దుష్టులు ఇంకా ఎంతకాలం ఉంటారు?
దుష్టులు ఇంకా ఎంతకాలం ఉంటారు?
“దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు [యెహోవా] చూచియు ఎందుకు ఊరకున్నావు?”—హబక్కూకు 1:13.
1. యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో ఈ భూమి ఎప్పుడు నిండి ఉంటుంది?
దేవుడు ఎప్పటికైనా దుష్టులను నాశనం చేస్తాడా? అలాగైతే, మనం ఎంతకాలం పాటు వేచి ఉండాలి? భూమిపైనున్న ప్రజలందరూ అటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. జవాబులను మనమెక్కడ కనుగొనగలం? దేవుని నియమితకాలాన్ని గూర్చిన దైవప్రేరేపిత ప్రవచన వాక్యాల్లో మనం కనుగొనగలం. యెహోవా త్వరలోనే దుష్టులందరిపైనా తీర్పును అమలుపర్చబోతున్నాడనే అభయాన్ని అవి మనకిస్తున్నాయి. అప్పుడు మాత్రమే, “సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో” పూర్తిగా నిండివుంటుంది. అదే దేవుని పవిత్ర వాక్యంలోని హబక్కూకు 2:14 లో ఉన్న ప్రవచన వాగ్దానం.
2. హబక్కూకు పుస్తకం ఏ మూడు దేవుని తీర్పు ప్రకటనలను కలిగివుంది?
2 దాదాపు సా.శ.పూ. 628 లో వ్రాయబడిన హబక్కూకు పుస్తకం, యెహోవా దేవుడు అమలు చేసే మూడు తీర్పుల ప్రకటనా పరంపరను కల్గివుంది. ఆ తీర్పుల్లో రెండు, ఇప్పటికే అమలుచేయబడ్డాయి. మొదటిది, దారితప్పిన ప్రాచీనకాల యూదా జనాంగానికి విరుద్ధంగా యెహోవా ప్రకటించిన తీర్పు. మరి రెండవ దాని సంగతేమిటి? అణగద్రొక్కుతున్న బబులోనుకు విరుద్ధంగా దేవుడు విధించిన తీర్పే అది. అందుకనే ఈ దైవిక తీర్పుల్లో మూడవది కూడా నెరవేరుతుందని నమ్మడానికి నిశ్చయంగా మనకు ప్రతి కారణం ఉంది. వాస్తవానికి, అది అతి త్వరలోనే నెరవేరుతుందని మనం నిరీక్షించవచ్చు. ఈ అంత్యదినాల్లో జీవిస్తున్న నీతిమంతుల నిమిత్తం, దేవుడు దుష్టులందరిపైకి నాశనాన్ని తీసుకువస్తాడు. ఆ దుష్టులు, తరుముకొస్తున్న “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”లో తమ అంతిమ శ్వాసను విడుస్తారు.—ప్రకటన 16:14, 16.
3. మనకాలంలోని దుష్టులకు కచ్చితంగా ఏమి జరుగుతుంది?
3 దేవుని మహాదినమున జరిగే యుద్ధం అంతకంతకూ దగ్గరవుతోంది. యూదా, బబులోనులపై యెహోవా తీర్పులు ఎంత కచ్చితంగా నెరవేరాయో, మన కాలంలో దుష్టులపై దైవిక తీర్పులు కూడా అంతే కచ్చితంగా అమలుచేయబడతాయి. అయితే, ఇప్పుడు మనం హబక్కూకు కాలంనాటి యూదా దేశంలో ఉన్నామని ఎందుకు ఊహించుకోకూడదు? ఆ దేశంలో ఏం జరుగుతోంది?
కల్లోలంగా ఉన్న దేశం
4. హబక్కూకు ఏ దిగ్భ్రాంతికరమైన వార్తను వింటాడు?
