మన పిల్లలు—ఒక అమూల్యమైన స్వాస్థ్యము
మన పిల్లలు—ఒక అమూల్యమైన స్వాస్థ్యము
“కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము; గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.”—కీర్తన 127:3.
మొదటి స్త్రీపురుషులను సృష్టించిన విధానాన్నిబట్టి యెహోవా దేవుడు సాధ్యం చేసిన అద్భుతమైన క్రియల గురించి ఆలోచించండి. ఆదాము హవ్వలు కలిసి ఒక కణాన్ని రూపొందించడంలో భాగం వహించారు, ఆ కణం హవ్వ గర్భంలో ఒక సంపూర్ణమైన కొత్త వ్యక్తిగా అంటే మొదటి మానవ శిశువుగా వృద్ధిచెందింది. (ఆదికాండము 4:1) గర్భధారణ, శిశు జననం అనేవి నేటికీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి, అవి సాటిలేని అద్భుతాలని అనేకులు వర్ణిస్తారు.
2 తల్లిదండ్రుల సంగమం కారణంగా తల్లి గర్భంలో ఉద్భవించిన తొలి జీవకణం కేవలం 270 రోజుల్లోనే లక్షలకోట్ల జీవకణాలుగల శిశువుగా ఎదుగుతుంది. ఆ తొలి జీవకణంలో 200 కన్నా ఎక్కువ రకాల జీవకణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆదేశాలు ఉంటాయి. మానవ అవగాహనకు అంతుబట్టని ఆ అద్భుతమైన ఆదేశాలను అనుసరించి, సంక్లిష్టమైన ఈ జీవకణాలు ఒక కొత్త వ్యక్తి రూపొందేందుకు సరిగ్గా అవసరమైన క్రమంలో, రీతిలో వృద్ధి చెందుతాయి!
3 అయితే ఆ శిశువు అసలు సృష్టికర్త ఎవరని మీరు చెబుతారు? నిస్సందేహంగా మొట్టమొదట జీవాన్ని సృష్టించిన సృష్టికర్తే. బైబిలు కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను.” (కీర్తన 100:3) తల్లిదండ్రులారా, అంతటి అపురూపమైన శిశువు మీ ప్రజ్ఞాపాటవాల కారణంగా ఉనికిలోకి రాలేదని మీకు బాగా తెలుసు. అపారమైన జ్ఞానంగల దేవుడు మాత్రమే ఒక కొత్త వ్యక్తి అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకోవడానికి కారణం కాగలడు. వేలాది సంవత్సరాలుగా ఆలోచనాపరులైన ప్రజలు, తల్లి గర్భంలో శిశువు రూపొందడానికి సంబంధించిన ఘనతను మహోన్నతుడైన సృష్టికర్తకే ఆపాదించారు. మీరు కూడా అలా చేస్తున్నారా?—కీర్తన 139:13-16.
4 అయితే యెహోవా, స్త్రీపురుషులు సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగేలా కేవలం ఒక జీవశాస్త్ర ప్రక్రియను ఆరంభించిన ఎలాంటి భావోద్వేగాలూ లేని సృష్టికర్తా? కొంతమంది మానవులు అలా భావోద్వేగాలు లేకుండా ఉంటారు, అయితే యెహోవా అలా ఎన్నడూ ఉండడు. (కీర్తన 78:38-40) కీర్తన 127:3లో బైబిలు ఇలా చెబుతోంది: “కుమారులు [కుమార్తెలు కూడా] యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము; గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.” మనం ఇప్పుడు స్వాస్థ్యం అంటే ఏమిటో, అది దేనిని నిరూపిస్తుందో పరిశీలిద్దాం.
