పత్రిక ముఖ్యాంశం | మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?
3. మొదలుపెట్టాక ఆపేయకండి
ఒక కొత్త అలవాటు మొదలుపెట్టాక దాన్ని అలవాటు చేసుకోవడానికి 21 రోజులు పడుతుంది అని చాలామంది అంటారు. నిజానికి, పరిశోధనలు చూపిస్తున్నట్లు పెద్దపెద్ద మార్పులు చేసుకోవడానికి కొంతమందికి తక్కువ సమయం పడుతుంది కానీ, కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది. అది చూసి మీరు నిరుత్సాహపడిపోవాలా?
ఇలా అనుకోండి: మీరు వారంలో మూడు రోజులు ఎక్సర్‌సైజ్ చేసేలా అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు.
-
మొదటి వారం మీరు అనుకున్నట్లే చేస్తారు.
-
రెండవ వారం మాత్రం ఒక రోజు చేయలేకపోతారు.
-
మూడవ వారంలో మీరు మళ్లీ దారిలో పడతారు.
-
నాలుగవ వారంలో మీరు ఒక్క రోజే ఎక్సర్‌సైజ్ చేస్తారు.
-
ఐదవ వారంలో మీరు అనుకున్నట్లు చేస్తారు. అప్పటినుండి ప్రతివారం ఆపకుండా ఎక్సర్‌సైజ్ చేయడం మీకు అలవాటు అయిపోయింది.
మీ కొత్త అలవాటును పటిష్ఠం చేసుకోవడానికి మీకు ఐదు వారాలు పట్టింది. అది చాలా కాలమని అనిపించినా, ఒకసారి మీరు చేరుకున్నాక, మీరు ఒక మంచి అలవాటు పెంచుకున్నందుకు సంతోషిస్తారు.
మంచి సలహా: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.” —సామెతలు 24:16.
ఏది చేసినా ఎక్కువ కాలం ఉండేలా బాగా ఆలోచించుకుని చేయమని బైబిలు అంటుంది. ఎందుకంటే చివరికి వచ్చేసరికి మనం ఎన్నిసార్లు పడిపోయాం అనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు తిరిగి లేచాం అనేదే ముఖ్యం.
చివరికి మనం ఎన్నిసార్లు పడిపోయాం అనేది ముఖ్యం కాదు కానీ ఎన్నిసార్లు తిరిగి లేచాం అనేదే ముఖ్యం
ఇలా చేయండి
-
ఒకసారి తప్పిపోయినంత మాత్రాన ఇంక మీరు పూర్తిగా ఓడిపోయారు అనే నిర్ణయానికి వచ్చేయకండి. దేని మీదైనా శ్రద్ధతో పనిచేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయని తెలుసుకోండి.
-
అనుకున్నట్లు సరిగ్గా జరిగిన సమయాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, మీరు మీ పిల్లలతో మాట్లాడే పద్ధతి మీద పనిచేస్తున్నట్లయితే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా పిల్లల మీద అరవాలని అనిపించినా అరవకుండా నన్ను నేను ఎంతకాలం క్రితం ఆపుకున్నాను? అప్పుడు అరిచే బదులు నేను ఏమి చేశాను? మళ్లీ అలానే చేయాలంటే నేనేమి చేయాలి?’ అలాంటి ప్రశ్నలు మీరు చేసిన పొరపాట్ల మీద కాకుండా మీరు సాధించిన విజయాల మీద మీ నమ్మకాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తాయి.
మీ జీవితంలో ఎన్నో విషయాల్లో ఉదాహరణకు కంగారు-ఆందోళనలతో పోరాడడానికి, కుటుంబం సంతోషంగా ఉండడానికి, నిజమైన సంతోషాన్ని పొందడానికి అవసరమైన బైబిలు సలహాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? యెహోవాసాక్షులతో మాట్లాడండి లేదా www.isa4310.com/te చూడండి. ◼ (g16-E No. 4)