బైబిలు చెప్తున్న విషయాలు ఈ కాలానికి సరిపోతాయా?
లేదు అని కొంతమంది అంటారు. ఒక కెమిస్ట్రీ క్లాస్ చెప్పడానికి ఎప్పుడో 1920ల్లో రాసిన టెక్స్ట్ బుక్‌ని ఉపయోగిస్తే ఎలా ఉంటుందో, మార్గనిర్దేశం కోసం బైబిల్ని ఉపయోగించడం కూడా అలానే ఉంటుందని ఒక డాక్టరు పోల్చాడు. అప్-టు-డేట్ అయిన ఒక కొత్త కంప్యూటర్ని ఉపయోగించడానికి ఎప్పుడో పాతపడిపోయి ఉపయోగంలో లేని ఒక కంప్యూటర్ మాన్యువల్‌ని మీరు ఉపయోగిస్తారా అని కూడా విమర్శకులు అడగవచ్చు. అంటే వేరే విధంగా చెప్పాలంటే కొంతమంది ఔట్‌డేట్ అయిపోయి అస్సలు పనికిరానిదానిలా బైబిల్ని చూస్తారు.
అలాంటి పూర్వకాలం నాటి గైడ్‌ని నేడున్న ఆధునిక హైటెక్ ప్రపంచంలో ఎవరైనా ఎందుకు వాడతారు? అయినా ఎన్నో వెబ్సైట్లు, బ్లాగ్లు ద్వారా లెటెస్ట్‌గా కావాల్సిన సలహాలు, సూచనలు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి. టీ.వీ పండితుల ద్వారా, టాక్ షోల ద్వారా ఎంతోమంది తెలివైన సైకాలజిస్టులు, లైఫ్‌స్టైల్ గురువులు, రచయితలు ఎన్నో విషయాలు చెప్తున్నారు. పుస్తకాల షాపుల్లో మనం సొంతగా తెలుసుకోగలిగేలా ఎన్నో పుస్తకాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద వ్యాపారం అయింది.
ఇలా నిమిషనిమిషానికి సమాచారం కొత్తగా వస్తుంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయడం పూర్తైన పుస్తకాన్ని ఎందుకు చూడాలి? ఇలాంటి పాత పుస్తకాన్ని నిర్దేశం కోసం ఉపయోగించడం ఔట్‌డేట్ అయిపోయిన కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్‌ని లేదా కంప్యూటర్ మాన్యువల్‌ని ఉపయోగించడం లాంటిది అని విమర్శకులు అనడంలో తప్పు లేదు కదా. కానీ నిజం చెప్పాలంటే అలాంటి పోలికలో నిజం లేదు. సైన్స్, టెక్నాలజీ చాలా త్వరగా మారిపోతున్నాయి కానీ మనిషి అవసరాలు మారాయా? ఇప్పటికీ ప్రజలు జీవితానికి ఉన్న అర్థం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, సాధ్యమైనంత వరకు సంతోషాన్ని, భద్రతను, మంచి కుటుంబ బాంధవ్యాలను, మంచి స్నేహాలను కావాలనుకుంటున్నారు.
ఎంత పాతదైనప్పటికీ బైబిలు ఇలాంటి ఎన్నో అవసరాల విషయాల్లోనే కాదు అంతకన్నా ఎక్కువ విషయాల్లో సహాయం చేస్తుంది. అంతేకాదు బైబిలు సృష్టికర్త ద్వారా ప్రేరేపించబడింది అని కూడా బైబిల్లో ఉంది. బైబిల్ మన జీవితంలో ప్రతీ విషయంలో నడిపిస్తుంది, ప్రతి పరీక్షకు మనల్ని సిద్ధం చేస్తుంది. (2 తిమోతి 3:16, 17) ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఉన్న ఉపదేశం ఏ కాలానికైనా సరిపోతుంది, అందులో ఉన్న సలహా ఎప్పటికీ పాతబడిపోదు. బైబిల్ గురించి బైబిలే ఇలా చెప్తుంది: “దేవుని వాక్యం సజీవమైనది.”—హెబ్రీయులు 4:12.
మరి బైబిల్ చేస్తున్న ఈ వాదన నిజమేనా? బైబిల్ పాతబడిపోయిందా లేదా ఎన్నో మంచి, విలువైన సలహాలు ఉన్న పుస్తకమా? నిజంగా అది ఒక సజీవ గ్రంథమా? ఈ కావలికోట, వరుసగా వచ్చే ప్రత్యేక శీర్షికల్లో మొదటిది. ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సహాయం చేయడమే ఈ కావలికోట ఉద్దేశం.