యువత కోసం ఒక పుస్తకం
యువత కోసం ఒక పుస్తకం
ఆర్కేంజెల్స్క్లోని యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని రష్యాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఒక ఉత్తరం వ్రాసింది. సాక్షులు ప్రచురించిన ఒక పత్రిక, వీధిలో ఒక వ్యక్తి ద్వారా తనకు అందిందని ఆమె వివరించింది. “అది జీవితం గురించీ, నాకు దేవుని గురించి, మతం గురించి తెలిసిన దాని గురించీ ఆలోచింపజేసింది. నేను బైబిలు అధ్యయనం చేయాలనుకుంటున్నాను. మనమెవ్వరం తెలియకున్నా మన పాపాల కోసం, మన రక్షణ కోసం ప్రాణాలిచ్చిన ఆ వ్యక్తి గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను” అని ఆమె వ్రాసింది.
ఆమె ఉత్తరం ఇంకా ఇలా కొనసాగింది: “మీరు ప్రత్యేకించి మంచీ చెడుల మధ్య తేడాను పిల్లలకు వివరిస్తూ, ఎంతో అవసరమైన పనిని నిర్వహిస్తున్నారు. ఎంతైనా వారు స్పాంజిల్లాంటివారు, తమ చుట్టూ ఉన్నదంతా పీల్చుకుంటూ దాని ప్రకారమే ప్రవర్తిస్తారు.” ఆ విద్యార్థినికి ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు, ఆమె యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఆంగ్లం) పుస్తకాన్ని పంపించమని కోరింది. “అది వారికి స్కూల్లోను వారి సాధారణ జీవితంలోను సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను” అని ఆమె వ్రాసింది.
ప్రత్యేకించి నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలకు సహాయంగా రూపొందించబడిన ఆ పుస్తక ప్రతిని మీరు కూడా పొందవచ్చు. దీనితోపాటు ఉన్న కూపన్ పూరించి, ఈ పత్రిక 5వ పేజీలో ఉన్న చిరునామాల్లో సముచితమైనదానికి పంపించండి. (g03 9/8)
□ యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు పుస్తకం గురించి మరింత సమాచారం కావాలని కోరుకుంటున్నాను.
□ దయచేసి ఉచిత బైబిలు అధ్యయనం విషయంలో నన్ను సంప్రదించండి.