స్వాస్థ్యం, బహుమానం
5 స్వాస్థ్యం ఒక బహుమానం వంటిది. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్వాస్థ్యం వదిలివెళ్ళడానికి చాలాకాలం కష్టపడి పనిచేస్తారు. ఆ స్వాస్థ్యం డబ్బు, ఆస్తి లేదా అమూల్యమైన సంపద ఏదైనా కావచ్చు. ఏదేమైనా, అది తల్లిదండ్రుల ప్రేమకు నిదర్శనగా ఉంటుంది. అయితే దేవుడు తల్లిదండ్రులకు వారి పిల్లలను స్వాస్థ్యంగా ఇచ్చాడని బైబిలు చెబుతోంది. పిల్లలు తల్లిదండ్రులకు దేవుడిచ్చే ప్రేమపూర్వక బహుమానం. మీరు ఒకవేళ తల్లి లేదా తండ్రి అయితే, మీ పిల్లలను విశ్వ సృష్టికర్త మీకు అప్పగించిన ఒక బహుమానంగా దృష్టిస్తున్నట్లు మీ క్రియలు చూపిస్తున్నాయా?
ఆదికాండము 1:27, 28; యెషయా 45:18) కోటానుకోట్ల దేవదూతలను సృష్టించినట్లుగా యెహోవా ప్రతీ మానవుణ్ణి తనే వ్యక్తిగతంగా సృష్టించలేదు. (కీర్తన 104:4; ప్రకటన 4:10-11) బదులుగా, పిల్లలను కనే సామర్థ్యంతో మానవులను సృష్టించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు, అలా మానవులకు పుట్టిన పిల్లలు తమ తల్లిదండ్రులను పోలి ఉంటారు. అలాంటి కొత్త శిశువుకు జన్మనిచ్చి, ఆ శిశువును శ్రద్ధగా చూసుకోవడం తల్లిదండ్రులకు ఎంత అద్భుతకరమైన ఆధిక్యతో కదా! తల్లిదండ్రులుగా మీరు ఈ అమూల్య స్వాస్థ్యాన్ని ఆనందించడాన్ని సాధ్యం చేసినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా?
6 ఆదాము, హవ్వల సంతానంతో ఈ భూమిని నింపాలనే సంకల్పంతోనే యెహోవా ఈ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. (యేసు మాదిరి నుండి నేర్చుకోండి
7 విచారకరంగా, అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక బహుమానంగా పరిగణించరు. మరి కొంతమంది తమ పిల్లలపట్ల కనికరమే చూపించరు. అలాంటి తల్లిదండ్రులు యెహోవా దృక్పథాన్ని గానీ ఆయన కుమారుని దృక్పథాన్ని గానీ ప్రతిబింబించరు. (కీర్తన 27:10; యెషయా 49:15) అలాంటివారికి భిన్నంగా పిల్లల విషయంలో యేసు చూపించిన ఆసక్తిని పరిశీలించండి. యేసు మానవునిగా భూమ్మీదకు రాకముందే అంటే పరలోకంలో ఒక శక్తిమంతమైన ఆత్మ ప్రాణిగా ఉన్నప్పుడే, ఆయన ‘నరులను చూచి ఆనందించుచుండెను’ అని బైబిలు చెబుతోంది. (సామెతలు 8:31) ఆయన మానవులను ఎంతగా ప్రేమించాడంటే, మనం నిత్యజీవం పొందగలిగేలా ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చాడు.—మత్తయి 20:28; యోహాను 10:18.
8 ఈ భూమ్మీద ఉన్నప్పుడు, యేసు ప్రత్యేకంగా తల్లిదండ్రులకు చక్కని మాదిరి ఉంచాడు. ఆయన ఏమి చేశాడో పరిశీలించండి. ఆయన ఎంతో పనిరద్దీలో ఉన్నా, ఒత్తిడి క్రింద ఉన్నా పిల్లలతో సమయం గడిపాడు. వారు సంతవీధిలో ఆడుకోవడాన్ని గమనించి, తన బోధలో వారి ప్రవర్తనా అంశాలను ఉపయోగించాడు. (మత్తయి 11:16, 17) యెరూషలేముకు చివరిసారి వెళ్లినప్పుడు తాను కష్టాలు ఎదుర్కొని, చంపబడతానని యేసుకు తెలుసు. కాబట్టి, ప్రజలు ఆయన దగ్గరకు పిల్లలను తీసుకొచ్చినప్పుడు, బహుశా ఆయనకు మరింత ఒత్తిడి కలుగకుండా చూడాలనే ఉద్దేశంతో యేసు శిష్యులు పిల్లలను దగ్గరకు రానివ్వకుండా ఆపడానికి ప్రయత్నించారు. కానీ యేసు తన శిష్యులను మందలించాడు. ఆయన ఆ చిన్న పిల్లలను చూసి తన ‘ఆనందాన్ని’ వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: “చిన్నబిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు.”—మార్కు 10:13, 14.