4 యెహోవా ప్రవక్తయైన హబక్కూకు తన ఇంటి పైకప్పు మీద కూర్చొని, సంధ్యవేళ వీచే చల్లగాలిని ఆస్వాదిస్తుండటాన్ని ఊహించుకోండి. ఆయన ప్రక్కన సంగీత వాయిద్యం ఉంది. (హబక్కూకు 1:1; 3:19, పాదసూచి) కానీ హబక్కూకు దిగ్భ్రాంతికరమైన వార్తను విన్నాడు. యూదా రాజైన యెహోయాకీము ఊరియాను చంపి అతని కళేబరాన్ని సామాన్యజనుల సమాధిలో వేయించాడు. (యిర్మీయా 26:23) నిజమే, ఊరియా యెహోవాపై నమ్మకం ఉంచకుండా, భయపడిపోయి ఐగుప్తుకు పారిపోయాడు. అయినప్పటికీ, యెహోయాకీము చేస్తున్న దౌర్జన్యం యెహోవా ఘనతను ఉన్నతపర్చాలన్న కోరికతో ఎంతమాత్రం కాదన్నది హబక్కూకునకు తెలుసు. దేవుని ధర్మశాస్త్రంపట్ల రాజుకు ఉన్న అలక్ష్యభావమూ, ప్రవక్తయైన యిర్మీయాపట్ల, యెహోవా సేవచేస్తున్న మరితరులపట్ల, ఆయనకున్న ద్వేషమూ దాన్ని స్పష్టం చేస్తున్నాయి.
5. యూదాలోని ఆధ్యాత్మికస్థితి ఎలా ఉంది, హబక్కూకు దానికెలా స్పందించాడు?
5 ఇరుగు పొరుగున ఉన్న ఇళ్ల కప్పుల్లో నుంచి పైకిలేస్తున్న ధూపాన్ని హబక్కూకు చూశాడు. ప్రజలు, యెహోవా ఆరాధకులుగా ఆ ధూపాన్ని వేయడం లేదు. వాళ్లు హబక్కూకు 1:2-4.
యూదా దేశపు దుష్ట రాజైన యెహోయాకీము ప్రారంభించిన అబద్ధ మత కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఎంత నీచమైన పనో గదా! హబక్కూకు కళ్లు కన్నీటితో నిండిపోయాయి, ఆయనిలా వేడుకుంటున్నాడు: “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తిహీనులువచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.”—6. యూదాలో ధర్మశాస్త్రానికీ, న్యాయానికీ ఏమి సంభవించింది?
6 అవును, దోపిడీ బలాత్కారమూ పెచ్చు పెరిగిపోయాయి. ఎటుచూసినా హబక్కూకునకు కనబడేది కష్టాలూ, జగడాలూ, కలహాలే. ‘ధర్మశాస్త్రం నిరర్థకమై,’ నిర్వీర్యమైపోయింది. మరి న్యాయం సంగతేంటి? అది ‘ఎన్నడును జరుగకుండ మానిపోయింది’! అది ఎన్నడూ సఫలంకాలేదు. బదులుగా, నిర్దోషులను కాపాడేందుకు రూపొందించబడిన చట్టాలను వక్రీకరిస్తూ ‘భక్తిహీనులు, నీతిపరులను చుట్టుకుంటున్నారు.’ నిజం చెప్పాలంటే, ‘న్యాయం చెడిపోతోంది.’ అది వక్రీకరించబడుతోంది. ఎంతటి శోచనీయమైన పరిస్థితో గదా!
7. హబక్కూకు ఏమి చేయడానికి నిశ్చయించుకున్నాడు?
7 హబక్కూకు, పరిస్థితిని సింహావలోకనం చేసుకుంటాడు. ఆయన ఆశ వదులుకుంటాడా? ఎంత మాత్రం వదులుకోడు! దేవుని నమ్మకస్థులైన సేవకులు అనుభవించిన హింసనంతటినీ సమీక్షించిన తర్వాత యథార్థవంతుడైన ఈ వ్యక్తి, యెహోవా ప్రవక్తగా స్థిరంగానూ, నిశ్చలంగానూ
ఉండాలనే తన నిశ్చయాన్ని పటిష్ఠపర్చుకుంటాడు. హబక్కూకు దేవుని సందేశాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు—అలా ప్రకటించడమంటే ప్రాణంమీదికి తెచ్చుకోవడమే అయినప్పటికీ కూడా.యెహోవా నమ్మశక్యంకాని ‘కార్యమును’ జరిగిస్తాడు
8, 9. యెహోవా ఏ నమ్మశక్యంకాని ‘కార్యమును’ జరిగిస్తున్నాడు?
