కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దీని నుండి పూర్తి ప్రయోజనం పొందాలని మీరనుకుంటారు!

దీని నుండి పూర్తి ప్రయోజనం పొందాలని మీరనుకుంటారు!

దీని నుండి పూర్తి ప్రయోజనం పొందాలని మీరనుకుంటారు!

దేని నుండి? “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం నుండి ! అమెరికాలో మే నెలలో ప్రారంభమైన ఈ సమావేశపు పరంపర, రానున్న నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది నగరాల్లో జరుగుతుంది. ఈ సమావేశాలు, దాదాపు అన్ని చోట్లా, శుక్రవారం ఉదయం 9:⁠30 గంటలకు సంగీతంతో ప్రారంభమౌతాయి.

ఉదయకాల కార్యక్రమం దేవుని వాక్యం ప్రకారం చేయమనే ప్రోత్సహకరమైన మాటలతో ప్రారంభమై, “యెహోవా మంచితనాన్ని బట్టి సంతోషించుడి,” “అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధిగలవారై ఉండండి” మొదలైన ప్రసంగాలతో కొనసాగి, “ఆశ్చర్యకార్యములు చేసే యెహోవాను స్తుతించండి” అనే ముఖ్యాంశ ప్రసంగంతో ముగుస్తుంది.

మధ్యాహ్నపు కార్యక్రమంలో మొదటిగా, “మేలుచేయడం మానకండి” అనే ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత, ఒక వివాహ జతను ఎలా ఎంపిక చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి, యెహోవాను ప్రేమించడాన్ని పిల్లలకు ఎలా నేర్పాలి అనే విషయాలపై మూడు భాగాల గోష్ఠి ఉంటుంది. “యెహోవా సంస్థతో సమంగా అడుగు వేయడం” అన్నది ఆ రోజు చివరి ప్రసంగం. దేవుని ఉద్దేశాలను గురించి అవగాహన చేసుకునే విషయంలో ఆధునిక కాలాల్లో సాధించిన క్రమానుగతమైన పురోగతిని ఆ ప్రసంగం పునఃసమీక్షిస్తుంది.

శనివారం ఉదయం కార్యక్రమంలో “దేవునివాక్య పరిచారకులు” అనే మూడు భాగాలతో కూడిన సమావేశపు రెండవ గోష్ఠి ఉంటుంది. శిష్యులను చేసే పనిని మనం ఎలా సాగించవచ్చనే దానికి సూచనలు ఈ గోష్ఠిలో ఇవ్వబడతాయి. “దేవుడు సిగ్గుపడునట్లు చేయకపోవడం” అనే ఉత్తేజకరమైన ప్రసంగం కూడా ఉంటుంది. ఆ తర్వాత, బాప్తిస్మ ప్రసంగం ఉంటుంది, బాప్తిస్మానికి యోగ్యులైన వారికి బాప్తిస్మం తీసుకునే అవకాశం ఇవ్వబడుతుంది.

మధ్యాహ్నపు కార్యక్రమంలో మూడు భాగాల మూడవ గోష్ఠి, “ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి శ్రమించండి” అనే అంశాన్ని ఉన్నతపరుస్తుంది. ఆధ్యాత్మికతను ఎలా పెంపొందించుకోవచ్చో చూపించే ఆచరణాత్మకమైన సూచనలు ఈ గోష్ఠిలో ఇవ్వబడతాయి. “దేవుని వాక్య ప్రగతిశీల వెలుగులో నడుచుకోవడం” అనే వివరణాత్మకమైన ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ ప్రసంగం యెషయా 25, 26 అధ్యాయాలను చర్చించి, ఈ ఆసక్తికరమైన బైబిలు గ్రంథాన్ని మనమెలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చో చూపిస్తుంది.

ఆదివారం ఉదయం కార్యక్రమంలో, “దేవుని చిత్తాన్ని జరిగించువారికి జెఫన్యా యొక్క అర్థవంతమైన ప్రవచనం” అనే మూడు భాగాల చివరి గోష్ఠి ఉంటుంది. ప్రాచీన యూదా జనాంగానికి ఆ ప్రవచనం ఎలా వర్తించింది, మన కాలానికి ఎలా వర్తిస్తుంది, ప్రత్యేకించి, ఈ లోక మతాలకు ఎలా వర్తిస్తుంది అన్నదాన్ని ఆ గోష్ఠి వివరిస్తుంది. ఆ తర్వాత, “మన కాలానికి హెచ్చరికా మాదిరులు” అనే నాటకం ఉంటుంది. ఆ నాటకంలోని ఆ యా పాత్రధారులు ఆ యా పాత్రల కాలంలోని వారు ధరించినటువంటి వస్త్రాలను ధరిస్తారు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలోకి ప్రవేశించే ముందు ఇశ్రాయేలీయులైన పురుషుల్లోని కొందరి అనైతిక నడవడిని ఆ నాటకం చూపుతుంది. సమావేశపు చివరి భాగంగా ఆదివారం మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో, “దేవుని ఆశ్చర్యకార్యాలకు ఎందుకు అవధానమివ్వాలి” అనే ప్రసంగం ఉంటుంది.

ఈ మూడు రోజుల సమావేశానికి హాజరవ్వడాన్ని గురించి ఇప్పుడే పథకం వేసుకోండి. మీకు సమీపంలో జరిగే సమావేశాన్ని గురించి తెలుసుకునేందుకు, యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరానికి గానీ, ఈ పత్రిక ప్రకాశకులకు గానీ వ్రాయండి.