9 మనం యేసు మాదిరి నుండి నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం పనిరద్దీలో ఉన్నాసరే, మనమెలా ప్రతిస్పందిస్తాం? యేసులాగే ప్రతిస్పందిస్తామా? యేసు పిల్లలకు తన సమయాన్ని, అవధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పిల్లలకు, ప్రత్యేకంగా వారి తల్లిదండ్రుల నుండి కావలసినవి అవే. “నిన్ను ప్రేమిస్తున్నాను” అని మాటల్లో చెప్పడం ప్రాముఖ్యమైనదే. అయితే మాటలకన్నా చేతలే బిగ్గరగా మాట్లాడతాయి. మీ ప్రేమ మీ మాటల ద్వారానే కాక, మీ క్రియల ద్వారా ఎక్కువగా కనబర్చబడుతుంది. మీరు మీ పిల్లలకిచ్చే సమయం, అవధానం, శ్రద్ధ ద్వారా ఆ ప్రేమ వ్యక్తం అవుతుంది. అయితే అవన్నీ ఇచ్చినా, మీరు ఆశించినంత త్వరగా స్పష్టమైన ఫలితాలు బహుశా రాకపోవచ్చు. దానికి సహనం అవసరం. యేసు తన శిష్యులతో వ్యవహరించిన విధానాన్ని అనుకరిస్తే, మనం సహనం చూపించడాన్ని నేర్చుకోవచ్చు.
యేసు చూపించిన సహనం, అనురాగం
10 తన శిష్యులు తమలో ఎవరు ప్రముఖులు అనే విషయానికి సంబంధించి పోటీ పడుతున్నారని యేసుకు తెలుసు. మార్కు 9:33-37) అది కోరిన ఫలితాలను తెచ్చిందా? వెంటనే తీసుకు రాలేదు. దాదాపు ఆరు నెలల తర్వాత యాకోబు, యోహానులు రాజ్యంలో తమకు ప్రముఖ స్థానాలు ఇవ్వమని తమ తల్లితో యేసును అడిగించారు. యేసు మళ్లీ ఓపికగా వారి ఆలోచనా విధానాన్ని సరిదిద్దాడు.—మత్తయి 20:20-28.
ఒకరోజు తన శిష్యులతో కపెర్నహూముకు చేరుకున్న తర్వాత, ‘మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా, ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక వారు ఊరకుండిరి.’ యేసు వారిని కఠినంగా గద్దించే బదులు, వినయం గురించి బోధించడానికి వారికి ఒక చిన్నబిడ్డను చూపించి ఓపికగా పాఠం నేర్పించాడు. (11 త్వరలోనే సా.శ. 33 పస్కా రావడంతో, దానిని ఆచరించడానికి యేసు తన అపొస్తలులతో ఏకాంతంగా సమావేశమయ్యాడు. మేడ గదిలోకి వచ్చిన తర్వాత, మట్టి కొట్టుకుపోయిన ఇతరుల కాళ్లను కడిగే ఆచారబద్ధమైన సేవ చేయడానికి 12 మంది అపొస్తలుల్లో ఏ ఒక్కరూ చొరవ తీసుకోలేదు. సాధారణంగా అలాంటి తక్కువ పనిని ఒక సేవకుడు లేదా కుటుంబంలోని ఒక స్త్రీ చేస్తుంది. (1 సమూయేలు 25:41; 1 తిమోతి 5:10) తన శిష్యులు ఇంకా హోదాను, స్థానాన్ని దక్కించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు అని గమనించి యేసు ఎంత బాధపడి ఉంటాడో కదా! దానితో యేసు వారిలో ప్రతీ ఒక్కరి కాళ్లు కడిగి, ఇతరులకు సేవ చేయడంలో తన మాదిరిని అనుకరించమని వారిని మనఃపూర్వకంగా వేడుకున్నాడు. (యోహాను 13:4-17) వారు యేసు మాదిరిని అనుసరించారా? ఆ సాయంకాలమే, “తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టెను” అని బైబిలు చెబుతోంది.—లూకా 22:24.