8 దర్శనంలో, హబక్కూకు దేవుణ్ని అవమానించే అబద్ధ మతవాదులను చూస్తాడు. యెహోవా వారితో ఏం చెబుతున్నాడో వినండి: “అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి.” దుష్టులైన ఆ వ్యక్తులతో దేవుడు ఎందుకలా మాట్లాడుతున్నాడని బహుశ హబక్కూకు అనుకొని ఉండవచ్చు. తర్వాత యెహోవా వారికిలా చెప్తుండగా ఆయన వింటాడు: “మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, హబక్కూకు 1:5) నిజానికి, వాళ్లు నమ్మలేని ఈ కార్యాన్ని యెహోవా తానే స్వయంగా జరిగిస్తున్నాడు. అయితే ఆ కార్యమేమిటి?
ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.” (9హబక్కూకు 1:6-11 వచనాల్లో నివేదించబడిన దేవుని మాటలను హబక్కూకు శ్రద్ధగా వింటున్నాడు. ఇది యెహోవా సందేశం—ఏ అబద్ధ దేవుళ్లైనా, నిర్జీవ విగ్రహాలైనా సరే, దాని నెరవేర్పును నిరోధించలేరు: “ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.”
10. యెహోవా ఎవరిని రేపాడు?
10 సర్వోన్నతుని నుంచి ఎలాంటి ప్రవచనార్థక హెచ్చరిక వచ్చిందో కదా! యెహోవా బబులోను యొక్క క్రూర జనాంగమైన కల్దీయులను రేపుతున్నాడు. ‘భూదిగంతములలో’ సంచరిస్తూ అది ఎన్నో ప్రాంతాలను వశపర్చుకుంటుంది. ఎంత భయంకరం! కల్దీయుల దండు, “ఘోరమైన భీకరజనము.” వాళ్లు, భయకంపితులను చేసే జనం, జడిపించే జనం. ఆ దండు, తన సొంత కఠినమైన కట్టడలను తయారు చేసుకుంటుంది. ‘ప్రభుత్వమును తన యచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొంటుంది.’
11. యూదాపైకి బబులోను సైన్యాలు రావడాన్ని మీరెలా వర్ణిస్తారు?
11 బబులోను గుఱ్ఱాలు, చిరుతపులులకన్నా వేగంగా పరుగెత్తుతాయి. దాని అశ్వదళం, రాత్రివేళల్లో ఆకలితో తిరిగే తోడేళ్లకంటే భయంకరమైనవి. ఉత్సాహంతో ఉరకలేస్తూ, అవి ‘దూరంనుంచి వచ్చి తటాలున జొరబడతాయి.’ దూరానవున్న బబులోను నుంచి యూదా వైపుకు దూసుకువెళతాయి. రుచికరమైన ఎరను పట్టుకోవడానికి వడిగా వస్తున్న పక్షిరాజులా ఎగురుకుంటూ, కల్దీయులు తమ ఎరపై త్వరలోనే దాడి చేస్తారు. అది, కొద్దిమంది సైనికుల ద్వారా జరిగే ఆకస్మిక దాడియైన దోపిడి మాత్రమేనా? ఎంతమాత్రం కాదు ! విధ్వంసాన్ని సృష్టించే సైనికుల భీకర సమూహంలా “బలాత్కారము చేయుటకై వారు వత్తురు.” ఆకాంక్షతో వాళ్ల ముఖాలు వెలిగిపోతున్నాయి, పశ్చిమదిశగా యూదా, యెరూషలేముల వైపు వాళ్లు తూర్పు గాలి అంత వేగంగా దూసుకు వస్తున్నారు. బబులోను సైనిక దళాలు ఖైదీలుగా చెరపట్టుకుపోయిన వాళ్లు, ‘ఇసుక రేణువులంత విస్తారముగా’ ఉంటారు.
