“నేను దేవుని మీద నమ్మకముంచవలసిన అవసరముంది”
“నేను దేవుని మీద నమ్మకముంచవలసిన అవసరముంది”
కెనడాలోని, ఆల్బెర్టాలోని, ఎడ్మంటన్లోని యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి ఈ క్రింది ఉత్తరం వచ్చింది.
“ప్రియమైన సందేశకుడా:
“తనకు బహుశా తెలియకుండానే నా జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలపాలని ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను.
“కొన్ని వారాల క్రితం, ఒకసారి, నేనూ నా భర్తా బాగా వాదులాడుకుంటున్నాం. ‘ఇది చాలా పెద్ద విషయం, నేను దీన్ని అధిగమించగలనా అన్నది నాకు తెలియదు’ అని అన్నాను. అంతలోనే, కాలింగ్ బెల్ మ్రోగింది. ఒక యెహోవాసాక్షి మా ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. దాక్కోవడానికి వ్యవధి లేకుండా పోయింది.
“నేను తలుపు తెరిచినప్పుడు, ఆయన చెప్పిన మాటలను సరిగా వినలేకపోయాను. ‘పిల్లలు,’ ‘కుటుంబం’ అని ఆయన అనడం మాత్రం నాకు గుర్తుంది. కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని ఆయన బయటకు తీశాడు. నేను ఆ పుస్తకం పేరు చూసినప్పుడు, ఏడ్వడం మొదలుపెట్టాను. ఇక ఏడుపు ఆపుకోలేకపోయాను. ఆయన నన్ను చూసి, నన్ను కలతపెట్టినందుకు క్షమాపణలు కోరుతూ, నా చేతికి ఆ పుస్తకాన్ని అందించి వెళ్ళిపోయాడు.
“ఇంతకీ ఏమిటా అద్భుతం? ఏమి చేయాలో నాకు తెలియనప్పుడు కూడా చింతించనవసరం లేదు, ఎందుకంటే దేవునికి తెలుసు అన్న జ్ఞాపిక అది. నేను దేవుని మీద నమ్మకముంచవలసిన అవసరముంది. ఆయన తన సందేశకుడ్ని కూడా పంపించగలడు. మీకు నా కృతజ్ఞతలు.”
కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరం కాగలదు. ఈ పుస్తకంలో, మంచి నిర్దేశాలనిచ్చే కొన్ని అధ్యాయాలు: “మీ కుటుంబాన్ని వినాశకర ప్రభావాలనుండి కాపాడండి,” “మీ గృహంలో శాంతిని కాపాడుకోండి,” “కుటుంబానికి హాని కలిగించే సమస్యలను మీరు అధిగమించగలరు.”
192 పేజీల ఈ పుస్తకాన్ని గురించి మీరు మరెక్కువగా తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ ఇవ్వబడిన కూపన్ను నింపి, ఇక్కడ ఇవ్వబడిన చిరునామాకు గానీ, లేదా ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడిన మరేదైనా చిరునామాకు గానీ పంపించండి. మీరు సమస్యలను పరిష్కరించుకుని, సృష్టికర్త ఉద్దేశించినట్లుగా మీ కుటుంబ జీవితాన్ని ఆహ్లాదకరమైనదిగా చేసుకునేందుకు మీకు సహాయపడే నిర్దిష్ట సూచనలు మీకు లభిస్తాయి.
□ కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని గురించిన మరింత సమాచారాన్ని నాకు పంపించండి.
□ మా ఇంటికి వచ్చి నాతో ఉచితంగా బైబిలును పఠించేందుకు దయచేసి ఈ చిరునామాకు వచ్చి నన్ను సంప్రదించండి.