12 తల్లిదండ్రులారా మీ ఉపదేశానికి మీ పిల్లలు స్పందించనప్పుడు, యేసు ఎలా భావించి ఉండవచ్చో మీరు గ్రహిస్తున్నారా? యేసు శిష్యులు తమ తప్పులను వెంటనే సరిదిద్దుకోలేకపోయినప్పటికీ, ఆయన వారి విషయంలో ఆశ వదులుకోలేదని గుర్తుంచుకోండి. ఆయన సహనం చివరకు సత్ఫలితాలను సాధించింది. (1 యోహాను 3:14, 18) తల్లిదండ్రులారా, పిల్లలకు శిక్షణ ఇచ్చే మీ ప్రయత్నాల్లో ఎన్నటికీ ఆశ వదులుకోకుండా యేసు ప్రేమను, సహనాన్ని మీరు అనుకరించాలి.
13 తల్లిదండ్రులు తమను ప్రేమిస్తున్నారని, తమపై వారికి శ్రద్ధ ఉందని పిల్లలు తెలుసుకోవాలి. యేసు తన శిష్యుల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని కోరుకున్నాడు, కాబట్టే ఆయన వారి ప్రశ్నలను జాగ్రత్తగా విన్నాడు. ఫలాని విషయాల గురించి వారి అభిప్రాయాలేమిటో ఆయన వారిని అడిగి తెలుసుకున్నాడు. (మత్తయి 17:25-27) అవును, మంచిగా బోధించడానికి జాగ్రత్తగా వినడం, నిజమైన శ్రద్ధ చూపించడం అవసరం. కాబట్టి పిల్లవాడు ఏదో అడుగుతూ దగ్గరకువస్తే తల్లిదండ్రులు వెంటనే “పని చేసుకుంటున్నాను కనబడ్డం లేదా! ఫో అవతలకి!” అని గదమాయించకూడదు. తల్లి లేదా తండ్రి నిజంగా పనిరద్దీలో ఉంటే, ఆ విషయం తర్వాత మాట్లాడవచ్చని పిల్లవాడికి నచ్చజెప్పాలి. ఆ తర్వాత దాన్ని మరచిపోకుండా చర్చించాలి. అలా చేసినప్పుడు తల్లిదండ్రులకు తనపై నిజంగా శ్రద్ధ ఉందని పిల్లవాడు గ్రహించి, వారి మీద నమ్మకాన్ని పెంచుకుంటాడు.
14 తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకొని, మార్కు 10:16) అప్పుడు ఆ పిల్లలు ఎలా స్పందించి ఉంటారని మీరనుకుంటున్నారు? నిశ్చయంగా వారి హృదయాలు ఉప్పొంగి, వారు యేసుకు మరింత చేరువై ఉంటారు! తల్లిదండ్రులైన మీకూ మీ పిల్లలకూ మధ్య నిజమైన ప్రేమ ఉంటే, వారికి శిక్షణ ఇచ్చి, బోధించాలనే మీ ప్రయత్నాలకు వారు మరింత సంసిద్ధంగా స్పందిస్తారు.
