“నాకు ఇష్టం లేదు” అని చెప్పినవాళ్లతో యెహోవాసాక్షులు మళ్లీ ఎందుకు మాట్లాడతారు?
దేవుని మీద, అలాగే పొరుగువాళ్ల మీద ఉన్న ప్రేమతోనే యెహోవాసాక్షులు అందరికీ బైబిలు సందేశాన్ని ప్రకటిస్తారు. ఆ కారణంతోనే వాళ్లు “నాకు ఇష్టం లేదు” అని చెప్పిన వాళ్లతో కూడా మళ్లీ మాట్లాడతారు. (మత్తయి 22:37-39) మనకు దేవుని మీద ప్రేమ ఉంటే “పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని” ఆయన కుమారుడు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తాం. (అపొస్తలుల కార్యములు 10:42; 1 యోహాను 5:3) పూర్తిస్థాయిలో ప్రకటించడం కోసం, మేము దేవుని సందేశాన్ని చెప్పడానికి ప్రజల దగ్గరకు ఒకటికన్నా ఎక్కువసార్లు వెళ్తాం. ప్రాచీనకాలంలోని దేవుని ప్రవక్తలు కూడా అలానే చేశారు. (యిర్మీయా 25:4-6) మేము మా పొరుగువాళ్లను ప్రేమిస్తాం కాబట్టే ప్రాణాలు కాపాడే ‘రాజ్యం గురించిన మంచివార్తను’ ఇష్టం లేదని చెప్పినవాళ్లతో సహా అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాం.—మత్తయి 24:14.
ఇష్టం లేదని ఒకసారి చెప్పినవాళ్ల ఇంటికి మళ్లీ వెళ్లినప్పుడు వాళ్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే,
వేరేవాళ్లు ఆ ఇంట్లోకి రావడం.
ఆ ఇంట్లోని ఇతరులకు మా సందేశం పట్ల ఆసక్తి ఉండడం.
ప్రజల అభిప్రాయాల్లో మార్పు రావడం. ప్రపంచంలో జరిగే సంఘటనలు లేదా తమ జీవితాల్లో జరిగే సంఘటనల వల్ల కొంతమంది “దేవుని నిర్దేశం తమకు అవసరమని” గుర్తిస్తుంటారు. అంతేకాదు బైబిలు సందేశం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. (మత్తయి 5:3) ఒకప్పుడు బైబిలు సందేశాన్ని ఇష్టపడని వాళ్లు కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంది. అపొస్తలుడైన పౌలు విషయంలో అదే జరిగింది.—1 తిమోతి 1:13.
కానీ మేము మాత్రం, మేము చెప్పే సందేశాన్ని వినమని ఎవ్వర్నీ బలవంతం చేయం. (1 పేతురు 3:15) ఎవర్ని ఆరాధించాలనే నిర్ణయాన్ని ఎవరికి వాళ్లు సొంతగా తీసుకోవాలని మేం నమ్ముతాం.—ద్వితీయోపదేశకాండము 30:19, 20.