పత్రికారంగం పాత్ర
పత్రికారంగం పాత్ర
“అమెరికాలోని పత్రికారంగం నిర్వహించవలసిన పాత్ర ఏమిటంటే దుఃఖితులను ఓదార్చడం, ప్రశాంతంగా ఉన్నవారిని కలవరపరచడం అని స్క్రిప్స్ అనే వార్తాపత్రికతో పాటు వివిధ పత్రికలకు సంస్థాపకుడైన ఎడ్వార్డ్ విల్లిస్ స్క్రిప్స్ ఒకసారి అన్నాడు” అని వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ మైక్ మాకరీ పేర్కొన్నాడు. “ప్రజలకు ఏమి తెలియజేయకుండా వారిని అజ్ఞానంలో వదిలేసి, వారిని ఓదార్చడం లేదా కలవరపరచడం అసాధ్యం” అని కూడా ఆయన అన్నాడు.
“మన [అమెరికా] న్యూస్ మీడియా మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నివేదించదు కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న దాన్ని అర్థం చేసుకునే మన పద్ధతి తగినంత సమర్థవంతంగా లేదని [మాకరీ] పేర్కొన్నాడు.” విచారకరమైన విషయమేమిటంటే “అమెరికా పౌరులకు ప్రపంచ వార్తలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు” అని అమెరికా న్యూస్ మీడియా విశ్వసిస్తోంది.—గ్రాఫిక్ ఆర్ట్స్ మంత్లీ.
తేజరిల్లు!కు ప్రపంచవ్యాప్తంగా రచయితలున్నారు, తన పాఠకులకు ప్రస్తుత అంశాల గురించి అలాగే వైజ్ఞానిక, సామాజిక అంశాల గురించి తెలియజేయాలన్నది దాని లక్ష్యం. అది ప్రేమగల సృష్టికర్తలో నమ్మకాన్ని పెంపొందింపజేస్తుంది. అది మొత్తం 87 భాషల్లో ప్రచురించబడుతోంది, అయితే 61 భాషల్లో ఏకకాలంలో ప్రచురించబడుతోంది, ప్రతి సంచిక 21 కోట్లకంటే ఎక్కువ ప్రతులు పంపిణీ చేయబడుతున్నాయి! తేజరిల్లు! చదవడం ద్వారా మెలకువగా ఉండండి. (g02 11/08)
[11వ పేజీలోని చిత్రం]
అన్ని రకాల బానిసత్వం అంతమైనప్పుడు!
[11వ పేజీలోని చిత్రం]
విజ్ఞానశాస్త్రానికి మతానికి పొత్తు సాధ్యమా?
[11వ పేజీలోని చిత్రం]
జూదం—నిరపాయకరమైన వినోదమా?
[11వ పేజీలోని చిత్రం]
హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం
[11వ పేజీలోని చిత్రం]
ప్రపంచ శాంతి కేవలం ఒక స్వప్నమేనా?