కౌగలించుకోవడం మంచిదేనా? ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు యేసు నుండి నేర్చుకోవచ్చు. ఆయన “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను” అని బైబిలు చెబుతోంది. (పిల్లలతో ఎంత సమయం గడపాలనే ప్రశ్న
15 తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడం, వారి ప్రేమపూర్వక శ్రద్ధను పొందడం పిల్లలకు నిజంగా అవసరమా అని కొందరు ప్రశ్నించారు. పిల్లల పెంపకానికి సంబంధించి విలువైన సమయం అనే ఆలోచనకు ఎంతో నేర్పుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆలోచనను ప్రచారం చేసేవారి అభిప్రాయం ప్రకారం, పిల్లలతో తల్లిదండ్రులు గడిపేది పరిమిత సమయమే అయినా అది ఒక పద్ధతి ప్రకారం పథకం వేసుకొని చక్కని సిద్ధపాటుతో అర్థవంతంగా గడిపితే, వారు పిల్లలతో ఎంతో ఎక్కువ సమయం గడపవలసిన అవసరం లేదు. అయితే విలువైన సమయాన్ని వెచ్చించడం అనేది పిల్లల సంక్షేమాన్ని మనస్సులో ఉంచుకుని ప్రవేశపెట్టిన మంచి ఆలోచనేనా?
16 అనేకమంది పిల్లలతో మాట్లాడిన ఒక రచయిత, పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి “మరింత సమయాన్ని,” “అవిభాగిత అవధానాన్ని ఎక్కువగా కోరుకుంటారు” అని చెప్పాడు. కాబట్టి ఒక కళాశాల పండితుడు సరిగ్గానే ఇలా చెప్పాడు: “తల్లిదండ్రుల అపరాధభావం నుండే ఈ [విలువైన సమయం అనే] పదం పుట్టింది. ప్రజలు తాము తమ పిల్లలతో తక్కువ సమయం గడపడాన్ని అలా సమర్థించుకుంటున్నారు.” ఇంతకూ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎంత సమయం గడపాలి?
17 దాని గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు. బదులుగా ఇశ్రాయేలీయ తల్లిదండ్రులు తాము ఇంట్లో ఉన్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, పడుకొనేటప్పుడు, లేచినప్పుడు పిల్లలతో మాట్లాడాలని ఉద్భోదించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 6:7) అంటే తల్లిదండ్రులు ప్రతీరోజు పిల్లలతో మాట్లాడుతూ, వారికి బోధిస్తూ ఉండాలని స్పష్టంగా అర్థమవుతోంది.
18 యేసు తన శిష్యులతో కలిసి భోజనం చేసినప్పుడు, ప్రయాణించినప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు వారికి చక్కని శిక్షణ ఇచ్చాడు. వారికి బోధించడానికి ఆయన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. (మార్కు 6:31, 32; లూకా 8:1; 22:14) అదే విధంగా, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలతో చక్కగా సంభాషిస్తూ వారికి యెహోవా మార్గాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఏమి బోధించాలి, ఎలా బోధించాలి?
19 పిల్లలను విజయవంతంగా పెంచడానికి కేవలం ద్వితీయోపదేశకాండము 6:5-7) ఇది దేవుని ఆజ్ఞలన్నింటిలోకి అత్యంత ప్రాముఖ్యమైనదని యేసు చెప్పాడు. (మార్కు 12:28-30) కాబట్టి తల్లిదండ్రులు ప్రాథమికంగా యెహోవా దేవుడు మాత్రమే మన పూర్ణాత్మ ప్రేమకు, భక్తికి ఎందుకు అర్హుడో వివరిస్తూ తమ పిల్లలకు ఆయన గురించి బోధించాలి.
