కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభువు రాత్రి భోజనం అంటే ఏమిటి?

ప్రభువు రాత్రి భోజనం అంటే ఏమిటి?

ప్రభువు రాత్రి భోజనం అంటే ఏమిటి?

“ప్రభువు రాత్రి భోజనం” అనే మాట వినగానే మీ మనస్సులో ఏది మెదులుతుంది? చాలామందికి లీయనార్డో డా విన్చీ (1452-1519) చిత్రించిన చిత్రం గుర్తుకువస్తుంది. ఇటలీలోని మిలాన్‌లో ఉన్న ఆ చిత్రం ఎన్నో ప్రశంసలు పొందింది. వాస్తవానికి ప్రభువు రాత్రి భోజనం అనేది శతాబ్దాలుగా చిత్రకారులకు, రచయితలకు, సంగీతకారులకు ఇష్టమైన అంశంగా ఉంది.

అయితే ప్రభువు రాత్రి భోజనం అంటే ఏమిటి, 21వ శతాబ్దంలోని ప్రజల జీవితాల్లో దానికి ఏ ప్రాముఖ్యత ఉంది? ప్రభువు రాత్రి భోజనం అనేది యేసుక్రీస్తు తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ మరణించడానికి ముందు తన అపొస్తలులతో కలిసి చేసిన భోజనం అని విజ్ఞాన సర్వస్వాలు, నిఘంటువులు చెబుతాయి. అది యేసు తన నమ్మకమైన అనుచరులతో కలిసి చేసిన చివరి రాత్రి భోజనం కాబట్టి, కొంతమంది ప్రజలు దాన్ని చివరి రాత్రి భోజనం అని పిలుస్తారు. దాన్ని ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా ఆరంభించాడు కాబట్టి దానికి ప్రభువు రాత్రి భోజనం అనేది తగిన పేరు.

శతాబ్దాలుగా, తాము విలువైనవిగా ఎంచిన లక్ష్యాల కోసం ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ మరణాలలో కొన్ని కొందరికి కొంతకాలంపాటు ప్రయోజనం చేకూర్చాయి. అయితే ఆ స్వయం త్యాగపూరిత మరణాలు ప్రశంసనీయమైనవే అయినప్పటికి వాటిని యేసుక్రీస్తు మరణంతో పోలిస్తే, వాటిలో ఏ ఒక్కటీ ఆయన మరణమంత గమనార్హమైనది కాదనడంలో సందేహం లేదు. అంతేకాకుండా, సమస్యలతో నిండివున్న మానవజాతి చరిత్రలో మరే ఇతర మరణం కూడా ఇంతటి విస్తృతమైన ప్రభావాన్ని చూపించే అవకాశం లేదు. ఎందుకు?

ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, మీ జీవితంలో ప్రభువు రాత్రి భోజన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకునేందుకు మీకు సహాయపడడానికి మీరు దీని తర్వాతి ఆర్టికల్‌ను చదవాలని మేము మిమ్మల్ని ⁠ఆహ్వానిస్తున్నాము.