కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నాకు స్నేహితులు ఎందుకు లేరు?

నాకు స్నేహితులు ఎందుకు లేరు?

మీరు ఇంటర్నెట్‌లో, ఈ మధ్యే జరిగిన ఒక పార్టీ ఫొటోలు చూస్తున్నారు. ఆ పార్టీలో మీ ఫ్రెండ్స్‌ అందరూ ఉన్నారు, వాళ్లు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ ఏదో తగ్గింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అక్కడ ఒక వ్యక్తి తగ్గారు, అది … మీరే!

‘నన్నెందుకు పిలవలేదు?’ అని మీకు అనిపించింది.

మీ కుతూహలం కోపంగా మారింది. వాళ్లు ద్రోహం చేశారని మీకు అనిపించింది. వాళ్లతో మీకున్న బంధాలన్నీ పేక మేడలా కూలిపోయాయా అనిపించింది. ఒంటరితనం మిమ్మల్ని కమ్మేసి, మీ మనసులో ఓ ప్రశ్న మెదిలింది, ‘నాకు ఫ్రెండ్స్‌ ఎందుకు లేరు?’

 ఒంటరితనం గురించి క్విజ్‌

 అవునా, కాదా?

  1.   మీకు చాలామంది ఫ్రెండ్స్‌ ఉంటే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

  2.   మీరు ఒక సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయితే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

  3.   మీరు మెసేజ్‌లు ఎక్కువగా పంపిస్తూ ఉంటే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

  4.   మీరు వేరే వాళ్లకోసం ఏదైనా పని చేస్తే, మీకు అస్సలు ఒంటరితనం ఉండదు.

 ఈ నాలుగు వాక్యాలకూ, ‘కాదు’ అనేదే జవాబు.

 ఎందుకు?

 స్నేహం, ఒంటరితనం గురించిన నిజాలు

  •   చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

     “నేను నా ఫ్రెండ్స్‌ని పట్టించుకుంటాను, అయినా వాళ్లు నన్ను పట్టించుకోవట్లేదని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మీ చుట్టూ ఫ్రెండ్స్‌ ఉండి, వాళ్లు మిమ్మల్ని ప్రేమించకపోతే, మీరు అక్కర్లేదన్నట్లు వాళ్లు ప్రవర్తిస్తే అంతకంటే ఘోరమైన ఒంటరితనం ఇంకొకటి ఉండదు.”ఆన్‌.

  •   ఒక సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయినంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

     “కొంతమంది బొమ్మల్ని పోగేసుకున్నట్లు, ఫ్రెండ్స్‌ని పోగేసుకుంటారు. కానీ అలా పోగేసుకున్న ఫ్రెండ్స్‌ బోలెడంతమంది ఉన్నా, ప్రేమించేవాళ్లు ఉన్నారనే ఫీలింగ్‌ రాదు. మంచి స్నేహబంధం లేకపోతే ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌ అందరూ ప్రాణం లేని బొమ్మలతో సమానం.”ఇలాన్‌.

  •   మెసేజ్‌లు ఎక్కువగా పంపిస్తూ ఉన్నంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

     “మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు, మీ ఫ్రెండ్స్‌ ఎవరైనా మెసేజ్‌ పంపారేమోనని ఫోన్‌ చూసుకుంటూ ఉంటారు. మీరు అసలే ఒంటరితనంతో బాధపడుతున్నారు, తీరా ఫోన్‌ చూశాక, మీతో మాట్లాడడానికి కనీసం ఒక్కరు కూడా ట్రై చేయలేదని తెలుస్తుంది, అప్పుడు మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.”సరీన.

  •   వేరేవాళ్ల కోసం ఏదైనా పని చేసినంత మాత్రాన, మీకు అస్సలు ఒంటరితనం ఉండదన్న గ్యారంటీ లేదు.

     “నేను నా ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ వాళ్లు నాతో అలా ఉండడం లేదు. నేను వాళ్లతో దయగా ఉన్నందుకు నేను బాధపడట్లేదు, కానీ వాళ్లు నాతో ఎప్పుడూ దయగా ఉండకపోవడం చూసి నాకు బాధగా అనిపిస్తుంది.”రిచర్డ్‌.

 ఒక్కమాటలో: ఒంటరితనం అనేది ఒక మానసిక వైఖరి. “అది మనిషి మనసులో ఏర్పడుతుందే గానీ అతని చుట్టూ ఏర్పడదు.” అని జనెట్‌ అనే యువతి అంటోంది.

 మీకు ఫ్రెండ్స్‌ లేరని, ఒంటరివాళ్లు అయిపోయారని మీకు అనిపిస్తే మీరు ఏమి చేయాలి?

 ఈ పోరాటంలో గెలిచేదెలా?

ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.

 “అభద్రతా భావాల వల్ల ఒంటరితనం కలుగుతుంది. మీరు ఎదుటివాళ్లు ఇష్టపడేంత గొప్ప వ్యక్తి కాదని మీరనుకుంటే, మీరు ఎవరికీ దగ్గరవ్వలేరు, ఎవరితోనూ స్నేహం చేయలేరు.”జనెట్‌.

