబట్టి క్రీస్తు సువాసనగా ఉన్నాం. అనీతిమంతులకు ఆ “సువాసన” ఏవగింపుగా అనిపించినా యెహోవా, యథార్థ హృదయులు దానిని ఇష్టపడతారు.
5:16—అభిషక్త క్రైస్తవులు ‘శరీరరీతిగా ఎవనినైనను ఎరుగరు’ అని ఎందుకు చెప్పవచ్చు? వారు ప్రజల్ని శరీరరీతిగా చూడరు అంటే ఐశ్వర్యం, జాతి, తెగ, దేశం ఆధారంగా ఎవరిపట్లా పక్షపాతం చూపించరు. తోటి క్రైస్తవులతో తమకున్న ఆధ్యాత్మిక సంబంధానికి వారు ఎంతో విలువనిస్తారు.
11:1, 16; 12:11—పౌలు కొరింథీయులతో అవివేకంగా ప్రవర్తించాడా? లేదు. అయితే, ఆయన తన అపొస్తలత్వాన్ని నిరూపించుకోవడానికి చెప్పాల్సివచ్చిన దానినిబట్టి ఆయన గొప్పలు చెప్పుకునేవాడని, అవివేకి అని కొందరు అనుకొనివుండవచ్చు.
12:1-4—ఎవరు ‘పరదైసులోనికి కొనిపోబడ్డారు’? అలాంటి దర్శనం మరొకరికి కలిగిందని బైబిలు చెప్పడంలేదు. పౌలు తన అపొస్తలత్వాన్ని నిరూపించుకుంటూ మాట్లాడిన తర్వాత ఈ మాటలు పలికాడు, కాబట్టి బహుశా ఆయన తనకు జరిగిన దాని గురించే చెప్పివుండవచ్చు. “అంత్యకాలము”లో క్రైస్తవ సంఘం అనుభవించే ఆధ్యాత్మిక పరదైసునే అపొస్తలుడు దర్శనంలో చూసివుండవచ్చు.—దాని. 12:4.
మనకు పాఠాలు:
3:5. యెహోవా దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, భూసంస్థ ద్వారా క్రైస్తవులను పరిచర్య చేయడానికి తగినవిధంగా సమర్థులను చేస్తాడని ఈ వచనంలోని సూత్రం నుండి తెలుస్తోంది. (యోహా. 16:7; 2 తిమో. 3:16, 17) మనం బైబిలును, బైబిలు సాహిత్యాలను శ్రద్ధగా చదివి, పరిశుద్ధాత్మ కోసం పట్టుదలతో ప్రార్థించి, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవుతూ వాటిలో పాల్గొంటూ ఉండాలి.—కీర్త. 1:1-3; లూకా 11:10-13; హెబ్రీ. 10:24, 25.
4:16. యెహోవా ‘ఆంతర్యపు పురుషుణ్ణి దినదినము’ నూతపరుస్తున్నాడు కాబట్టి ఆయన మన కోసం చేసిన ఏర్పాట్ల నుండి నిత్యం ప్రయోజనం పొందాలి. మన జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలను ధ్యానించని రోజంటూ ఉండకుండా చూసుకోవాలి.
4:17, 18. ‘శ్రమలు క్షణమాత్రం ఉండేవి, చులకనివి’ అని గుర్తుంచుకున్నప్పుడు మనం కష్టకాలాల్లోనూ యెహోవాకు నమ్మకంగా ఉండగలుగుతాం.
5:1-5. అభిషిక్త క్రైస్తవులకు తమ పరలోక జీవితపు నిరీక్షణపట్ల ఉన్న మనోభావాలను పౌలు ఎంత చక్కగా వర్ణించాడో కదా!
10:13. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేయమని ప్రత్యేకంగా చెబితే తప్ప మన సంఘానికి నియమించబడిన క్షేత్రంలోనే పనిచేయాలని గుర్తుంచుకోవాలి.
13:5. ‘విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో శోధించుకోవడానికి’ బైబిలు నుండి నేర్చుకుంటున్నవాటికి అనుగుణంగా మన ప్రవర్తన ఉందో లేదో పరిశీలించుకోవాలి. ‘మనల్ని మనం పరీక్షించుకోవడానికి’ మన ‘జ్ఞానేంద్రియాలు’ ఎంత చక్కగా పనిచేస్తున్నాయో, మన విశ్వాసాన్ని ఎంతమేరకు క్రియల ద్వారా చూపిస్తున్నామో పరిశీలించుకోవడంతోపాటు మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. (హెబ్రీ. 5:14; యాకో. 1:22-25) పౌలు ఇచ్చిన చక్కని సలహాలను అన్వయించుకోవడం ద్వారా మనం సత్యమార్గంలో నడుస్తూ ఉండగలుగుతాం.
[26, 27వ పేజీలోని చిత్రం]
“మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల” అనే మాటల భావమేమిటి?—1 కొరిం. 11:26