12. బబులోనీయుల వైఖరి ఎలా ఉంది, ఈ భయంకరమైన శత్రువు ఏ విషయంలో ‘అపరాధులౌతారు’?
12 కల్దీయుల సైన్యాలు, రాజులను అపహసిస్తాయి, అధిపతులను హేళన చేస్తాయి. దాని దురాక్రమణను అడ్డుకోవడానికి వాళ్లకెవరికీ శక్తిలేదు. బబులోనీయులు మట్టి దిబ్బలను కట్టి, దాడిచేసినప్పుడు ఏ దుర్గమైనా సరే కుప్పకూలిపోతుంది గనుక, ప్రాకారంగల దుర్గాలన్నింటినీ వాళ్లు తృణీకరిస్తున్నారు. యెహోవా నియమిత కాలంలో, “గాలికొట్టుకొని పోవునట్లు” భయంకరమైన ఆ శత్రువు “కొట్టుకొని” పోవును. యూదా, యెరూషలేములపై దాడి చేసి వాళ్లు, దేవుని ప్రజలకు హాని తలపెట్టిన ‘అపరాధులౌతారు.’ సుడిగాలిలా విజయాన్ని సాధించిన తర్వాత, కల్దీయుల సైన్యాధిపతి ‘మా దేవత మూలంగానే ఈ బలం వచ్చిందని’ గొప్పలు చెప్పుకుంటాడు. అయితే ఆ సైన్యాధిపతికి తెలిసింది ఎంత తక్కువో గదా!
నిరీక్షించటానికి సరైన ఆధారం
13. హబక్కూకు ఎందుకని నిరీక్షణతోనూ, నమ్మకంతోనూ నిండిపోయాడు?
13 యెహోవా సంకల్పం విషయంలో పెరిగిన అవగాహనతో, హబక్కూకు హృదయంలో నిరీక్షణ వృద్ధి అవుతోంది. సంపూర్ణ నమ్మకంతో నిండినవాడై, ఆయన యెహోవాను స్తుతిస్తూ మాట్లాడతాడు. హబక్కూకు 1:12నందు పేర్కొనబడినట్లుగా, ఆ ప్రవక్త ఇలా అంటాడు: ‘యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? నీవు మరణము నొందవు.’ వాస్తవానికి, “యుగయుగములు” అంటే, నిరంతరం యెహోవాయే దేవుడు.—కీర్తన 90:1, 2.
14. యూదాలోని మతభ్రష్ఠులు ఏ విధానాన్ని చేపట్టారు?
14 దేవుడు తనకు ఇచ్చిన దర్శనాన్ని గురించి తలపోస్తూ, ఆ దర్శనం అందించిన అంతర్దృష్టియందు ఆనందిస్తూ, ఆ ప్రవక్త ఇంకా ఇలా అంటున్నాడు: “యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయదుర్గమా, కీర్తన 62:7; 94:22; 95:1) అయినప్పటికీ, మతభ్రష్టులైన యూదా నాయకులు దేవుని దగ్గరకు రావడం లేదు. వాళ్లు, అపకారాన్ని తలపెట్టని ఆయన ఆరాధకులను అణచివేస్తూనే ఉన్నారు.
మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.” దేవుడు యూదా దేశంలోని మతభ్రష్టులకు తీవ్రంగా తీర్పు తీర్చాడు. వారు యెహోవా నుంచి గద్దింపును, తీవ్రమైన శిక్షణనూ పొందనై ఉన్నారు. వారు తమ ఏకైక ఆశ్రయదుర్గంగా, శరణ్యంగా, రక్షణకు మూలంగా ఆయన వైపు చూడాల్సి ఉంది. (15. ఏ భావంలో యెహోవా “కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది”?
