మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
నాది డేటింగ్ చేసే వయస్సు కాదా? “యువత ఇలా అడుగుతోంది . . . నాది డేటింగ్ చేసే వయస్సు కాదని నా తల్లిదండ్రులు భావిస్తే ఎలా?” (జనవరి 22, 2001 [ఆంగ్లం]) అనే ఆర్టికల్ చదివి నేను చాలా ఆనందించాను. నాకు 17 సంవత్సరాలు, నేనిప్పుడే వివాహానికి సిద్ధంగా లేనని, కుటుంబాన్ని పోషించేంత వయస్సు రాలేదని నేను అర్థం చేసుకున్నాను. డేటింగ్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని గ్రహించేందుకు ఈ ఆర్టికల్ నాకు సహాయపడింది. అంతేకాదు, డేటింగ్ విషయంలోను వివాహం విషయంలోను నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు వివేచనను ఉపయోగించాలని కూడా గ్రహించాను.
ఎ.ఎమ్.హెచ్., అమెరికా (g01 10/8)
ఇద్దరు యౌవనస్థులు ఫోనులో మాట్లాడుకుంటున్న ఫోటో భావమేమిటో నేను గ్రహించగలిగాను, ఎందుకంటే కొంతకాలానికి నేనూ వారున్న స్థితిలోకే ప్రవేశించబోతున్నానని అర్థమైంది. నేను డేటింగ్ చేయడం ప్రస్తుతం యుక్తం కాదని నాకు తెలుసు కాబట్టి ఒక అబ్బాయితో నా సహవాసాన్ని తెగదెంపులు చేసుకోవలసి వచ్చింది. ఇంకొంతకాలం వేచివుండాలన్న నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉండడానికి ఇలాంటి ఆర్టికల్లు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.
ఎమ్.ఆర్.సి., అమెరికా (g01 10/8)
నాకు 14 ఏండ్లు. నాది వివాహం చేసుకునే వయస్సు కాదు కాబట్టి, ఈ వయస్సులో డేటింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ నాకు నిజంగా సహాయపడింది. ఇప్పుడు ప్రేమలో పడడానికి బదులుగా, యెహోవాతో నా అనుబంధాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకునేందుకు ఈ ఆర్టికల్ నాకు సహాయపడింది.
ఎ.పి., కెనడా (g01 10/8)
ఈ ఆర్టికల్ ఖచ్చితంగా నాకోసమే వ్రాయబడిందనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను మరీ నిర్బంధంలో ఉంచుతున్నారని, నా భావాలను అర్థం చేసుకోవడం లేదని నేననుకున్నాను. కానీ నాకు సహాయం చేయడానికి నన్ను కాపాడడానికి తమకు సాధ్యమైనదంతా వారు చేస్తున్నారని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. “యువత ఇలా అడుగుతోంది” ఆర్టికల్లు మళ్ళీ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు చదవాలా అని ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను.
హెచ్.ఇ., రుమేనియా (g01 10/8)
ఆర్టికల్ ప్రాణం నిలబెట్టింది మేము లెన్నీ అనే ఒక వ్యక్తిని కలిశాము, “డెంగ్యూ—ఒక్క కాటుతో వచ్చే జ్వరం” (ఆగస్టు 8, 1998) అనే ఆర్టికల్ తన అన్న కూతురి ప్రాణాల్ని కాపాడింది అని ఆయన చెప్పాడు. ఆమెకు ఎన్నో రోజులుగా జ్వరంగా ఉంది, దద్దుర్లు కూడా తేలాయి; కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం అది పొంగు అని అంతగా పట్టించుకోలేదు. ఈ ఆర్టికల్ని గుర్తు చేసుకుని లెన్నీ ఆ పత్రికను సంపాదించి డెంగ్యూ జ్వరం చిహ్నాల్ని మళ్ళీ చదివాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళేలా తన అన్నను ఒప్పించాడు. ఆమెకు నిజంగానే డెంగ్యూ హెమరేజ్ ఫీవర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఆమెను రక్షించడానికి తనకు సహాయం చేసినందుకు లెన్నీ తేజరిల్లు!ను మెచ్చుకున్నాడు, తర్వాత గృహ బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నాడు.
జె.ఎమ్.ఎల్., ఫిలిప్పీన్స్ (g01 11/8)
సూర్యుడు సూర్యుడు, చంద్రుడు, అందమైన ఈ భూమి వంటివాటిని బట్టి నేను ఎప్పుడూ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, కానీ వాటి గురించి అంతగా ఆలోచించను. “మన సూర్యుడి అసాధారణమైన స్వభావం” (మార్చి 22, 2001 [ఆంగ్లం]) అనే ఆర్టికల్ చదివిన తర్వాత హృదయపూర్వకంగా ప్రార్థించేందుకు నేను కదిలించబడ్డాను. ఉదారంగా మనకు అమూల్యమైన కానుకలను ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాను.
బి.పి., అమెరికా (g01 12/8)
కేశాలు నేను హెయిర్డ్రెస్సర్గా పనిచేస్తున్నాను, “మీ కేశాలను కాస్త పరిశీలనగా చూద్దాం” (జూలై-సెప్టెంబరు 2001) ఆర్టికల్ని చదివి చాలా ఆనందించాను. ఒక కాపీని మా యజమానురాలికి ఇచ్చాను. ఆమె కూడా చదివి ఆనందించి ఇక్కడ పనిచేస్తున్న వేరే అమ్మాయిలకు ఇచ్చింది. ఆచరణాత్మకమైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
డి.ఎల్., రుమేనియా (g01 12/8)
అధస్సూచిలో “అలోపెసియా—జుట్టు కోల్పోవడాన్ని ఎదుర్కోవడం” (ఏప్రిల్ 22, 1991 [ఆంగ్లం]) అనే అంతకు ముందటి ఆర్టికల్ని సూచించినందుకు కృతజ్ఞతలు. నేను 17 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. పైపై రూపానికి ప్రాధాన్యమిచ్చే ఈ లోకంలో, ఏమాత్రం భిన్నంగా ఉన్నా తిరస్కృతికి గురయ్యే ఈ లోకంలో నాకు యెహోవా మద్దతు, ఆయన సంస్థ మద్దతు ఉందని తెలుసుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది.
ఎమ్.జి., ఇటలీ (g01 12/8)