బెతెల్ టూర్లు
మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.
టూర్లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్ పాజిటీవ్ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్ పాజిటీవ్ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.
క్యూబా
టూర్ సమాచారం
టూర్‌కి రావడానికి ముందు మీరు రిజర్వేషన్ చేసుకోవాలా? అవును, చేసుకోవాలి. ఎక్కువ రద్దీ లేకుండా అందరూ టూర్‌ని ఆనందించేలా, సందర్శకులు ముందే టూర్ రిజర్వ్ చేసుకోవాలని కోరుతున్నాం. వస్తున్నది కొంతమంది అయినా సరే, కనీసం ఒక వారం ముందే టూర్ రిజర్వ్ చేసుకోవాలి. ఒకవేళ పబ్లిక్ హాలిడేస్ సమయంలో మీరు సందర్శించాలనుకుంటే ఇంకా ముందే టూర్‌ని రిజర్వ్ చేసుకోండి.
రిజర్వేషన్ లేకపోయినా టూర్ దొరుకుతుందా? ఒకవేళ మీరు టూర్ రిజర్వ్ చేసుకోకపోతే, మేము మీకు టూర్ ఇవ్వలేకపోవచ్చు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి, రోజుకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలకు టూర్ ఇవ్వడం వీలౌతుంది.
టూర్ కోసం మీరు ఏ టైంకి రావాలి? రద్దీ లేకుండా ఉండాలంటే, మీ టూర్ రిజర్వేషన్ టైంకి కనీసం 15 నిమిషాల ముందు రావచ్చు.
టూర్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి? మీ గ్రూప్‌లో 11 కన్నా తక్కువమంది ఉంటే “రిజర్వేషన్ చేయి—11 కన్నా తక్కువమంది కోసం” బటన్ మీద క్లిక్ చేయండి. లేదంటే, మా ఈ-మెయిల్ అడ్రస్‌కి రాయండి: InboxLOBBY.CU@bethel.isa4310.com లేకపోతే, కిందున్న మా నెంబర్‌కి ఫోన్ చేసి 11 లేదా అంతకన్నా ఎక్కువమందికి టూర్ రిజర్వ్ చేసుకోండి.
టూర్ రిజర్వేషన్ మార్చవచ్చా లేదా క్యాన్సిల్ చేయవచ్చా? చేయవచ్చు. “రిజర్వేషన్లు చూపించు/మార్చు” బటన్ మీద క్లిక్ చేయండి.
మీకు కావల్సిన తేదీల్లో టూర్ లేకపోతే ఏంచేయాలి? వెబ్‌సైట్‌ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇతరులు రిజర్వేషన్లను మార్చుకున్నప్పుడు లేదా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు టూర్లు అందుబాటులోకి వస్తాయి.
రిజర్వేషన్ చేయి—11 కన్నా తక్కువమంది కోసం
అడ్రస్, ఫోన్ నంబర్
Avenida 15 #4608
Between Calle 46 and Calle 48
PLAYA, LA HABANA
CUBA
+53 7-204-7598
+53 7-204-1026
నిర్దేశాలు చూపించు