 బైబిలు ఇలా చెప్తోంది: “నిన్ను వలె [నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే, NW] నీ పొరుగువానిని ప్రేమించుము.” (గలతీయులు 5:14) మంచి స్నేహాన్ని ఎంజాయ్‌ చేయాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, అలాగని స్వార్థంతో కూడిన గర్వాన్ని పెంచుకోకూడదు.—గలతీయులు 6:3, 4.

మీ మీద మీరు జాలిపడకడి.

 “ఒంటరితనం ఊబి లాంటిది, మీరు అందులో పడి కొట్టుకునేకొద్దీ లోతుకు వెళ్లిపోతూ ఉంటారు. మీరు మీ గురించే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటే, మీ మీద జాలిపడడానికి మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు.”ఎరిన్‌

 బైబిలు ఇలా చెప్తోంది: “ప్రేమ … స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరింథీయులు 13:4, 5) నిజమేంటంటే, మనం మన గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకుంటుంటే, మనలో కరుణ తగ్గిపోతుంది, అప్పుడు మనతో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. (2 కొరింథీయులు 12:15) ఒకటి మాత్రం నిజం: మీ గెలుపును ఎదుటివాళ్ల ప్రవర్తన ఆధారంగా నిర్ణయించుకుంటే మీరు తప్పకుండా ఓడిపోతారు! “నన్నెవరూ పిలవరు,” “నన్ను ఎవరూ ఎక్కడికీ ఆహ్వానించరు” అనే మాటలు మీ సంతోషాన్ని ఎదుటివాళ్ల చేతుల్లో పెట్టేస్తాయి. అంటే మీరు వాళ్లకు కాస్త ఎక్కువ అధికారం ఇచ్చేస్తున్నట్లే కదా?

ఎవరితో పడితే వాళ్లతో స్నేహ చేయకడి.

 “ఒంటరితనంతో బాధపడేవాళ్లు, తమను పట్టించుకునేవాళ్ల కోసం చూస్తారు, అలా ఒక్కోసారి వాళ్లు తమను పట్టించుకునేవాళ్లు ఎలాంటివాళ్లైనా ఫర్లేదనే పరిస్థితికి వచ్చేస్తారు. తమను కావాలనుకునే వాళ్లు ఉన్నారన్న ఫీలింగ్‌ వాళ్లకు ఇష్టం. కానీ కొంతమంది మీరు తమకు ముఖ్యమైనవాళ్లన్న ఫీలింగ్‌ మీకు కలిగించి, మిమ్మల్ని వాడేసుకుంటారు. అప్పుడు మీ ఒంటరితనం మరీ ఘోరంగా ఉంటుంది.”బ్రీయాన్‌.

 బైబిలు ఇలా చెప్తోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) బాగా ఆకలితో ఉన్నవాళ్లు ఏది పడితే అది తినేస్తారు. అలాగే, ఫ్రెండ్స్‌ కరువైనవాళ్లు ఫ్రెండ్స్‌ కోసం తప్పుడు ప్రదేశాలన్నీ వెదుకుతారు. అలాంటి సంబంధాలు మామూలేనని, తమకు అంతకంటే మంచివి దొరకవని అనుకుంటూ వాళ్లు సులువుగా మోసగాళ్ల వలలో పడిపోతారు.

 చివరిమాట: ప్రతీ ఒక్కరు ఏదోక సమయంలో ఒంటరితనాన్ని అనుభవిస్తారు; కాకపోతే కొంతమంది ఒంటరితనంతో మరీ ఎక్కువ బాధపడతారు. ఒంటరితనం అనేది నిజంగా చాలా బాధాకరమైన ఫీలింగే, కానీ అది ఒక ఫీలింగ్‌ మాత్రమే. మన ఆలోచనల వల్లే ఫీలింగ్‌ అనేది కలుగుతుంది, మన ఆలోచనలను మనం కంట్రోల్‌ చేసుకోగలం.

 ఎదుటివాళ్ల నుండి మరీ ఎక్కువ ఆశించకండి. “ప్రతీ ఒక్కరూ మీకు చిరకాల సన్నిహిత మిత్రులు అయిపోరు, అంటోంది పైన చెప్పిన జనెట్‌. తను ఇంకా ఇలా చెప్తోంది: “కానీ మిమ్మల్ని పట్టిచుకునేవాళ్లు మీకు తప్పకుండా దొరుకుతారు. అలా పట్టించుకుంటే చాలు, అదే ఒంటరితనాన్ని దూరం చేసేస్తుంది.”

 మరింత సహాయం కావాలా? స్నేహం గురించి మీకున్న భయాల్ని అధిగమించండి” అనే భాగాన్ని చదవండి. ఇంకా, “ఒంటరితనాన్ని ఓడించండి” అనే వర్క్‌షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.