వారితో సమయం గడపడం లేదా బోధించడం మాత్రమే సరిపోదు. మనం వారికి ఏమి బోధిస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యమే. మనం ఏమి బోధించాలి అనే విషయాన్ని బైబిలు ఎలా నొక్కి చెబుతున్నదో గమనించండి. అదిలా చెబుతోంది: ‘నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ కుమారులకు అభ్యసింపజేయవలెను.’ పిల్లలకు బోధించవలసిన “ఈ మాటలు” ఏమిటి? ఖచ్చితంగా అవి అంతకుముందు పేర్కొనబడిన మాటలే, అవేమిటంటే, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (20 అయితే, తమ పిల్లలకు బోధించాలని తల్లిదండ్రులకు ఉద్బోధించబడిన ‘ఈ మాటల్లో’ కేవలం పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే లేదు. ద్వితీయోపదేశకాండములోని ముందరి అధ్యాయంలో, దేవుడు రాతిపలకల మీద రాసిచ్చిన ఆజ్ఞలను అంటే పది ఆజ్ఞలను మోషే మళ్లీ ఒకసారి చెబుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈ నియమాల్లో లేదా ఆజ్ఞల్లో అబద్ధమాడకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు వంటివి కూడా ఉన్నాయి. (ద్వితీయోపదేశకాండము 5:11-22) కాబట్టి తమ పిల్లలకు నైతిక విలువలను బోధించవలసిన అవసరం ఉందనే విషయం ప్రాచీనకాలపు తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ తల్లిదండ్రులు నేడు తమ పిల్లలకు సురక్షితమైన, సంతోషకరమైన భవిష్యత్తు ఉండేందుకు సహాయం చేయాలంటే వారికి కూడా అదే విధమైన ఉపదేశం ఇవ్వాలి.
21 “ఈ మాటలు” లేదా ఆజ్ఞలు తమ పిల్లలకు ఎలా బోధించాలో కూడా తల్లిదండ్రులకు ఆదేశింపబడిందని గమనించండి. ఆ వచనం ఇలా చెబుతోంది: ‘నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయవలెను.’ ‘అభ్యసింపజేయవలెను’ అనే మాటకు “తరచూ పునరుద్ఘాటించడం ద్వారా లేదా ఉద్భోధించడం ద్వారా బోధించడం మరియు హృదయంపై ముద్రించడం: ప్రోత్సహించడం లేదా మనస్సులో స్థిరంగా
నాటడం” అని అర్థం. కాబట్టి తల్లిదండ్రులు ఆధ్యాత్మిక విషయాలను తమ పిల్లల హృదయాల్లో ముద్రించాలనే నిర్దిష్టమైన సంకల్పంతో పథకం వేయబడిన బైబిలు ఉపదేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని దేవుడు చెబుతున్నాడు.22 అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. బైబిలు ఇలా చెబుతోంది: “అవి [“ఈ మాటలు” లేదా దేవుని ఆజ్ఞలు] నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:8, 9) అంటే తల్లిదండ్రులు అక్షరార్థంగా దేవుని నియమాలను గుమ్మాల మీద, గేట్ల మీద వ్రాసుకోవాలని లేక పిల్లల చేతులకు లేదా నొసట బాసికముగా కట్టాలని దాని అర్థం కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని ఆజ్ఞలను నిరంతరం గుర్తు చేస్తుండాలి అనేదే దాని భావం. పిల్లలకు బోధించే పనిని ఎంత క్రమంగా, సమగ్రంగా చెయ్యాలంటే, దేవుని బోధలు అన్నివేళలా పిల్లల ఎదుట ఉన్నట్టే ఉండాలి.
23 తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించవలసిన ప్రాముఖ్యమైన అంశాల్లో కొన్ని ఏమిటి? పిల్లలకు తమను తాము రక్షించుకోవడాన్ని నేర్పించడం, ఆ విషయంలో వారికి శిక్షణ ఇవ్వడం నేడు ఎందుకు అత్యంత ప్రాముఖ్యం? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫలవంతంగా బోధించేందుకు సహాయం చేయడానికి ఇప్పుడు ఎలాంటి సహాయకం అందుబాటులో ఉంది? తల్లిదండ్రులను వ్యాకులపరిచే ఈ ప్రశ్నలతోపాటు వేరే ప్రశ్నలు కూడా దీని తర్వాతి ఆర్టికల్లో మనం పరిశీలిస్తాం.
మీరు ఎలా సమాధానమిస్తారు?
• తల్లిదండ్రులు తమ పిల్లలను అమూల్యమైన వారిగా ఎందుకు పరిగణించాలి?
• తల్లిదండ్రులూ, ఇతరులూ యేసు నుండి ఏమి నేర్చుకోవచ్చు?
• తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత సమయం వెచ్చించాలి?
• పిల్లలకు ఏమి బోధించాలి, ఎలా బోధించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1. మొదటి మానవ శిశువు ఎలా జన్మించింది?
2. గర్భిణిగా ఉన్న స్త్రీ కడుపులో జరిగే ప్రక్రియ ఒక అద్భుతమని ఎందుకు చెప్పవచ్చు?
3. సజీవమైన ఒక కొత్త మానవ శిశువు జన్మించడానికి దేవుడే కారణమని ఆలోచనాపరులైన ప్రజలు అనేకులు ఎందుకు అంగీకరిస్తారు?
4. మానవుల్లో ఉండే ఏ లోపం యెహోవాకు ఉంటుందని మనం చెప్పలేము?
5. పిల్లలు ఒక స్వాస్థ్యం అనడానికి కారణం ఏమిటి?
6. మానవులకు పిల్లలను కనే సామర్థ్యం ఇవ్వడంలో దేవుని సంకల్పం ఏమిటి?
7. కొంతమంది తల్లిదండ్రులు చేసే దానికి భిన్నంగా, యేసు ‘నరులపట్ల’ ఆసక్తిని, కనికరాన్ని ఎలా ప్రదర్శించాడు?
8. యేసు తల్లిదండ్రులకు ఒక చక్కని మాదిరిని ఎలా ఉంచాడు?
9. మనం చెప్పేదానికన్నా మనం చేసేదే ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా ఎందుకు ఉండవచ్చు?
10. యేసు తన శిష్యులకు వినయం గురించి పాఠం ఎలా నేర్పించాడు, తొలి ప్రయత్నంలోనే అది విజయం సాధించిందా?
11. (ఎ) యేసుతోపాటు మేడ గదిలోకి ప్రవేశించిన తర్వాత అపొస్తలులు ఆచారబద్ధంగా ఏ పని చేయలేదు? (బి) యేసు ఏమి చేశాడు, ఆ సమయంలో యేసు ప్రయత్నాలు విజయం సాధించాయా?
12. పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు యేసును ఎలా అనుకరించవచ్చు?
13. పిల్లవాడు ఏదైనా అడుగుతూ దగ్గరకు వస్తే తల్లి లేదా తండ్రి వాణ్ణి ఎందుకు గదమాయించకూడదు?
14. తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల ప్రేమ చూపించే విషయంలో యేసు నుండి ఏమి నేర్చుకోవచ్చు?
15, 16. పిల్లల పెంపకానికి సంబంధించి ఎలాంటి ఆలోచన జనసమ్మతమైంది, ఈ ఆలోచనను ఏది పురికొల్పింది?
17. తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఏమి అవసరం?
18. యేసు తన శిష్యులకు శిక్షణ ఇచ్చే అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకున్నాడు, దీనినుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?
19. (ఎ) పిల్లలతో సమయం గడపడంతోపాటు ఇంకా ఏమి అవసరం? (బి) తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రాథమికంగా ఏమి బోధించాలి?
20. తమ పిల్లలకు ఏమి బోధించాలని దేవుడు ప్రాచీనకాలపు తల్లిదండ్రులను ఆజ్ఞాపించాడు?
21. పిల్లలకు దేవుని వాక్యాన్ని ‘అభ్యసింపజేయవలెను’ అనే ఉపదేశంలోని భావం ఏమిటి?
22. తమ పిల్లలకు బోధించడానికి ఏమి చేయాలని ఇశ్రాయేలీయ తల్లిదండ్రులకు ఆజ్ఞాపించబడింది, దాని అర్థం ఏమిటి?
23. తర్వాతి వారపు పాఠంలో మనమేమి పరిశీలిస్తాం?
[10వ పేజీలోని చిత్రం]
యేసు బోధనా విధానం నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?
[11వ పేజీలోని చిత్రాలు]
ఇశ్రాయేలీయ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు, ఎలా బోధించాలి?
[12వ పేజీలోని చిత్రాలు]
దేవుని బోధలను తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లెదుటే ఉంచాలి