కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ఈ ప్రపంచం నాశనం అవుతుందా?

ఈ ప్రపంచం నాశనం అవుతుందా లేదా?

ఈ ప్రపంచం నాశనం అవుతుందా లేదా?

శాస్త్రవేత్తలు చెప్పిన ఒక భయంకరమైన ప్రకటనతో 2017వ సంవత్సరం మొదలైంది. ఎప్పుడూ లేనంతగా ఈ ప్రపంచం ఇప్పుడు నాశనానికి చాలా దగ్గర్లో ఉందని జనవరి నెలలో కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రపంచం నాశనానికి ఎంత దగ్గర్లో ఉందో వివరించడానికి శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను ఉపయోగిస్తున్నారు. అది నిజమైన గడియారం కాదు. రాబోయే నాశనాన్ని వివరించడానికి సూచనగా వాళ్లు దాన్ని ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఆ గడియారంలో నిమిషాల ముళ్లును 30 సెకన్లు ముందుకు లెక్కపెట్టారు. ఇప్పుడు డూమ్స్‌డే క్లాక్‌ను మధ్య రాత్రికి అంటే లోకాంతానికి రెండున్నర నిమిషాల ముందు సెట్‌ చేశారు. అంటే, గత 60 సంవత్సరాలలో ఎప్పుడూ చూడని విధంగా ప్రపంచం నాశనానికి దగ్గర్లో ఉంది!

మళ్లీ ఒకసారి 2018వ సంవత్సరంలో ప్రపంచం అంతం అవడానికి ఎంత దగ్గర్లో ఉందో శాస్త్రజ్ఞులు అంచనా వేయాలని అనుకుంటున్నారు. ప్రపంచానికి ఇంతవరకు జరగని ఒక నాశనం ముంచుకొస్తుందని ఆ గడియారం చూపిస్తుందా? మీరు ఏమి అనుకుంటున్నారు? ఈ ప్రపంచం నాశనం అయిపోతుందా? ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం మీకు కష్టంగా ఉండవచ్చు. నిజం చెప్పాలంటే, నిపుణులకు కూడా ఈ విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. లోకాంతం తప్పకుండా వస్తుందని అందరూ నమ్మడం లేదు.

నిజానికి, లక్షలమంది ప్రజలు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారు. ప్రజలతోపాటు ఈ భూమి ఎప్పుడూ సురక్షితంగా ఉంటుందని, మన జీవన విధానం ఇంకా మెరుగౌతుందని చాలా రుజువులు ఉన్నట్లు వాళ్లు అంటున్నారు. ఆ రుజువులు నమ్మదగినవేనా? ఈ ప్రపంచం ఇలానే ఉంటుందా? నాశనం అవుతుందా?