15 ఈ పరిస్థితి, యెహోవా ప్రవక్తను తీవ్రంగా కలతపర్చింది. కాబట్టి, ఆయనిలా అంటున్నాడు: “నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా.” (హబక్కూకు 1:13) అవును, యెహోవా “కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది” అంటే అది దుష్టత్వాన్ని సహించలేనంతటి నిష్కళంకమైనదని అర్థం.
16. హబక్కూకు 1:13-17 లో నమోదు చేయబడినదాన్ని మీరెలా సంగ్రహంగా చెబుతారు?
16 కాబట్టి ఆలోచనరేకెత్తించే ప్రశ్నలు హబక్కూకు మనస్సులో ఉన్నాయి. ఆయనిలా అంటున్నాడు: “కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి. వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా?”—హబక్కూకు 1:13-17.
17. (ఎ) యూదా, యెరూషలేములపై దాడి చేయడంలో, బబులోనీయులు దేవుని సంకల్పాన్ని ఎలా నెరవేర్చారు? (బి) యెహోవా హబక్కూకునకు ఏమి బయల్పరుస్తాడు?
17 యూదా దేశంపైనా, దాని రాజధానియైన యెరూషలేము నగరంపైనా దాడి చేయడంలో, బబులోనీయులు తమ సొంత కోరికలకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు. విశ్వాసరహితులైన ప్రజలకు విరుద్ధంగా తన నీతియుక్తమైన తీర్పులను అమలుచేసేందుకు దేవుని ఉపకరణంగా తాము పని చేస్తున్నామన్న విషయాన్ని వాళ్లెరుగరు. దేవుడు తన తీర్పులను అమలుచేసేందుకు దుష్టులైన బబులోనీయులను ఉపయోగిస్తాడనే విషయాన్ని అర్థం చేసుకోవడం హబక్కూకునకు ఎందుకంత కష్టమో గ్రహించడం సులభమే. కనికరంలేని ఆ కల్దీయులు, యెహోవా దేవుని ఆరాధకులు కారు. వాళ్లు మానవులను, బంధించి స్వాధీనం చేసుకోదగిన ‘చేపల్లా, ప్రాకెడి పురుగుల్లా’ మాత్రమే దృష్టిస్తారు. ఈ విషయాలపై హబక్కూకునకు కలిగిన సందిగ్ధం ఎంతో కాలంపాటు నిలవదు. బబులోనీయులు పేరాశతో దోచుకున్నందుకూ, నిర్దాక్షిణ్యంగా రక్తాన్ని చిందించినందుకూ వాళ్లు శిక్షించబడకుండా ఉండరని యెహోవా తన ప్రవక్తకు త్వరలోనే బయల్పరుస్తాడు.—హబక్కూకు 2:8.
యెహోవా చెప్పబోయే మాటలకు సిద్ధమై ఉండటం
18. హబక్కూకు 2:1 లో ఉన్నట్లుగా, హబక్కూకు వైఖరినిబట్టి మనం ఏమి నేర్చుకోగలం?
18 అయితే ఇప్పుడు, యెహోవా తనకు చెప్పబోయే విషయాలను వినడానికి హబక్కూకు వేచివున్నాడు. ఆ ప్రవక్త తీర్మానపూర్వకంగా ఇలా చెబుతున్నాడు: “ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొనియుందును.” (హబక్కూకు 2:1) ప్రవక్తగా తన ద్వారా దేవుడు ఇంకా ఏమి తెలియజేయబోతున్నాడో అన్న దాని గురించి హబక్కూకు అత్యంతాసక్తి కలిగివున్నాడు. దుష్టత్వాన్ని ఏమాత్రమూ సహించని దేవునిగా యెహోవాపై తనకున్న విశ్వాసం, దుష్టత్వం ఎందుకు వర్ధిల్లుతోందని ఆయన ఆశ్చర్యపోయేలా చేస్తుంది, అయినా ఆయన తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకునేందుకు సుముఖంగానే ఉన్నాడు. అయితే, మన సంగతేంటి? కొన్ని దుష్ట క్రియలను ఎందుకు సహించడం జరుగుతుందని మనం అనుకున్నప్పుడు, యెహోవా దేవుని నీతిపై మనకున్న నమ్మకం, మన సమతూకాన్ని నిలుపుకునేలా, ఆయన కోసం వేచివుండేలా మనకు సహాయపడాలి.—కీర్తన 42:5, 11.
19. దేవుడు హబక్కూకునకు చెప్పిన ప్రకారంగానే, దారితప్పిన యూదులకు ఏమి జరిగింది?
19 హబక్కూకునకు తానిచ్చిన మాట ప్రకారంగానే, యూదాపై దండెత్తేందుకు బబులోనీయులను అనుమతించడం ద్వారా దారితప్పిన యూదా జనాంగంపై యెహోవా తీర్పులను అమలు చేశాడు. సా.శ.పూ. 607 లో, వాళ్లు యెరూషలేమునూ, దాని ఆలయాన్నీ నాశనం చేశారు. 2 దినవృత్తాంతములు 36:17-20) బబులోనులో దీర్ఘకాలంపాటు బందీలుగా ఉన్న తర్వాత, విశ్వాసులైన యూదుల శేషం తమ స్వదేశానికి తిరిగి వచ్చి, చివరకు ఆలయాన్ని పునర్నిర్మించారు. అయితే, అటుతర్వాత యూదులు మళ్ళీ యెహోవాకు నమ్మకద్రోహం చేశారు—ప్రత్యేకించి, వాళ్లు యేసును మెస్సీయగా నిరాకరించినప్పుడు అలా చేశారు.
వృద్ధులూ పిల్లలూ అన్న విచక్షణ లేకుండా అందర్నీ హతమార్చారు, అనేకమందిని చెరపట్టుకుపోయారు. (20. యేసును నిరాకరించిన దానికి సంబంధించి పౌలు హబక్కూకు 1:5ను ఎలా ఉపయోగించాడు?
20 యేసును నిరాకరించి, మరి ఆ విధంగా ఆయన అర్పించిన విమోచన క్రయధన బలిని నిర్లక్ష్యం చేయడమంటే ఏంటో, అపొస్తలుల కార్యములు 13:38-41 వచనాల ప్రకారం, అపొస్తలుడైన పౌలు అంతియొకయలోని యూదులకు చూపించాడు. గ్రీకు సెప్టాజింట్ అనువాదంలో నుంచి హబక్కూకు 1:5వ వచనాన్ని ఉదహరిస్తూ, పౌలు ఇలా హెచ్చరించాడు: “ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా—ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు.” సా.శ. 70 లో రోమా సైన్యాలు యెరూషలేమునూ దాని ఆలయాన్నీ నాశనం చేసినప్పుడు, పౌలు ఎత్తి చెప్పిన లేఖనానికి అనుగుణంగానే, హబక్కూకు 1:5 వచనం రెండవసారి నెరవేరింది.
21. బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయనీయడమనే దేవుని ‘కార్యమును’ హబక్కూకు కాలంనాటి యూదులు ఎలా దృష్టించారు?
21 యెరూషలేము నగరం యెహోవా ఆరాధనకు కేంద్రస్థానమూ, ఆయన అభిషిక్తుడైన రాజు సింహాసనంపై కూర్చునే స్థలమూ అయినందున బబులోనీయులు వచ్చి ఆ నగరాన్ని నాశనం చేయడమనే దేవుని ‘కార్యము,’ హబక్కూకు కాలంనాటి యూదులకు ఊహించ శక్యంకాని విషయమైవుంది. (కీర్తన 132:11-18) అంతెందుకు, యెరూషలేము నగరం అంతకు ముందెన్నడూ నాశనం చేయబడలేదు. దాని ఆలయం అంతకుముందెప్పుడూ కాల్చబడలేదు. దావీదు రాచరిక గృహం అంతకు ముందెన్నడూ కూలద్రోయబడలేదు. అలాంటివి జరగడానికి యెహోవా అనుమతిస్తాడన్న విషయం నమ్మశక్యం కానిది. అయితే, దిగ్భ్రాంతిని కలిగించే ఆ సంఘటనలు జరుగుతాయని దేవుడు హబక్కూకు ద్వారా హెచ్చరికనిచ్చాడు. ప్రవచించబడినట్లుగానే అవి జరిగాయని చరిత్ర నిరూపిస్తోంది.
మనకాలంలో దేవుని నమ్మశక్యంకాని “కార్యము”
22. మనకాలంలో యెహోవా నమ్మశక్యంకాని ‘కార్యములో’ ఏమి ఇమిడివుంటుంది?
22 మనకాలంలో కూడా యెహోవా నమ్మశక్యంకాని ‘కార్యమును’ చేయబోతున్నాడా? సందేహించే వారికి అది నమ్మశక్యం కానిదిగా ఉన్నప్పటికీ, ఆయన చేస్తాడనే నిశ్చయతను కలిగి ఉండండి. ఈసారి, యెహోవా దేవుని నమ్మశక్యంకాని కార్యము, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని నాశనం చేయడమే. ప్రాచీన కాలంనాటి యూదావలె, అది దేవుణ్ని ఆరాధిస్తున్నానని చెప్పుకుంటుంది గానీ, పూర్తిగా భ్రష్టురాలైంది. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను”కు సంబంధించిన ప్రతి జాడ వలెనే, క్రైస్తవమత సామ్రాజ్య మతవ్యవస్థకు సంబంధించిన ప్రతి జాడనూ యెహోవా త్వరలోనే తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాడు.—ప్రకటన 18:1-24.
23. ఏమి చేసేలా దేవుని ఆత్మ హబక్కూకును ప్రేరేపిస్తుంది?
23 సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం కావడానికి ముందు యెహోవా హబక్కూకునకు ఎంతో పని ఇచ్చాడు. దేవుడు తన ప్రవక్తకు ఇంకా ఏం తెలియజేయబోతున్నాడు? అంతెందుకు, తన సంగీత వాయిద్యాన్ని తీసుకుని యెహోవాకు ప్రార్థనాపూర్వక విలాపగీతాలు పాడేలా తనను కదిలించే సంగతులను హబక్కూకు వింటాడు. అయితే, మొదటగా నాటకీయమైన విపత్తులను ప్రకటించేందుకు దేవుని ఆత్మ ఆ ప్రవక్తను ప్రేరేపిస్తుంది. దేవుని నియమిత కాలం కొరకైన అలాంటి ప్రవచన వాక్యాల లోతైన అర్థానికి సంబంధించిన అంతర్దృష్టిని సంపాదించుకోవటానికి మనం తప్పకుండా ఇష్టపడతాము. కాబట్టి, హబక్కూకు ప్రవచనానికి మనం మరింత అవధానాన్ని ఇద్దాము.
మీకు జ్ఞాపకమున్నాయా?
• హబక్కూకు కాలంలో యూదాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?
• హబక్కూకు కాలంలో యెహోవా ఏ నమ్మశక్యంకాని ‘కార్యమును’ జరిగించాడు?
• హబక్కూకునకు నిరీక్షించటానికి ఏ ఆధారం ఉంది?
• మనకాలంలో దేవుడు ఏ నమ్మశక్యంకాని ‘కార్యమును’ జరిగిస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
దుష్టత్వం వర్ధిల్లేలా దేవుడు ఎందుకు అనుమతించాడా అని హబక్కూకు ఆశ్చర్యపోయాడు. మరి మీరు?
[10వ పేజీలోని చిత్రం]
యూదాదేశం బబులోనీయుల చేతుల్లో నాశనమౌతుందని హబక్కూకు ప్రవచించాడు
[10వ పేజీలోని చిత్రం]
సా.శ.పూ. 607 లో నాశనమైన యెరూషలేము పురావస్తు శిధిలాలు